ఎయిర్‌బస్ హైదరాబాద్‌లో జాబ్స్.. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంటర్వ్యూలు!
26, 27 తేదీల్లో వింగ్స్ ఇండియా ఎయిర్‌షోలో టాలెంట్ హంట్ జరగనుంది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లోని Hall Aలోని స్టాండ్ 12లో 'Meet-and-greet' పేరుతో శని, ఆదివారాల్లో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్ ఎయిర్ షోలో మార్చి 26న రిక్రూట్మెంట్ డ్రైవ్ జరగనుంది. ఐటీ విభాగంలో ప్రముఖ కంపెనీ ఎయిర్ బస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం,ఎయిర్ బస్ పంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గోనవచ్చు. 26, 27 తేదీల్లో వింగ్స్ ఇండియా ఎయిర్‌షోలో ఈ టెలెంట్ హంట్ జరగనుంది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లోని Hall Aలోని స్టాండ్ 12లో 'Meet-and-greet' పేరుతో శని, ఆదివారాల్లో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఎయిర్‌బస్ ఇండియా avionics software, aircraft system simulation and aircraft frame వంటి ఉద్యోగాలతో పాటు cybersecurity, API development, fullstock development, big data, cloud, DevOps and IoT ఖాళీలలను కూడా భర్తీ చేయనున్నారు.
ఇంటార్వ్యూలో రిక్రూటర్లను అభ్యర్థులు సంతృప్తి పరిచినట్లైతే.. అక్కడిక్కడే ఆఫర్ లెటర్స్ కూడా అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు Aerodynamics, avionics software design, testing, system simulation, digital mock-up and system installation ఎయిర్‌బస్ ఇండియా ఇంజనీరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. తాజాగా 7,000 ఉద్యోగాలను రిక్రూట్ చేసుకున్న సంస్థ ఈ రిక్రూట్‌లో మరీ కొంత మందిని చేర్చుకొనుంది. దీంతో ఎయిర్‌బస్ ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 2000పైగా ఉండనుంది.
సంబంధిత కథనం