Holi 2022 | హోలీని ఎందుకు జరుపుకుంటారో.. పురాణాలు ఏమంటున్నాయో తెలుసా?
దేశ వ్యాప్తంగా హోలీ సందడి మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రంగుల పండుగను చేసుకుంటారు. హోలీ ముందుకు రోజు.. అంటే ఈరోజు హోలికా దహన్ జరుపుతారు. అయితే హోలీని ఎందుకు జరుపుతారో తెలుసా? ఇంతకీ పురాణాలు ఏమంటున్నాయి..
హోలీ. దీనిని రంగుల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది చిన్నా, పెద్దా తేడాలేకుండా.. మతాలతో సంబంధం లేకుండా అందరూ వైభవంగా జరుపుకునే పండుగ ఇది. దీపావళి తర్వాత అతిపెద్ద హిందూ పండుగగా దీనిని పరిగణిస్తారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీనిని చేసుకుంటారు. హిందూ క్యాలెండర్లోని ఫాల్గుణ మాసంలో హోలీని జరుపుకుంటారు.
ఈ సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మార్చి 18న ఈ పండుగ వచ్చింది. హోలికా దహన్ మార్చి 17 అంటే ఈ రోజు సాయంత్రం వస్తుంది. దృక్ పంచాంగ్ ప్రకారం.. పూర్ణిమ తిథి మార్చి 17న మధ్యాహ్నం 1:29 గంటలకు ప్రారంభమై రేపు మధ్యాహ్నం 12:47 గంటలకు ముగుస్తుంది. హోలికా దహన్ తిథి మార్చి 17 రాత్రి 9:06 నుంచి 10:16 వరకు ఉంటుంది. మరి హోలీ పండుగ ప్రాముఖ్యత, వేడుకలు ఎలా జరుపుకుంటారో, పురణాలు ఏమంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాలు ఏమంటున్నాయి..
హోలీ అనేది కృష్ణుడు, రాధల మధ్య దైవిక ప్రేమకు గుర్తుగా చేసుకుంటారు. పురాణాల ప్రకారం కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉండేది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి.. అమ్మ రాధ, నా రంగులు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని ఆతృతగా అడిగాడు. యశోద వారి ఛాయలో తేడాను తొలగించడానికి.. శ్రీకృష్ణుడుని రాధ ముఖానికి రంగులు వేయమని సరదాగా సూచించింది. కృష్ణుడు తన తల్లి సలహాను అనుసరించి.. రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా బృందావనం అంతా హోలీ సంబురాలు మొదలయ్యాయి. అందుకే మధుర, బృందావన్‌లలో హోలీ పండుగను చాలా వైభవంగా ఆడతారు.
హోలిక దహన్
హోలీతో ముడిపడి ఉన్న మరొక పురాణం.. రాక్షస రాజు హిరణ్యకశిపుడు, అతని కుమారుడు ప్రహ్లాదుడు - విష్ణువు భక్తుడు. అతని అత్త హోలిక. హిందూ పురాణాల ప్రకారం.. హిరణ్యకశిపుడు మనిషి లేదా ఏ జంతువు చేత చంపబడని వరం పొందుతాడు. ఆ వరంతో ప్రజలు తనను ఆరాధించాలని ఆదేశిస్తాడు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు. ఈ నేపథ్యంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని పూజించడానికి నిరాకరిస్తాడు. దీంతో హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను చితిపై కూర్చోబెట్టి.. ప్రహ్లాదుడుని చంపమని కోరతాడు. హోలిక చితిపై కూర్చున్నప్పుడు.. ఆమె తన జ్వాలా కవచమైన శాలువను ధరించి, ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. ఈ సమయంలో ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించడం మొదలుపెడతాడు. విష్ణువు హోలికపై ఉన్న శాలువను తొలగించి.. ప్రహ్లాద్‌పైకి వేసి అతనిని రక్షిస్తాడు. అందుకే హోలీకి ఒకరోజు ముందు హోలికా దహన్ జరుపుకుంటారు.
ఆ తరువాత విష్ణువు నరసింహ అవతారం ఎత్తి.. ఇది సగం మానవ, సగం సింహం శరీరమంటూ రాక్షస రాజు హిరణ్యకశిపుని అంతమొందిస్తాడు. అందుకే చెడుపై మంచి గెలిచిన రోజుగా హోలీని కూడా పిలుస్తారు.
హోలీ వేడుకలు
హోలీ వేడుకలు హోలికా దహన్‌తో ప్రారంభమవుతాయి. ప్రజలు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించడానికి భోగి మంటలను వెలిగిస్తారు. మరుసటి రోజు, ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి రంగులతో ఆడుకుంటారు. దీనిని గులాల్ అని కూడా పిలుస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని... తమ స్నేహితులు, బంధువులతో వేడుకను జరుపుకుంటారు. పిల్లలు బెలూన్లు, బొమ్మ తుపాకులను నీటితో నింపి వారి స్నేహితులతో ఆడుకుంటారు. రంగులు, నీరు, పువ్వులతో ఆడుకుంటారు. పిల్లలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులను పూసుకుంటారు. హోలీ ఆడిన తర్వాత రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదిస్తారు.
పలు రాష్ట్రాల్లో భిన్నంగా
హోలీని కొన్ని రాష్ట్రాల్లో కొద్దిగా భిన్నంగా జరుపుకుంటారు. ఉదాహరణకు బ్రజ్ ప్రాంతాలలో - మధుర, బృందావన్, గోవర్ధన్, గోకుల్, నందగావ్, బర్సానా - ప్రజలు లత్మార్ హోలీని జరుపుకుంటారు. ఇక్కడ మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు లాత్ లేదా కర్రలతో కొట్టారు. అదనంగా, బృందావన్‌లో ఫూల్‌వాలి హోలీ కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు. భక్తులు, పూజారులు బాంకే బిహారీ ఆలయం వద్ద గుమిగూడి ఒకరిపై ఒకరు పూలు చల్లుకుంటారు.
సంబంధిత కథనం