Kitchen cleaning: వంటగదిలో ఉండే ఈ ఒక్క వస్తువు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే ప్రమాదం ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి-a cleaning cloth or sponge can make you sick so be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Cleaning: వంటగదిలో ఉండే ఈ ఒక్క వస్తువు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే ప్రమాదం ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి

Kitchen cleaning: వంటగదిలో ఉండే ఈ ఒక్క వస్తువు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే ప్రమాదం ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి

Haritha Chappa HT Telugu
Sep 12, 2024 12:30 PM IST

Kitchen cleaning: వంట గదిలోనే మన ఆరోగ్యం నిర్ణయమవుతుంది. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. వంటగది శుభ్రంగా లేకపోతే ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ.

కిచెన్ క్లీనింగ్ టిప్స్
కిచెన్ క్లీనింగ్ టిప్స్ (Pixabay)

Kitchen cleaning: వంట గదిలో ఎన్నో పదార్థాలు, వస్తువులు ఉంటాయి. వండే గిన్నెల దగ్గర నుంచి పప్పుల వరకు ఎన్నో రకాల ఉత్పత్తులు ఉంటాయి. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. అలాగే గిన్నెలను శుభ్రం చేసే లేదా కిచెన్ ప్లాట్ ఫామ్ ను తుడిచే స్పాంజ్ కూడా అక్కడే ఉంటుంది. కొంతమంది స్పాంజీలు వాడితే, మరికొందరు మెత్తని క్లాత్‌లను వాడుతూ ఉంటారు. వాటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వంటగదిని క్లీన్ చేసే క్లాత్ లేదా స్పాంజ్ వల్లే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

కిచెన్‌లో వాడే స్పాంజ్‌లో లేదా క్లాత్‌పై టాయిలెట్ బౌల్స్ కంటే కూడా ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయని ఎన్నో పరిశోధనలు ఇప్పటికే నిర్ధారించాయి. మన ఇంటిలో ఉండే అత్యంత కలుషితమైన వస్తువులలో ఇది ఒకటి. ఒక స్పాంజి పై ఒక క్యూబిక్ సెంటీమీటర్‌కు 54 బిలియన్ల బ్యాక్టీరియాలు నివాసం ఉంటాయి. అవి కిచెన్ మొత్తాన్ని కలుషితం చేస్తాయి. ఈ బాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా కారణం అవుతుంది. సాల్మెనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు కూడా ఈ వంటగది ని తుడిచే స్పాంజిలపై ఉంటాయి.

డ్యూక్ యూనివర్సిటీకి చెందిన బయో మెడికల్ ఇంజనీర్లు వంటగదిని శుభ్రం చేసే స్పాంజీలు, క్లాత్‌లపై ఒక పరిశోధనను నిర్వహించారు. ఇవి తేమతో కూడిన నిర్మాణాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. బ్యాక్టీరియాను పెంచడానికి ఈ కిచెన్ స్పాంజీలు, క్లాతులు ఎంతో ఉపయోగపడతాయని, అవి ల్యాబ్స్ కన్నా కూడా ఎక్కువ శాతం బ్యాక్టీరియాను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిర్ధారించారు.

ఎలాంటి ఆరోగ్య ప్రమాదాలు వస్తాయి?

వంటగదిలో వాడే క్లాత్ లేదా స్పాంజ్‌లు పరిశుభ్రంగా ఉంచుకోపోతే ఎన్నో రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇది దారితీస్తుంది. మెనింజైటిస్, నిమోనియా, సెప్టిసినియా వంటి తీవ్రమైన పరిస్థితులు కూడా రావచ్చు. స్పాంజిపై లేదా తుడిచే క్లాతులపై క్యాంపులోబాక్టర్, ఎంటెరోబాక్టర్, ఈ కొలి, క్లెబ్సిఎల్లా, మోరాక్సెల్లా ఒస్లోన్సిస్, సాల్మొనెల్లా, ప్రోటీస్ వంటి భయంకరమైన బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం ఎక్కువ.

వాటిని ఇలా శుభ్రం చేయండి

వంటగదిని తుడిచే స్పాంజ్‌లో లేదా క్లాతులను కూడా ప్రతిరోజు ఉతికి ఎండలో ఆరేయడం చాలా అవసరం. ఇవి బ్యాక్టీరియా వ్యాప్తిని వేగవంతం చేస్తాయి. ఆ స్పాంజీలు లేదా క్లాత్ తో గిన్నెలు తుడవడం వంటివి చేయకండి. వాటిని పొడి వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నించండి. చేతికి గ్లవుజులు తొడుక్కున్న తర్వాతే ఆ స్పాంజీలను ముట్టుకొని కిచెన్ క్లీన్ చేయండి. ఈ స్పాంజి లేదా క్లాతులను తరచుగా మారుస్తూ ఉండండి.

వేడి నీటిలో ఈ స్పాంజ్‌లను లేదా క్లాతులను నానబెట్టి వాటిని ఎర్రటి ఎండలో ఆరబెట్టండి. వాటిపై ఉన్న బ్యాక్టీరియాలు త్వరగా పోతాయి.

టాపిక్