Banana For Breakfast । అరటిపండును అల్పాహారంగా తినకూడదు.. ఇలా తింటే ఆరోగ్యకరం!-banana for breakfast why you should not bananas on empty stomach know the healthiest way to eat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana For Breakfast । అరటిపండును అల్పాహారంగా తినకూడదు.. ఇలా తింటే ఆరోగ్యకరం!

Banana For Breakfast । అరటిపండును అల్పాహారంగా తినకూడదు.. ఇలా తింటే ఆరోగ్యకరం!

HT Telugu Desk HT Telugu
Mar 16, 2023 09:40 AM IST

Banana For Breakfast: అరటిపండ్లు మంచి పోషకాహారం. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంగా వీటిని తీసుకోకూడదు. ఎలా తింటే ప్రయోజనాలు అందుతాయో చూడండి

Banana For Breakfast
Banana For Breakfast (Pixabay)

Banana For Breakfast: అరటిపండ్లు ఆరోగ్యకరం అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, అవి దాదాపు 25% చక్కెరను కలిగి ఉంటాయి, అందువల్ల ఉదయం అల్పాహారంగా అరటిపండ్లను తింటే తక్షణంగా శక్తి లభిస్తుంది. కానీ, కొద్ది సమయం గడిచాకా ఆ శక్తి వినియోగం జరిపోతుంది, ఆ వెంటనే అలసటగా, ఆకలిగా అనిపించవచ్చు. అరటిపండులోని చక్కెర పదార్థం కారణంగా అది ఆహార కోరికలను ప్రేరేపిస్తుంది, శరీరంలో వేడి పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఆంతేకాకుండా తక్షణ శక్తిని పెంచే గుణం కారణంగా శరీరంలో మిగతా పోషకాల స్థాయిని గ్రహించే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం అల్పాహారంగా అరటిపండును తీసుకోవడం సరికాదని చెబుతున్నారు.

అయితే అల్పాహారంలో అరటిపండ్లు తినడం మానేయాలని దీని అర్థం కాదు. చక్కెర కంటెంట్ ఉన్నప్పటికీ అవి ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అరటిపండ్లు పోటాషియం వంటి మూలకానికి ఉత్తమ వనరులలో ఒకటి. అదనంగా ఇందులో విటమిన్ B6, విటమిన్-సి లు ఉన్నాయి. అరటిపండ్లలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

Ways to Bananas- అరటిపండ్లు తినే సరైన విధానం

అల్పాహారంలో అరటిపండ్లు తినాలనుకుంటే కేవలం వాటితో మాత్రమే సరిపెట్టకూడదు. అరటిపండ్లతో పాటుగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యకరం. అరటిపండ్లతో అల్పాహారంగా తీసుకోగల కొన్ని ఆరోగ్యకరమైన ఉపాయాలు ఇక్కడ చూడండి.

- చియా గింజలు , గ్రీకు యోగర్ట్, అరటిపండ్లు కలిపి తీసుకుంటే శక్తివంతంగా ఉంటుంది.

- బెర్రీలు, పాలకూర, అరటిపండును కలిపి అద్భుతమైన ప్రోటీన్ స్మూతీ చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే, జిమ్ చేసే వారికి ఈ అల్పాహారం మంచి ఛాయిస్ అవుతుంది.

- అరటిపండ్లు, నట్స్, ఓట్ మీల్ కలిపి తీసుకోవచ్చు లేదా అరటితో ఫ్రెంచ్ టోస్ట్ తీసుకోవాలి.

- మీకు ఉదయం భోజనం చేసే అలవాటు ఉంటే ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో పెసర్లు, శనగలతో వండిన ప్రోటీన్ ఆహారంతో పాటుగా అరటిపండు తినడం చాలా ఆరోగ్యకరం, శక్తివంతమైన ఆహారం.

- అరటిపండ్లు బాగా పండిన తర్వాత, వాటిలో చక్కెర శాతం మరింత పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో వాటిని వేరుశెనగ వెన్న, నట్స్, హోల్‌గ్రైన్ బ్రెడ్, స్మూతీలు, ఓట్స్ లేదా పెరుగు వంటి ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా చక్కెర మోతాదును తగ్గించవచ్చు.

- అరటిపండ్లను స్మూతీస్, యోగర్ట్ పార్ఫైట్‌లు, ఓట్ బౌల్స్ లేదా హై-ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ బార్‌లతో కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యకరమే కాకుండా మరెన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

చివరగా ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, అరటిపండు ఉదయం తినడం మంచిదే. కానీ ఖాళీ కడుపుతో కేవలం అరటిపండును మాత్రమే అల్పాహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. అరటిపండును జీర్ణం చేయడానికి మన పొట్టకు చాలా సమయం పడుతుంది. శరీరంలోని జీవక్రియ రాత్రిపూట అత్యల్పంగా ఉంటుంది. అందువల్ల రాత్రి పడుకునే ముందు కూడా అరటిపండును తీసుకోవడం సరికాదు.

ఉదయం అల్పాహారంతో పాటుగా, లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో అరటిపండ్లను తీసుకోవడం ఆదర్శవంతమైనది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం