Amla Juice Benefits : ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?-8 health benefits of drinking amla juice with empty stomach ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla Juice Benefits : ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Amla Juice Benefits : ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Anand Sai HT Telugu
Sep 22, 2023 11:05 AM IST

Amla Juice Benefits : ఉసిరిని పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. దీనితో చాలా లాభాలు ఉన్నాయి. అయితే ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటి? ఉసిరి రసం ఎలా తయారు చేయాలి?

ఉసిరి జ్యూస్
ఉసిరి జ్యూస్ (unsplash)

ఉసిరి జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి ఖాళీ కడుపుతో తాగితే ముఖ్యమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఉసిరి రసంలో విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం మొదలుపెడితే చాలా రోగాలు తగ్గుతాయి.

ఇన్ఫ్లమేషన్ సమస్యలు ఉన్నవారు జామకాయ రసం తాగితే మంట లక్షణాలు తగ్గుతాయి. ఇది వాపు, నొప్పిని తగ్గిస్తుంది.

జామకాయ రసం తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇది మనం తినే ఆహారం నుండి శరీరానికి పోషకాలను బాగా గ్రహించేలా చేస్తుంది.

జీవక్రియ బాగా పని చేస్తే, బరువు అదుపులో ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

ఉసిరి రసం తాగితే శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది. దీనిద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అన్నమాట.

కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు సమస్య పెరుగుతుంది. ఉసిరి రసం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

ఉసిరి రసం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో మలినాలు పెరిగి రక్తం కలుషితమై వ్యాధులు వస్తే ఉసిరి రసం శరీరంలోని మలినాలను తొలగించి శరీరాన్ని బాగు చేస్తుంది.

మానసిక ఒత్తిడి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తగ్గకపోతే ఆరోగ్యానికి ముప్పు. అయితే ఉసిరి రసం తాగడం వల్ల మానసిక ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉండి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఉసిరి జ్యూస్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యానికి, చర్మం కాంతివంతంగా ఉంటుంది. కాబట్టి ఇది బ్యూటిఫికేషన్‌కు కూడా ఉపయోగపడుతుంది.

ఉసిరిని రోజూ తీసుకుంటే.. రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. ఎముకలు కూడా బలంగా తయారు అవుతాయి. మధుమేహం ఉన్నవారు.. ఉసిరి తీసుకుంటే చాలా మంచిది. గ్యాస్ సమస్యతో బాధపడేవారు కూడా.. ఉసిరి రసం తాగితే ఫలితం ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలు కూడా తగ్గుతాయి. జీవక్రియ రేటును పెంచి కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది.

Whats_app_banner