అసౌకర్యమైన Bra ధరించడం వలన దుష్ప్రభావాలు ఉంటాయి, చూడాల్సినవి ఇవీ!
ఆకృతికి తగినట్లుగా సరైన పరిమాణం లేని బ్రాలను ధరించడం వలన అసౌకర్యంగా ఉండటంతో పాటు శారీరక నొప్పులు, వక్షోజాల అసమానతలకు కారణమవుతుంది. బ్రా ఎంచుకునేటపుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోండి.
Bra size matters (Unsplash)
ఆరోగ్యానికి సంబంధించిన సమస్య చెప్పుకోవాల్సి వచ్చినపుడు సిగ్గు పడాల్సిన అవసరం లేదు. మహిళల్లో రొమ్ము నొప్పులు, భుజం నొప్పి, లేదా వెన్ను నొప్పులు కలగడానికి అసౌకర్యమైన బ్రా ధరించడం కూడా ఒక కారణం కావొచ్చు. చాలా మంది మహిళలు ఈ విషయాన్ని చెప్పలేక బిడియంతో ఉంటారు, లేదా ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందని గ్రహించలేకపోవచ్చు.
చాలా బిగుతుగా ఉండే, పెద్ద సైజులో ఉండే లేదా సరిగ్గా సరిపోని పట్టీలు కలిగిన బ్రాని ధరిస్తే పలు భాగాల్లో నొప్పి కలగడమే కాకుండా రొమ్ముల్లో అసమానత, ఇతర శారీరక దుష్రభావాలు ఎదురుకావొచ్చు. అయితే సరైన సైజును ఎంచుకుంటే ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. సరైన సైజు ఎలా ఎంపిక చేసుకోవడానికి బ్రా తయారీదారుల అందించిన సూచనలు ఇక్కడ పేర్కొన్నాం.
సరైన బ్రా సైజ్ కోసం ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి
- మీకు బాగా సరిపోయే సౌకర్యవంతమైన నాన్-ప్యాడెడ్ బ్రాను ధరించండి. ఇది మీ రొమ్ము కణజాలం పైకి లేచి ఒత్తిడికి గురికాకుండా ఉండేలా చేస్తుంది. సరిగ్గా రొమ్ములకు ఒదిగి పోయినట్లుగా ఉంటుంది. ఈ బ్రా మీకు బాగా సరిపోయినట్లు సూచిస్తుంది.
- మీకు మీరుగా ఒక టేప్‌తో మీ ఛాతి భాగాన్ని కొలుచుకోండి. బస్ట్ కింద ఉన్న ప్రాంతాన్ని కొలవడం నుంచి ప్రారంభించండి. వాటి చుట్టుకొలత కొలిచిన తర్వాత మీ బ్రా పరిమాణంపై మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి కచ్చితమైన సైజు కలిగిన బ్రాను ఎంపిక చేసుకోవచ్చు.
- బ్యాండ్ సైజ్ కూడా అవసరం. మీ బ్యాండ్ పరిమాణాన్ని కొలిచేటప్పుడు, టేప్‌ను చాలా గట్టిగా లేదా చాలా వదులుగా ఉంచకుండా సరిగ్గా ఉండేలా జాగ్రత్త వహించండి. బ్యాండ్ సైజ్ సాధారణంగా 32, 34, 36 ఇలా ఉండొచ్చు. మీరు సులభంగా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా, నడిచేటపుడు బౌన్స్ అవ్వకుండా ఉండేటువంటి అత్యంత సౌకర్యవంతమైన బ్రా పరిమాణాన్ని ఎంచుకోవాలి.
- మీ కప్పు పరిమాణాన్ని కొలిచేటపుడు మీ బస్ట్ పూర్తి భాగాన్ని కొలవాలని గుర్తుంచుకోండి. దీనివల్ల ఇబ్బందికరమైన ఖాళీలు లేదా ఉబ్బెత్తులను ఎదుర్కోవాల్సిన సమస్య ఉండదు.
- అవసరాలకు తగినట్లుగా సరైన స్టైల్ బ్రాలను ఎంచుకోవడం కూడా ముఖ్యమే. పుష్-అప్ బ్రా, బాల్కోనెట్ బ్రా, మినిమైజర్ బ్రా లేదా స్పోర్ట్స్ బ్రా ఇలా ఇందులో మీ అవసరం ఎందుకోసం గుర్తించి ఆ ప్రకారంగా బ్రాను ఎంచుకోండి. విభిన్న స్టైల్‌లను ఎంచుకునేటప్పుడు పరిమాణాలలో స్వల్ప మార్పులు చేసుకోండి. మీరు సాధారణంగా C సైజ్ బ్రా ధరిస్తూ ఉంటే, ప్యాడెడ్ స్టైల్‌ని ఎంచుకునేటపుడు సైజ్ Bని ఎంచుకోండి.
సరైనది ఎంచుకోండి, ఆత్మవిశ్వాసంతో ఉండడి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి
సంబంధిత కథనం