Wheat Rava Upma : గోధుమ రవ్వ ఉప్మా.. చింతపండుతో చేస్తే అదిరిపోతుంది-breakfast recipe ideas how to make wheat rava upma for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wheat Rava Upma : గోధుమ రవ్వ ఉప్మా.. చింతపండుతో చేస్తే అదిరిపోతుంది

Wheat Rava Upma : గోధుమ రవ్వ ఉప్మా.. చింతపండుతో చేస్తే అదిరిపోతుంది

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 06:30 AM IST

Wheat Rava Upma : ఉప్మాను రోజూ ఒకేలా చేసుకుని ఏం తింటారు. అందుకే గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్టీకి టేస్టీగా ఉంటుంది.

గోధుమ రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా

గోధుమ రవ్వ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో చేసే వంటకాలు టేస్టీగా కూడా ఉంటాయి. సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి గోధమ రవ్వ ఉప్మాను చేసుకోండి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే రోజూ చేసేలాగా కాకుండా.. కాస్త చింతపండు రసం వేసి.. ఈ ఉప్మాను తయారు చేయండి. మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

గోధుమ ర‌వ్వ ఉప్మాకు ఏమేం కావాలంటే..

నెయ్యి-ఒక టీ స్పూన్, గోధుమర‌వ్వ-ఒక క‌ప్పు, నూనె-రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు-ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు-ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు-ఒక టీ స్పూన్, ఎండుమిర్చి-మూడు, జీల‌క‌ర్ర-ఒక టీ స్పూన్, క‌రివేపాకు కొంచెం, త‌రిగిన ప‌చ్చిమిర్చి-2, కాస్త ఇంగువ, ఉల్లిపాయ ఒకటి తరిగినది, బ‌ఠాణీ-పావు క‌ప్పు, నాన‌బెట్టిన చింత‌పండు కొంచెం, నీళ్లు-3 క‌ప్పులు, ఉప్పు త‌గినంత‌, బెల్లం తురుము-ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తరిగినది.

ఎలా తయారు చేయాలంటే..

చింతపండులో 3 కప్పుల నీళ్లు పోసి రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కళాయిలో నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత.. గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి. గోధుమ రవ్వ చక్కగా వేగిన తర్వాత.. ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత.. ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠాణీ వేసి కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత.. ఉప్పు, చింతపండు రసం వేసి కలపాలి.

ఇక చింతపండు రసం కొంచెం మరిగాక.. వేయించిన గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టి రవ్వను ఉడికించుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఇక రవ్వ ఉడికిన తర్వాత.. కొత్తిమీర చల్లుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే.. టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా తయారు అయినట్టే. ఉదయం అలాహారంగా తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్