Monsoon Destinations: ఫ్యామీలితో ఈ ప్లేసెస్‌కి వెళ్లండి.. నేచర్‌ని ఎంజాయ్ చేయండి
Destinations in India During Monsoon : చాలామంది సమ్మర్లో వెకేషన్‌కి వెళ్లాలి అనుకుంటారు కానీ.. మాన్సూన్లో వెళ్లాల్సిన కొన్ని ప్రదేశాలున్నాయి. ఈ టైమ్‌లో అక్కడికి వెళ్తే మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇండియాలోనే ఉన్న ఆ ప్లేస్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Destinations in India During Monsoon : వర్షాకాలంలో ఫ్యామిలీతో ఓ ట్రిప్‌కు వెళ్లాలనుకుంటే.. భారత్‌లోనే మంచి ప్రదేశాలున్నాయి. మీకు తెలుసా ఈ ప్రాంతాలకు మీరు మీ ఫ్యామిలితో సహా వెళ్లొచ్చు. పెద్ద పెద్ద సరస్సులు, జలపాతాలు, పచ్చని లోయలు మీ కళ్లకు మంచి ఫీల్ ఇస్తాయి. మరి మీరు కూడా ట్రిప్ వేయాలనుకుంటే ఈ ప్రాంతాలకు వెళ్లిపోండి.
షిల్లాంగ్
మేఘాలయ షిల్లాంగ్ దిగువన ఉన్న స్కాట్లాండ్‌గా వర్ణిస్తారు. షిల్లాంగ్ నగరం స్కాట్లాండ్ ఆకారంలో ఉంటుంది. వలసరాజ్యాల కాలం నాటి అవశేషాలను ఇక్కడ చూడవచ్చు. వర్షాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. పొగమంచుతో స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. షిల్లాంగ్‌లో ఎలిఫెంట్ ఫాల్స్, ఉమియామ్ లేక్, మావినాంగ్ ఫాల్స్, లైత్లాం హిల్స్ తప్పక చూడవచ్చు.
మున్నార్
కేరళలోని మున్నార్ కుటుంబ సమేతంగా ఆనందించే ప్రదేశం. క్యాంపింగ్, ట్రెక్కింగ్, షికారా రైడ్‌లు సాహసంతో కూడుకున్నవి. ఈ సమయంలో ఈ రైడ్స్ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. జంతు ప్రేమికులు కర్మలగిరి ఎలిఫెంట్ పార్క్ తప్పక సందర్శించాలి. మున్నార్ మార్కెట్‌లో షాపింగ్ చేయడానికి చాలా వస్తువులు ఉంటాయి. కేరళ ప్రత్యేక వంటకాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి.
మహాబలేశ్వర్
మహారాష్ట్ర పూణే నుంచి కొన్ని గంటల ప్రయాణం చేస్తే మహాబలేశ్వర్ ఉంది. పశ్చిమ కనుమలలో నెలకొని ఉన్న మహాబలేశ్వర్ వర్షాకాలంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. సూర్యాస్తమయంలో దీనిని తప్పక చూడాలి. అక్కడ ట్రెక్కింగ్‌కి వెళ్లండి. మాప్రో పార్క్ గొప్పగా ఉంటుంది. అక్కడి దుకాణాలలో రుచికరమైన పిజ్జా, స్ట్రాబెర్రీ క్రీమ్, స్ట్రాబెర్రీ ఫ్రూట్, శాండ్‌విచ్‌లు చాలా రుచికరంగా ఉంటాయి.
పుదుచ్చేరి
పుదుచ్చేరి ఒక ఫ్రెంచ్ కాలనీ. 1954లో ఇది స్వతంత్రంగా మారింది. బెంగాల్ తీరంలో ఉన్న ఈ నగరంలో ఫ్రెంచ్ వాస్తుశిల్పంతో నిర్మించిన పురాతన నిర్మాణాలు ఉన్నాయి. పాండిచ్చేరి అని కూడా పిలిచే ఈ నగరంలో సందర్శించడానికి అనేక చర్చ్‌లు ఉన్నాయి.
మౌంట్ అబూ
రాజస్థాన్ ఈ హిల్ స్టేషన్ వర్షాకాలంలో చూడదగ్గ దృశ్యాలు కనిపిస్తాయి. మౌంట్ అబూ వద్ద ఉన్న సూర్యాస్తమయం పాయింట్ నుంచి చూస్తే అదే బెస్ట్ మెమోరీ అవుతుంది. మౌంట్ అబూ వన్యప్రాణుల అభయారణ్యం మరొక ఆసక్తికరమైన ప్రదేశం. దిల్వారా ఆలయం, నక్కి సరస్సులో బోటింగ్ తప్పక చూడవలసినవి. ఉదయపూర్ విమానాశ్రయం సమీపంలోనే ఉంటుంది.
సంబంధిత కథనం