sugar alternatives: చక్కెర మహా డేంజర్.. షుగర్‌కు ప్రత్యామ్నాయాలు ఇవే!
చక్కెర ఎక్కువగా తినడం వల్ల అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. ముఖ్యంగా దంత సంబంధిత సమస్యలు, ఊబకాయం, డయాబెటీస్, నొప్పులు
పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పంచదారను అధిక మోతాదులో తీసుకోవడంలో వల్ల దంత సంబంధిత సమస్యలు, ఊబకాయం, డయాబెటీస్, నొప్పులు తలెత్తుతాయి. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర చూపుతుంది. ఇక పంచదార వల్ల కలిగే దుష్ఫలితాలు.. ప్రత్యామ్నాయాల మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక చక్కెర వినియోగం వల్ల ఏర్పడే ఆనారోగ్య పరిస్థితులు:
ఊబకాయం
గుండె లోపాలు
మెటబాలిక్ సిండ్రోమ్
అధిక రక్త పోటుప్రత్యామ్నాయాలుఅధిక కొలెస్ట్రాల్
కావిటీస్
అలాగే రోజువారీగా తీసుకునే అదనపు కేలరీల వినియోగం వల్ల ఊబకాయానికి దారితీయవచ్చు, ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మనందరికీ తెలిసినట్లుగా ఊబకాయం అనేక వ్యాధులకు మొదటి మెట్టు, అది గుండె నొప్పి, మధుమేహం లేదా అధిక రక్తపోటుకు దారి తీస్తుంది.
చక్కెర వినియోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
నెమ్మదిగా, క్రమంగా చక్కెర వినియోగాన్ని తగ్గించండి. ఉదాహరణకు- మీరు మీ కాఫీకి 1 tsp చక్కెరను జోడించినట్లయితే, దానిని క్రమంగా ½ tspకి తగ్గించడానికి ప్రయత్నించండి.
కృత్రిమ స్వీటెనర్‌లను నివారించండి ఎందుకంటే అవి మీ శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి. ఇది ఆకలిని పెంచుతుంది. వాటిని తీసుకోవడం తగ్గించండి.
రోజువారిగా తీసుకుని ఆహారాలలో కూడా ఆధికంగా చక్కెరలు ఉంటాయి. షుగర్స్ ఉండే పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండడం మంచిది.
చక్కెరకు బెల్లం మంచి ప్రత్యామ్నాయం. అలాగే వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో సహా పైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి, జలుబు, దగ్గు తగ్గడంలో ఉసయోగపడుతుంది.
తేనె కూడా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. తేనె ఆరోగ్యానికి చాలా మంది. హెల్త్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది మీకు తీపిని అందించడమే కాకుండా బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
సంబంధిత కథనం