Wheat Rava Upma : గోధుమ రవ్వ ఉప్మా.. చేయడం సులభం.. తింటే టేస్టీ-breakfast recipes wheat rava upma for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakfast Recipes Wheat Rava Upma For Breakfast

Wheat Rava Upma : గోధుమ రవ్వ ఉప్మా.. చేయడం సులభం.. తింటే టేస్టీ

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 06:30 AM IST

Wheat Rava Upma : గోధుమ పిండితో చపాతీలు తయారు చేసుకుంటారు. ఆరోగ్యానికి మంచిది. అవి బరువును తగ్గిస్తాయి. అయితే గోధుమ రవ్వ ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

గోధుమ రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా

Wheat Rava Upma : గోధుమ పిండితో చపాతీలు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంచుతాయి. అయితే గోధుమలను రవ్వలాగా తయారు చేసుకుని.. ఉప్మా చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోధుమల ద్వారా తీసిన రవ్వతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గేందుకు పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి.

కావాల్సినవి..

గోధుమ ర‌వ్వ-ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర-అర టీ స్పూన్, ఆవాలు-అర టీ స్పూన్, ప‌ల్లీలు-2 టేబుల్ స్పూన్స్, ఉప్పు-రుచికి స‌రిప‌డా, నెయ్యి-ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ-1, త‌రిగిన ప‌చ్చి మిర్చి-2, త‌రిగిన ట‌మాటాలు-2, క‌రివేపాకు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం తరిగినది కొద్దిగా, నూనె-2 టేబుల్ స్పూన్స్, నీళ్లు-3 క‌ప్పులు.

మెుదట ఒక కళాయిలో నెయ్యిని వేసి చిన్న మంటపై గోధుమ రవ్వను వేయించుకోవాలి. ఆ తర్వాత ఒ ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి.. కాగిన తర్వాత పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన అల్లం, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టమాట ముక్కలు వేయించుకోవాలి.

ఇప్పుడు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. నీరు పూర్తిగా మరిగే వరకూ ఉంచుకోవాలి. నీరు మరిగిన అనంతరం.. వేయించిన గోధుమ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఉండలు కట్టనివ్వకూడదు. రవ్వ ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉండే.. గోధుమ రవ్వ ఉప్మా తయారు అవుతుంది. టమాట చట్నీలో కలుపుకొని తింటే ఆహా అంటారు.

WhatsApp channel

టాపిక్