Cleaning Hacks: మాప్ చేసే నీటిలో ఇవి కలపండి, బ్యాక్టీరియా నశించి సువాసనలు వస్తాయి-add these in mopping water to clean floor and avoid these cleaning mistakes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cleaning Hacks: మాప్ చేసే నీటిలో ఇవి కలపండి, బ్యాక్టీరియా నశించి సువాసనలు వస్తాయి

Cleaning Hacks: మాప్ చేసే నీటిలో ఇవి కలపండి, బ్యాక్టీరియా నశించి సువాసనలు వస్తాయి

Cleaning Hacks: తడి మాపింగ్ పెట్టకుండా ఇంటి ఫ్లూర్ శుభ్రంగా మారదు. అయితే మాపింగ్ చేసే నీటిలో కొన్ని పదార్థాలు కలిపితే బ్యాక్టీరియా నశిస్తుంది. సంపూర్ణ శుభ్రత చేసినట్లుంటుంది. అవేంటో చూడండి.

మాపింగ్ చేసే నీటిలో ఇవి కలిపితే శుభ్రత (Shutterstock)

ఇంటిని సరిగ్గా శుభ్రం చేయడానికి మాపింగ్ చేయడం ముఖ్యం. ఊడిస్తే ఇల్లు శుభ్రపడుతుంది. కానీ తడి మోపింగ్ చేయడం వల్ల ఇల్లు సంపూర్ణంగా శుభ్రపడుతుంది. దీనికోసం వాడే నీటిలో కొన్ని పదార్థాలు కలిపితే బ్యాక్టీరియా కూడా నశించి, ఇల్లంతా సువాసనలు వెదజల్లుతుంది. క్రిములు నశిస్తాయి. దాంతోపాటే మోపింగ్ చేసేటప్పుడు సాధారణంగా చేసే తప్పులేంటో కూడా చూడండి. అవి చేయకపోతే మరింత మంచిది.

ఎక్కువ నీరు వాడటం:

మాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ శ్రమ అవ్వకుండా కొందరు సరిగ్గా నీటిని పిండేయకుండా అలాగే శుభ్రం చేస్తారు. ఇలా చేస్తే నేలకే నీటి ద్వారా దుమ్ము, దూళి అతుక్కు పోతుంది. సరిగ్గా శుభ్రపడదు. ముఖ్యంగా వుడెన్ , ల్యామినేటెడ్ ఫ్లూరింగ్ ఉన్నవాళ్లు ఈ తప్పు చేయకూడదు. ఇలా చేస్తే నీటి మరకలు కనిపిస్తాయి. ఫ్లూర్ మరింత దుమ్ముగా కనిపిస్తుంది. 

శుభ్రత తప్పనిసరి:

మాప్ కూడా ఒక రకమైన స్పాంజి లాంటిదే. దీంట్లోనూ బ్యాక్టీరియా పెరిగా అవకాశం ఉంటుంది. అలాగే తడిగా ఉంచకుండా ఎండ తగిలేలా చూడండి. ఎప్పటికప్పుడు ఆరిపోయేలా చూసుకోండి. అలాగే ప్రతిసారి మాప్ శుభ్రం చేశాకే వాడండి. లేదంటే కొత్త క్రీములను ఫ్లూర్ మీదికి చేరుస్తున్నట్లే. అలాగే ముందుగా ఒకసారి చీపురుతో ఊడ్చాకే తడి మాప్ వాడండి. లేదంటే దుమ్ము ఫ్లూర్‌కే అంటుకుపోతుంది. 

నీటిలో ఇవి కలపండి:

నిమ్మరసం:

నిమ్మరసం సహజ క్లీనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. దీనుకున్న యాంటీ మైక్రోబయల్ లక్షణాలు బ్యాక్టీరియాను కూడా చంపేసి ఫ్లూర్‌ను సమర్థవంతంగా శుభ్రపరుస్తాయి. అలాగే ఏమైనా వాసనలున్నా నిమ్మరసం కలిపిన నీటితో తుడిస్తే తాజా వాసన వస్తుంది. సగం బకెట్ నీళ్లలో రెండు నిమ్మకాయలు పిండితే సరిపోతుంది. 

బేకింగ్ సోడా:

ఫ్లూర్ మీద జిడ్డు మరకలుంటే బేకింగ్ సోడా సులువుగా తొలిగిస్తుంది. అలాగే ఫ్లూర్ మంచి వాసన వచ్చేలాగా చేస్తుంది. నూనె, జిడ్డు మరకలు తొలిగించడానికి ఇది వాడితే సులువుగా వదిలిపోతాయి.

వెనిగర్:

దాదాపు అన్ని రకాల ఫ్లూరింగ్‌లకు వెనిగర్ వాడొచ్చు. బకెట్ నీళ్లలో పావు కప్పు వెనిగర్ కలిపి దాంతో ఫ్లూర్ శుభ్రం చేయాలి. వుడెన్ ఫ్లూర్స్, టైల్స్ లాంటి వాటికి కూడా వెనిగర్ వాడితే జిడ్డు వదిలిపోతుంది. మెరుసిపోతాయి. ముఖ్యంగా కిచెన్ శుభ్రం చేసే నీటిలో వెనిగర్ వాడితే మేలు. ఇంట్లో కార్పెట్లు వాడినా వాటిని శుభ్రం చేయడానికి వెనిగర్ పనికొస్తుంది. 

ఎసెన్షియల్ నూనెలు:

సగం బకెట్ నీళ్లలో 15 నుంచి 20 చుక్కల పెప్పర్‌మింట్, మింట్, లెమన్ లాంటి ఎసెన్షియల్ నూనెలు కలపొచ్చు. ఇవి ఫ్లూర్ మీదున్న బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. అలాగే ఇళ్లంతా సువాసనలు వెదజల్లేలా సాయపడతాయి.