Anger side Effects: కోపం అధికంగా వస్తోందా? జాగ్రత్త, మీలో లైంగికాసక్తి తగ్గిపోయే అవకాశం, ఇది మీ బంధానికే ప్రమాదం-anger side effects getting too angry you may lose your libido which is a danger to your relationship ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anger Side Effects: కోపం అధికంగా వస్తోందా? జాగ్రత్త, మీలో లైంగికాసక్తి తగ్గిపోయే అవకాశం, ఇది మీ బంధానికే ప్రమాదం

Anger side Effects: కోపం అధికంగా వస్తోందా? జాగ్రత్త, మీలో లైంగికాసక్తి తగ్గిపోయే అవకాశం, ఇది మీ బంధానికే ప్రమాదం

Haritha Chappa HT Telugu
Feb 10, 2024 09:00 AM IST

Anger side Effects: ఎక్కువగా కోప్పడే వారు లైంగికంగా ఆనందపడలేరని చెబుతున్నాయి అధ్యయనాలు. కోపానికి, లైంగిక ప్రక్రియకు మధ్య అనుబంధాన్ని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి.

కోపం వల్ల అనర్థాలెన్నో
కోపం వల్ల అనర్థాలెన్నో (pexels)

Anger side Effects: ఆనందకరమైన జీవితంలో లైంగిక ప్రక్రియ కూడా ఒక భాగం. భార్యాభర్తల మధ్య ఈ అనుబంధం చక్కగా ఉంటేనే వారి జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ఒకరి మీద ఒకరికి కోపాలు పెరిగితే, వారి లైంగిక అనుబంధం క్షీణిస్తుంది. కోపం ఎక్కువైతే లైంగిక ఆసక్తి తగ్గిపోతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. చిరాకు, కోపం వంటివి లైంగిక ప్రక్రియ వైపు కనెక్ట్ కానివ్వవు. కేవలం ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు లైంగిక ప్రక్రియను ఆస్వాదించగలరు. మీ సెక్స్ డ్రైవ్ ప్రభావితం కాకుండా ఉండాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి.

మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

కోపం అనేది మహిళలపై అధికంగానే ప్రభావం చూపిస్తుంది. వాదనలు, విభేదాలు వచ్చినప్పుడు వారు నిరాశకు గురవుతారు. వారిలో ప్రేమ భావన తగ్గిపోతుంది. ఒక రకమైన ఆందోళన పెరిగిపోతుంది. ఈ భావోద్వేగాలు సహజమైనవే అయినప్పటికీ అవి సెక్స్ వైపుగా ఆసక్తిని తగ్గిస్తాయి. మహిళల్లో లిబిడో తగ్గిపోతుంది. కోపం, మానసిక ఆందోళన వంటివి మహిళల్లో లైంగిక కోరికలను చంపేస్తాయి. దీనివల్ల భర్తతో ఆమె సఖ్యంగా ఉండలేదు. వారి మధ్య ప్రేమ భావన తగ్గిపోయే అవకాశం ఉంది. మగవారిలోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అధిక కోపం వల్ల వారు తమ భాగస్వామికి ఆకర్షితులు అవ్వలేరు. దీంతో వారి మధ్య శారీరక దూరం పెరుగుతుంది. వారి జీవితానికి ఇది ఏమాత్రం మంచిది కాదు.

కోపంలో ఉన్నప్పుడు కూడా లైంగిక ప్రక్రియను సాగించేందుకు ప్రయత్నిస్తారు కొంతమంది. ఇది కాస్త ప్రమాదకరమే. ఇలా చేయడం వల్ల రక్తపోటు, పల్స్ వంటి వాటిల్లో హెచ్చుతగ్గులు త్వరగా వస్తాయి. కొన్నిసార్లు తలనొప్పి కూడా వస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామికి, తమకు మధ్య అనుబంధం దెబ్బతింటుంది. అనేక శారీరక, మానసిక సమస్యలు రావచ్చు. కోపాన్ని తగ్గించుకున్న తర్వాతే లైంగిక ప్రక్రియకు సిద్ధమవ్వాలి.

లైంగిక సంబంధం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నో వివాదాలను, తగాదాలను మరిచిపోయేలా చేస్తుంది. ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు లైంగిక ప్రక్రియ ఒక ఔషధంలా పనిచేస్తుంది. లైంగిక ప్రక్రియ ఇద్దరి సమ్మతితో చేస్తేనే అది ఆనందంగా ఉంటుంది.

ఎప్పుడు కోపంగా అసహనంగా ఉండే వ్యక్తులు ఆరోగ్యంగా ఉండలేరు. కోపం, అసహనం అధికంగా ఉండే వ్యక్తులకు రక్తనాళాలు మందంగా మారిపోతాయి. వారిలో గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కోపం అనేది ప్రకృతి ఇచ్చిన సహజ ఉద్వేగమే అయి ఉండొచ్చు, కానీ ఎక్కువగా కోపానికి గురైతే మాత్రం శారీరక, మానసిక అశాంతితో పాటు అనేక అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

తరచూ లైంగిక సంబంధాన్ని సాగించే భార్యాభర్తలు మానసికంగా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్టు కొన్ని అధ్యయనాలు చెప్పాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం మెరుగవుతున్నట్టు తెలిపాయి. సెక్స్ వల్ల తీవ్ర ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవడంలో కూడా ఇది సహకరిస్తుంది. అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

WhatsApp channel

టాపిక్