Constipation Problem In Summer : వేసవిలో మలబద్ధకంతో బాధపడితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి
Constipation Problem In Summer : మలబద్ధకం సమస్య ఈ కాలంలో సాధారణమైపోయింది. అయితే కొందరు వేసవిలో ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారు. దీని నుంచి బయటపడేందుకు కొన్ని డ్రింక్స్ ఉన్నాయి.
మలబద్ధకం అనేది వేసవిలో చాలా మంది బాధపడే సాధారణ సమస్య. ఒక వ్యక్తి వివిధ కారణాల వల్ల మలబద్ధకం కావచ్చు. వాటిలో అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ తినడం, ఫైబర్ లేని ఆహారాలు తినడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక ఒత్తిడికి గురికావడం, వ్యాయామం చేయకపోవడం వంటివి ఉంటాయి. మలబద్ధకం సమస్య వస్తే.. జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవాలి.
ఒక వ్యక్తి ముఖ్యంగా వేసవిలో మలబద్ధకంతో బాధపడుతుంటే దీనికి ప్రధాన కారణం శరీరంలో నీరు లేకపోవడమే. ఎక్కువ నీరు త్రాగాలి. ఇది కాకుండా కొన్ని పానీయాలు కూడా మలబద్ధకం సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో మీరు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని సహజ పానీయాలను ఇప్పుడు చూద్దాం. ఈ పానీయాలను రోజూ తాగడం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు.
బెల్లం నీరు
మీరు తరచుగా మలబద్ధకంతో బాధపడుతున్నారా? మీరు సహజమైన మార్గంలో దాన్ని వదిలించుకోవాలనుకుంటే, బెల్లం నీరు మీకు చాలా సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ బెల్లం కలపండి. రాత్రి పడుకునే ముందు తాగాలి. దీని కారణంగా బెల్లంలోని అదనపు మెగ్నీషియం మలబద్ధకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయం నిద్రలేవగానే సులభంగా మలం విసర్జించడంలో సహాయపడుతుంది. కావాలంటే ఒకసారి ప్రయత్నించండి.
నిమ్మరసం
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తయారుచేసుకున్న ఒక గ్లాసు నిమ్మరసం తాగండి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు సాధారణీకరించబడి, శరీరంలోని విషపదార్థాలు ఇబ్బంది లేకుండా వెంటనే బయటకు వెళ్లిపోతాయి.
యాపిల్ జ్యూస్
యాపిల్స్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రకమైన ఫైబర్ ఆరోగ్యకరమైన పేగులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక యాపిల్ జ్యూస్ తయారు చేసి తాగితే అందులోని పీచు కారణంగా మలబద్ధకం సమస్య దరిచేరదు.
బేకింగ్ సోడా వాటర్
బేకింగ్ సోడా వాటర్ వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో బేకింగ్ సోడా కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగితే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఒకసారి ప్రయత్నించండి.
ఆవనూనె
పురాతన కాలం నుండి మన పూర్వీకులు మలబద్ధకం నివారణగా ఆవనూనెను ఉపయోగిస్తున్నారు. ఇది పేగులను కూడా నియంత్రిస్తుంది. మలబద్ధకం సమస్య నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో 1 టీస్పూన్ ఆముదం తీసుకోండి. ఇది మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
త్రిఫల చూర్ణం
త్రిఫల వివిధ ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యంలో సూచించబడింది. ఈ త్రిఫల చూర్ణాన్ని 2 టీస్పూన్లు తీసుకుని 1 గ్లాసు నీటిలో కలిపి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా తాగితే మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.