Weight Gain | సడెన్​గా బరువు పెరుగుతున్నారా? ఇవే కారణం కావచ్చు-7 health issues to promote weight gain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Gain | సడెన్​గా బరువు పెరుగుతున్నారా? ఇవే కారణం కావచ్చు

Weight Gain | సడెన్​గా బరువు పెరుగుతున్నారా? ఇవే కారణం కావచ్చు

Vijaya Madhuri HT Telugu
Mar 02, 2022 10:38 AM IST

బరువు తగ్గడానికి అందరూ చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ బరువు ఎందుకు పెరుగుతున్నామంటే మాత్రం ఆహారం విషయంలోని లోపలే కారణంగా భావిస్తారు. అది ముమ్మాటికి తప్పే అంటున్నారు వైద్యనిపుణులు. బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదని.. మనలో అంతర్లీనంగా ఉన్న వ్యాధులు కూడా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు.

<p>ఆకస్మికంగా బరువు పెరుగుతున్నారా?</p>
ఆకస్మికంగా బరువు పెరుగుతున్నారా?

Weight Loss | ఆకస్మికంగా బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదు. ఇంకా చాలా కారణాలు ఉండే ఉంటాయి. వాటిలో అంతర్లీనంగా ఉండే వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవి బరువు పెరిగేందుకు శరీరాన్ని ప్రేరేపిస్తాయి. మన బరువు ఆకస్మికంగా పెరగడం ప్రారంభించినప్పుడు.. మనకు వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే ఆహారం. మనం తినే ఆహారంలో ఏదైనా తప్పు ఉండవచ్చు. కానీ అది ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదని తినే ఆహారంతో పాటు, వ్యాయామ దినచర్య, కొన్ని ఆరోగ్య పరిస్థితులపై కూడా వ్యాధులు ఆకస్మికంగా బరువు పెరగడానికి కారణమవుతాయని బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ రజత్ వెల్లడించారు. బరువు పెరగడానికి ఈ 7 అంతర్లీన వ్యాధులు కూడా కారణమవుతాయని వెల్లడించారు.

1. నిద్రలేమి

రాత్రి మీరు సరిగా నిద్రపోలేకపోతున్నారా? అయితే మీరు బరువు పెరగడానికి నిద్ర లేమే కారణం. ఎందుకంటే నిద్రలేకపోవడం మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. అంతే కాకుండా ఇది ఆహార విధానాలపై ప్రభావం చూపిస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. దీని కారణంగా మీరు అతిగా తినే అవకాశముంటుంది. లేదా అనారోగ్యకరమైన ఆహారాలను తినవచ్చు. దీని వలన బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని డాక్టర్ రజత్ తెలిపారు.

2. మోనోపాజ్

మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. ఇది ఎందుకు జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? మహిళల్లో ఋతు చక్రం, పునరుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలో పలు మార్పులను తెస్తుంది, కాబట్టి మీ శరీరంలో తక్కువ, అధిక స్థాయి ఈస్ట్రోజెన్ స్థాయిలు బరువు పెరిగేందుకు కారణమవుతాయి.

3. కిడ్నీ సమస్యలు

ఆకస్మికంగా బరువు పెరగడం అనేది మీ కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించి ఏదో తప్పు జరుగుతుందనడానికి సూచిక కావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ లేదా నెఫ్రోటిక్ సిండ్రోమ్ వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్యలు మీరు బరువు పెరగడానికి లేదా శరీరంలో వాపుకు దారితీయవచ్చు. "కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే, శరీరం ద్రవాన్ని నిలుపుకుంటుంది, దీని వలన బరువు పెరుగుతారు" అని డాక్టర్ రజిత్ స్పష్టం చేశారు.

4. థైరాయిడ్ సమస్యలు

ఒకవేళ మీ థైరాయిడ్ గ్రంధి పూర్తిగా తగ్గిపోయి, తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతే, కొన్ని కిలోల బరువు పెరగడానికి సిద్ధంగా ఉండండి. హైపోథైరాయిడిజం (అండర్యాక్టివ్ థైరాయిడ్) జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇది ఆకస్మికంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి మీరు బరువు పెరగడాన్ని గమనిస్తే, మీ థైరాయిడ్ నెమ్మదిగా లేదా నిదానంగా ఉందని అర్థం చేసుకోవాల్సిందే.

5. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)

పీసీఓఎస్ ఉన్న చాలా మంది మహిళలు బరువు పెరుగుతారు. దానిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ సమస్య ఉన్న మహిళలు కూడా గర్భధరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. "మీకు పీసీఓఎస్ ఉంటే మీరు బరువు పెరగవచ్చు. ఎందుకంటే ఇది అండాశయాలు అసాధారణంగా అధిక స్థాయిలో పురుష సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది." అని రజత్ తెలిపారు. దీనిని తగ్గించుకోవడానికి మీరు బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, చురుకైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు.

6. ఒత్తిడి

ఒత్తిడి, ఆందోళన, తక్కువ మూడ్, డిప్రెషన్ వంటివి కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే కొంతమంది ఈ కారణాల వల్ల కూడా బరువు తగ్గుతారు. "మీరు కేలరీలతో నిండిన జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు స్వీట్లను తినాలనే కోరిక పెరుగుతుంది. మీరు వ్యాయామం చేసే మూడ్​లో కూడా ఉండకపోవచ్చు. కాబట్టి జీవనశైలి పూర్తిగా మందగించి.. బరువు పెరిగేలా చేస్తుంది" అని వైద్యులు తెలిపారు.

7. కుషింగ్ సిండ్రోమ్

అరుదైన సందర్భాల్లో కుషింగ్ సిండ్రోమ్ వంటి కొన్ని ఎండోక్రైన్ రుగ్మతలు బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఈ పరిస్థితికి కార్టిసాల్ అనే హార్మోనే కారణం. ఇది ఒత్తిడిని పెంచి.. బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు పెరగడంతో పాటు, గెడ్డం వెంట్రుకలు, మధుమేహం, స్ట్రెచ్ మార్క్‌లకు కూడా వస్తాయి.

మీరు బరువు పెరగడానికి కారణాలు తెలుసుకుని వైద్యుని సంప్రదించి.. వ్యాధులకు చికిత్స తీసుకుంటే మంచిదని.. బరువు కూడా అదుపులోకి వస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం