Avoid tomatoes and cucumber : టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? జాగ్రత్త! కారణం ఇదే!-avoid eating tomatoes and cucumber together know reasons here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Avoid Tomatoes And Cucumber : టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? జాగ్రత్త! కారణం ఇదే!

Avoid tomatoes and cucumber : టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? జాగ్రత్త! కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu
Aug 18, 2023 11:10 AM IST

Avoid tomatoes and cucumber : మీరు సలాడ్​ ఎక్కువగా తింటారా? వీటిల్లో టమాటాలు, కీర దోసకాయలు కలిపి ఉంటాయా? అయితే జాగ్రత్త!

టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? జాగ్రత్త!
టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? జాగ్రత్త! (Unpslash)

Avoid tomatoes and cucumber : బరువు తగ్గడం కోసం మనం చాలా చేస్తుంటాము. ముఖ్యంగా డైట్​పై మన ఫోకస్​ పడుతుంది. అప్పుడే 'సలాడ్​'లు గుర్తొస్తాయి. ఇక టైమ్​ బట్టి వాటిని ఆరగించేస్తూ ఉంటాము. అయితే.. ఇక్కడే కొన్ని తప్పులు చేయకండి అని డైటీషియన్స్​ చెబుతున్నారు. టమాటా- కీర దోసకాయలను కలిపి తినండం.. వీటిల్లో ఒకటి! దీనికి అసలు కారణాలు ఇక్కడ తెలుసుకుందాము..

టమాటా- కీర కలిపి తింటే కలిగే నష్టాలు..

సలాడ్​లో టమాటాలు, కీర దోసకాయలు కచ్చితంగా ఉంటాయి! కానీ కీర దోసకాయలను, టమాటాతో కలిపి తినేడప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. కీర దోసకాయల్లో చాలా మినరల్స్​ ఉంటాయి. వాటి వల్ల మనం హైడ్రేటెడ్​గా ఉంటాము. అయితే.. టమాటాల్లో ఉండే విటమిన్​ సీ ని మన శరీరం అబ్సార్బ్​ చేసుకునే ప్రక్రియకు కీర దోసకాయల్లోని ఎంజైమ్​ ఆటంకం కలిగిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు. అందుకే.. ఎంత వీలైత ఎంత.. వాటిని కలపకూడదని అంటున్నారు.

Digestion problems with tomatoes and cucumber : అంతేకాదు.. కీర దోసకాయను టమాటాలతో కలిపితే జీర్ణక్రియ మందగించే ప్రమాదం కూడా ఉంటుంది. వీటి వల్ల శరీరంలో డైజేషన్​ మరింత కష్టమవుతుంది. ఈ రెండింటికీ జీర్ణక్రియ ప్రక్రియ వేరువేరుగా ఉంటుంది. అందుకే వీటిని కలిపితే కడుపు నొప్పి వస్తుంది. కడుపు ఉబ్బడం వంటివి కూడా జరుగుతాయి.

ఇదీ చూడండి:- Cucumber Side Effects । దోసకాయ తినడం మంచిదే కానీ.. అందరికీ కాదు!

డైజేషన్​లో భాగంగా కొన్ని ఆహారాలు త్వరగా అరిగిపోతాయి. ఇంకొన్నింటికి ఆలస్యం అవుతుంది. ఇలా ఆలస్యమయ్యే ఆహారాలు కొన్ని రోజుల పాటు ప్రేగుకు అతుక్కుపోతాయి. ఫలితంగా డైజేషన్​ సమస్యలు వస్తాయి. కీర దోసకాయ- టమాటాలు కలిపితే ఇదే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా త్వరగా అరిగే, త్వరగా అరగని వాటిని కలిపి తింటే.. గ్యాస్​ సమస్యలు కూడా రావొచ్చు!

Can we eat tomatoes and cucumber together : అయితే కీర దోసకాయను ఇతర కూరగాయలతో కలిపి తినొచ్చని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు.

అలా అని టమాటాలను, కీర దోసకాయలను పూర్తిగా తినడం మానేయడం కూడా మంచిది కాదు. సలాడ్​లో ఒకసారి టమాటాలు వేసుకుంటే, ఇంకోసారి కీర దోసకాయలను వాడండి. ఈ రెండు కూడా వేరువేరుగా తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కలిపి తీసుకుంటేనే కాస్త సమస్య!

Whats_app_banner

సంబంధిత కథనం