BBQ Veg Rice Recipe : BBQ స్టైల్ వెజిటబుల్ రైస్.. ఇంట్లోనే చేసేసుకోవచ్చు..
BBQ Veg Rice Recipe : బార్బేక్యూ నేషన్ నాన్ వెజ్ తినేవారికే మాత్రమే అనుకుంటారు. బట్ అక్కడ వెజ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ వెజిటేరియన్స్ ఎక్కువగా BBQ రైస్ తింటారు. ఈ డిష్ వెరైటీగా, టేస్టీగా కూడా ఉంటుంది. అయితే దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు తెలుసా?
BBQ Veg Rice Recipe : BBQ రైస్ డిష్ కూరగాయలతో నిండి ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ఎంపిక. మీరు BBQ రైస్ చేయడానికి తాజాగా వండిన అన్నాన్ని ఉపయోగించవచ్చు. లేదా మిగిలిపోయిన బియ్యాన్ని కూడా ట్రై చేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బాస్మతి రైస్ - 250 గ్రాములు
* ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయ - 1 (మీడియం)
* వెల్లుల్లి - 2 రెబ్బలు
* లవంగాలు -1
* బెల్ పెప్పర్స్ - 1
* లీక్ - 1 ముక్క
* టమాటాలు - 2 చిన్నవి
* ఉప్పు - రుచికి తగినంత
* పెప్పర్ - రుచికి తగినంత
BBQ సాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
* టమాటో పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు (ప్యూరీ, సాస్ కాదు)
* రెడ్ వైన్ వెనీగర్ - 2 టేబుల్ స్పూన్లు
* వోర్సెస్టర్‌షైర్ సాస్ - 4 టేబుల్ స్పూన్లు
* తేనె - 2 టేబుల్ స్పూన్లు
* ఆవాలు - కొంచెం
* కారం - అర టీస్పూన్
* పసుపు - అర టీస్పూన్
* ధనియాపొడి - 1 టీస్పూన్
* జీలకర్ర పొడి - 1 టీస్పూన్
* ఉప్పు - తగినంత
* పెప్పర్ - తగినంత
* నీరు - తగినంత
తయారీ విధానం
BBQ రైస్ చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని ఉడకబెట్టండి. అది మెత్తగా కాకుండా.. పొడిపొడిలాడుతున్నప్పుడు గంజి వార్చేయాలి. మిగిలిన వంటకాన్ని చేయడానికి.. ఇప్పుడు పెద్ద పాన్ తీసుకోండి. దానిలో నూనె వేసి వేడిచేయండి. ఉల్లిపాయను 3 నుంచి నాలుగు నిముషాలు వేయించండి. దానిలో టమాటాలు, బెల్ పెప్పర్స్, వెల్లుల్లి వేసి మరో 5 నిముషాలు వేయించండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో నీరు తప్ప BBQ సాస్‌కి సంబంధించిన అన్ని పదార్థాలను కలపండి. దానిని పాన్‌లో వేసి.. ¼ కప్పు నీరు వేసి.. కలిపి పాన్‌ను కవర్ చేసి సుమారు 5 నిమిషాలు మరగనివ్వండి. మధ్యలో కొన్ని సార్లు కదిలించండి. ఇలా చేస్తే అడుగు పట్టదు.
సాస్ బాగా దగ్గరగా అయినట్లు అనిపిస్తే.. మిగిలిన ¼ కప్పు నీరు వేసి బాగా కదిలించండి. మరో 5 నిమిషాలు లేదా కూరగాయలు మెత్తగా, సాస్ పొడిగా కాకుండా చిక్కబడే వరకు ఉడికించండి. ఇప్పుడు ముందే సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలపండి. ఉప్పు, పెప్పర్.. అవసరమైతే.. మరింత వేయండి. చిటికెడు చక్కెర, వెనిగర్‌తో రుచిని సర్దుబాటు చేయండి. ఓ రెండు నిముషాలు మగ్గనివ్వండి. అంతే వేడి వేడి BBQ రైస్ రెడీ. దీనిని మీరు టమోటాలు, పచ్చి ఉల్లిపాయలు, పార్స్లీతో సర్వ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం