Ragi Rotte : అల్పాహారంగా రాగి రొట్టె.. ఇలా తయారు చేయండి
Ragi Rotte : రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. చిరు ధాన్యాల్లో ఇది కూడా ఒకటి. చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఉదయం పూట రాగి రొట్టే తినండి.
రాగులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. బరువు తగ్గడంలో, షుగర్ ను అదుపులో ఉంచేందుకు, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడం, ఎముకలను బలంగా చేయడం, రక్తహీనత సమస్యను బయటపడేసేందుకు రాగులు ఉపయోగపడతాయి. అయితే రాగి జావ అందరికీ తెలుసు. దానిని ఉదయం పూట తీసుకుంటే.. స్ట్రాంగ్ అవుతారు. రోజూ రాగి జావ తీసుకోలేని వారు.. అల్పాహారంగా తయారు చేసుకోవచ్చు.
రాగుల పిండితో వివిధ రకాలుగా వంటలు చేయోచ్చు. వీటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రాగిపిండితో చేసుకునే వాటిల్లో రాగి రొట్టె కూడా ఒకటి. చాలా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుచిగా ఉంటుంది. ఆరోగ్యానిగి కూడా చాలా మంచిది.
కావాల్సిన పదార్థాలు..
రాగిపిండి-2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ-1, తరిగిన పచ్చిమిర్చి-2, క్యారెట్ తురుము-పావు కప్పు, ఉప్పు-కొద్దిగా, కొద్దిగా తరిగిన కొత్తిమీర, నెయ్యి-ఒక టేబుల్ స్పూన్, తగినన్ని వేడి నీళ్లు.
మెుదట ఓ గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తి మీర వేసి కలుపుకోవాలి. తర్వాత నెయ్యి వేసి కలపాలి. ఇక తగినన్ని వేడి నీళ్లు పోసుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలిథిన్ కవర్ ను తీసుకుని.. దానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. తర్వాత పిండిని కొంచెం తీసుకుని.. చేతితో రొట్టెలాగా ఒత్తుకోవాలి.
ఇక స్టౌవ్ మీద పెనం పెట్టాలి. వేడి అయ్యాక.. వేసి కాల్చాలి. దీనిపై నూనె వేస్తూ.. రెండు వైపులా.. ఎర్రగా అయ్యే వరకూ కాల్చుకోవాలి. ఇక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే.. ఎంతో రుచిగా రాగి రొట్టె తయారు అవుతుంది. చట్నీ లేదా రైతాతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. రాగి పిండితో రొట్టెలు చేసుకుని.. తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
సంబంధిత కథనం