Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు
Banana Milk Shake: అరటి పండ్లు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. వాటితో మిల్క్ షేక్ ని తయారు చేసుకుని తాగండి. వేసవి తాపం తగ్గుతుంది.
Banana Milk Shake: వేసవిలో చల్ల చల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. ఎక్కువగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతూ ఉంటారు. ఇంట్లో బనానా మిల్క్ షేక్ చేసి పెట్టుకోండి. ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తాగవచ్చు. ఈ మిల్క్ షేక్ చేయడం చాలా సులువు. వీటి టేస్ట్ అదిరిపోతుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము.
బనానా మిల్క్ షేక్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలు - ఒక కప్పు
జీడిపప్పులు - గుప్పెడు
చక్కెర - ఒక స్పూను
బాదం తరుగు - రెండు స్పూన్లు
హార్లిక్స్ - రెండు స్పూన్లు
అరటి పండ్లు - రెండు
బనానా మిల్క్ షేక్ రెసిపీ
1. పాలను కాచి చల్లార్చి ఫ్రీజర్ లో పెట్టండి.
2. అరటి పండ్లను మీడియం సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టండి.
3. ఫ్రీజర్ల పెట్టిన పాలు ఘనీభవిస్తాయి.
4. ఇప్పుడు బ్లెండర్లో గడ్డకట్టిన పాలు, అరటి పండ్లు, బాదం పప్పులు, జీడిపప్పులు, చక్కెర వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
5. ఈ మొత్తాన్ని ఒక గ్లాసులో వేయండి. పైన హార్లిక్స్ ను వేసి కలపండి.
6. కొన్ని బాదం, జీడి పలుకులను తరిగి గార్నిష్ చేయండి.
7. అంతే బనానా మిల్క్ షేక్ రెడీ అయినట్టే.
8. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు.
9. బాగా ఎండలోంచి వచ్చినప్పుడు ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల శరీరానికి సత్తువ లభిస్తుంది.
10. పిల్లలకు సాయంత్రం పూట ఈ మిల్క్ షేక్ చేసి ఇవ్వడం వల్ల వారు ఇష్టంగా తాగే అవకాశం ఉంది.
బనానా మిల్క్ షేక్‌లో బాగా పండిన అరటి పండ్లను మాత్రమే వినియోగించాలి. తియ్యగా ఉంటే చక్కెరను తగ్గించుకోవచ్చు. ఒక స్పూన్ వేసినా చాలు. పూర్తిగా చక్కెర వేయకపోయినా పర్వాలేదు. పండ్లు తీయగా ఉంటే చక్కెర అవసరం ఉండదు. చక్కెరను ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది. నల్లగా మారిన అరటి పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. అలాంటి వాటితోనే ఈ బనానా మిల్క్ షేక్ ప్రయత్నించండి.