Diabetic Friendly । మధుమేహం ఉన్నవారు కూడా ఈ రకమైన తీపిని ఆస్వాదించవచ్చు!
Diabetic Friendly Cooking: షుగర్ వ్యాధి ఉన్నవారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ వారి ఆరోగ్య పరిస్థితి కారణంగా తినలేరు. అయితే కొన్ని మార్గాల ద్వారా మధుమేహం ఉన్నవారు కూడా తమకు ఇష్టమైన వంటకాలను కూడా ఇష్టంగా తినవచ్చు.
Diabetic Friendly Cooking: మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెరను నియంత్రించుకోవడం అనేది ప్రతిరోజూ ఎదుర్కొనే కఠిన పరీక్ష. ఈ కారణంగా వారు తమకు నచ్చిన ఆహారాలను ఆస్వాదించలేరు, విందులకు హాజరైనా తృప్తిగా భోజనం చేయలేరు, స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. అయితే కొన్ని మార్గాల ద్వారా మధుమేహం ఉన్నవారు కూడా తమకు ఇష్టమైన వంటకాలను కూడా ఇష్టంగా తినవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో వంటకాలను తయారు చేసి వివిధ రుచులకు ఆస్వాదించవచ్చు. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, కాయధాన్యాలు, గింజలు, ఓట్స్ , సుగంధ ద్రవ్యాలు మొదలైనవి బ్లడ్ షుగర్‌ని నియంత్రించడంలో సహాయపడగలవు. వీటిని ఉపయోగించి వంటకాలను డయాబెటీస్-ఫ్రెండ్లీగా మార్చవచ్చు.
ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ వారి ఆరోగ్య పరిస్థితి కారణంగా తినలేరు. అయితే చక్కెర, మైదాలకు బదులుగా ఖర్జూరం, అత్తి పండ్లను, తీపి పండ్లు, గింజలు, సహజ సుగంధాలు ఉపయోగించి చేసే స్వీట్స్ మధుమేహులు కూడా తినవచ్చు.
ది మెట్రోపాలిటన్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్వప్నదీప్ ముఖర్జీ మధుమేహం ఉన్నవారు మితంగా ఆస్వాదించగల రెండు డెజర్ట్ రెసిపీలను పంచుకున్నారు. ఇక్కడ చూడండి
Makhana Cinnamon Kheer Recipe
- మృదువైన తెల్లని మఖానాలు - 100 గ్రా
- ఆలివ్ నూనె - 0.5 గ్రా
- కొవ్వు లేని పాలు - 400 మి.లీ
- పచ్చి బాదం - 10 గ్రా
- ఖర్జూరం (సన్నగా తరిగినవి) - 1 1/2 కప్పు
- ఆప్రికాట్లు లేదా అత్తి పండ్లు - 0.5 గ్రా
- చూర్ణం చేసిన దాల్చినచెక్క - 0.5 గ్రా
మఖానా పాయసం తయారీ విధానం
- మఖానాను రెండు భాగాలుగా కట్ చేసి, ఆలివ్ నూనెతో పాటు కలిపండి. సాస్ పాన్ మీద సుమారు 5 నిమిషాల పాటు తక్కువ వేడి మీద వేయించాలి.
- ఆ తర్వాత పాలు, తరిగిన ఖర్జూరం వేసి బాగా కలపాలి.
- సుమారు 1 గంట లేదా పాలు సగం అయ్యే వరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మఖానా పాయసం రెడీ.
Pineapple Cookies Recipe కోసం కావలసినవి
- వెన్న (ఉప్పు లేనిది) - 425 గ్రా
- లేత గోధుమ చక్కెర - 230 గ్రా
- పిండి - 550 గ్రా
- పైనాపిల్ ముక్కలు - 100 గ్రా
పైనాపిల్ కుకీలు తయారు చేసే విధానం
- క్రీమ్ బటర్, పంచదార కలిపి మెత్తటి ముద్దలా తయారు చేయండి.
- పిండిని జల్లెడ పట్టిన తర్వాత, మృదువైన పిండిని క్రీమ్ చేసిన వెన్నలో కలిపి ముద్దగా చేయండి అందులోనే పైనాపిల్ ముక్కలను కూడా కలిపి మడవండి.
- అనంతరం ఈ మిశ్రమాన్ని 1-4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 60 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి. మరోవైపు ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీహీట్ చేయండి.
- ఇప్పుడు కుకీ మిక్స్‌ను బయటకు తీసి, రోల్స్ చేసుకొని కావలసిన ఆకారాలలో కట్ చేసుకోండి.
- ఆపైన 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15-20 నిమిషాలు బేక్ చేయండి. పూర్తయ్యాక బయటకు తీసి చల్లబరచండి.
- పైనాపిల్ కుకీలు రెడీ. గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి ఎప్పుడైనా తింటూ ఆనందించండి!