Mango Peel Facemask: మామిడిపండ్లు తిన్నాక తొక్కలు పడేస్తున్నారా? ఆ తొక్కలతో ఇలా ఫేస్ మాస్క్ వేసుకోండి, చర్మం మెరుస్తుంది-are you shedding the peel after eating mangoes apply this face mask with mango peels and the skin will glow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Peel Facemask: మామిడిపండ్లు తిన్నాక తొక్కలు పడేస్తున్నారా? ఆ తొక్కలతో ఇలా ఫేస్ మాస్క్ వేసుకోండి, చర్మం మెరుస్తుంది

Mango Peel Facemask: మామిడిపండ్లు తిన్నాక తొక్కలు పడేస్తున్నారా? ఆ తొక్కలతో ఇలా ఫేస్ మాస్క్ వేసుకోండి, చర్మం మెరుస్తుంది

Haritha Chappa HT Telugu
Apr 24, 2024 07:00 AM IST

Mango Peel Facemask: వేసవి వచ్చిందంటే తీయటి మామిడి పండ్లు నోరూరిస్తూ ఉంటాయి. మామిడి పండ్లు తొక్కలను పడేసి లోపల గుజ్జును మాత్రమే తింటాము. తొక్కతో మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు

మామిడి తొక్కల ఫేస్ మాస్క్
మామిడి తొక్కల ఫేస్ మాస్క్ (pixabay)

Mango Peel Facemask: మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వాటి కోసం ఏడాదంతా ఎదురుచూసే వాళ్ళు ఎంతోమంది. మామిడి పండ్లు చర్మాన్ని మెరిపిస్తాయి కూడా. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. మామిడి పండ్లు తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది.

మామిడి పండ్లు ఎందుకు తినాలి?

ముఖంపై ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా మామిడిపండు చేస్తుంది. అంతేకాదు సూర్యకిరణాల నుంచి చర్మాన్ని తాకే అతినీలలోహిత కారణాలవల్ల ఎలాంటి నష్టం జరగకుండా కాపాడే శక్తి కూడా దీనికి ఉంది. అయితే కేవలం మామిడిపండులోనే కాదు, మామిడి తొక్కలో కూడా ఎంతో శక్తి ఉంది. మామిడి తొక్కతో ఫేస్ మాస్క్ తయారు చేసుకుని వేసుకుంటే చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు కాంతిని అందిస్తుంది.

మామిడి పండ్లలో అలాగే మామిడి తొక్కల్లో కూడా హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువ. అంటే చర్మానికి తేమను పోషణను అందిస్తాయి. చర్మాన్ని మృదువుగా మెరుపుతో ఉండేలా చేస్తాయి. మామిడి పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. అలాగే మామిడి తొక్కను మీ సౌందర్య సాధనంగా వినియోగించుకోండి. చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి మామిడి తొక్క ఫేస్ మాస్క్ ను ఒకసారి ట్రై చేయండి.

మామిడి తొక్క ఫేస్ మాస్క్ తయారీ

మామిడి తొక్కను తొలగించి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్లో ఈ మామిడి తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. దీన్ని మెత్తని పేస్టులాగా చేసి చిన్న కప్పులో వేసుకోవాలి. ఆ మామిడి తొక్కల పేస్టులో ఒక స్పూన్ పెరుగు లేదా తేనెను వేసి కలపాలి. దాన్ని బాగా కలిపాక ఆ పేస్టును ముఖానికి ఫేస్ మాస్క్‌లా వేసుకోవాలి. ఒక పావుగంట పాటు అలా వేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలాగే చర్మాన్ని మెత్తటి టవల్‌తో ఒత్తి తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు మీ చర్మంలోనికి చొచ్చుకుని వెళ్తాయి. చర్మం రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎప్పుడు అయితే ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల తేమ బయటకు పోకుండా చర్మం లోపలే లాక్ చేసి ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మామిడి తొక్క ఫేస్ మాస్క్ ట్రై చేయండి. ఇది మీ చర్మాన్ని హైడ్రేటింగ్ చేయడంతో పాటు మెరుపు వచ్చేలా చేస్తుంది.

WhatsApp channel

టాపిక్