NNS 07th October Episode: ఆరుకి మనోహరి వార్నింగ్.. అందరినీ కాకా పట్టిన అంజు.. అరుంధతికి అద్భుత శక్తులు!
NNS 07th October Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్లో అరుంధతికి మనోహరి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ఆరుకి అద్భుత శక్తులు వచ్చినా ఆమె గుర్తించలేకపోతుంది. ఇక తన తాతయ్యను కాకా పట్టే పనిలో ఉంటుంది అంజు.
NNS 07th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆరు ఇచ్చిన సలహాతో అమర్‌కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది భాగీ. అమర్ దగ్గరకు వెళ్లి థాంక్స్ చెప్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఇంతలో భాగీ నిద్రపోయి అమర్ మీద ఒరుగుతుంది. అమర్ భాగీని మంచం మీదకు పడుకోబెడతాడు.
ఆరుకి అద్భుత శక్తులు
గార్డెన్ లోకి వెళ్లిన గుప్త నవ్వుతూ ఆరును ఎక్కడున్నావు బాలిక నీ ముఖము ఒకసారి చూడాలని ఉంది అంటూ పరిహాసమాడుతుంటాడు. ఇంతలో యముడు వచ్చి ఆ బాలికను తీసుకుని మన లోకానికి రమ్మని చెబితే రావటం లేదేంటని కోప్పడతాడు.
నాలుగు మండలాలు ఆత్మ భూమ్మీద ఉన్నచో ఆత్మ స్పర్శ శక్తితో పాటు ఏమి అనుకుంటే అది జరిగే శక్తి వస్తుందని చెప్పి వెళ్లిపోతాడు యముడు. హత విధి జరగకూడనిది జరిగిపోయింది. ఆ బాలికకు కానీ తనకు శాశ్వతంగా శక్తులు వచ్చినవి అని తెలిసినచో.. ఇక ఆ బాలిక నాతో బంతి ఆట ఆడునే.. అని గుప్త బాధపడతాడు.
తాతయ్యకు కాకా పట్టిన అంజు
స్కూల్ కు పెద్దవాళ్లను తీసుకెళ్తే తప్ప ఆ ప్రిన్సిపాల్ నన్ను వదిలేసేలా లేదే ఇప్పటికి ఇప్పుడు మనకోసం బకరా అయ్యేది ఏవరబ్బా.. అనుకుంటూ శివరాం దగ్గరకు వెళ్తుంది అంజు. గుడ్ మార్నింగ్ తాతయ్యా.. మీకే తాతయ్యా.. అంటుంది అంజు. గుడ్ మార్నింగ్ అంటున్న శివరామ్‌తో ఏమైనా కావాలా తాతయ్యా.. అని అడుగుతుంది. ముందు నీకేం కావాలో చెప్పు అంటాడు శివరామ్.
నువ్వు భలే షార్ప్ తాతయ్యా ఇట్టే పసిగట్టేస్తావు అంటున్న అంజుతో చుట్టూ పొట్టిగా ఉండే శత్రువులు ఉంటారు కదా అందుకే అలర్ట్ గా ఉంటాను. ఏం కావాలో చెప్పు అంటాడు శివరామ్. అది తాతయ్యా స్కూల్ లో మా ఫ్రెండ్స్ కు మా నాన్నే కాదు మా తాతయ్య కూడా పెద్ద మిలటరీ ఆఫీసరు అని చెప్పా.. వాళ్లు అస్సలు నమ్మలేదు తెలుసా..? అందుకే ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్లకు మిమ్మల్ని చూపించాలనుకున్నాను తాతయ్యా.
అంతే కదా సరే సరేలే నేను వస్తానులే.. అని చెప్పగానే అమ్ము వచ్చి అసలు విషయం చెప్తుంది. దాంతో శివరాం షాక్ అవుతాడు. నేను ఏ స్కూల్ కు రానని చెప్తాడు. దీంతో అంజు బాధపడుతుంది. ఎందుకు అంత బాధపడతావు మిస్సమ్మను అడుగు వస్తుంది అని చెప్తారు పిల్లలు.
అరుంధతికి మనోహరి వార్నింగ్
మరోవైపు గార్డెన్ లో ఆరు అటూ ఇటూ తిరుగుతుంది. గుప్త, యముడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అబ్బబ్బా ఏంటండి ఈ ఎండ రాత్రేమో వర్షం పొద్దున్నేమో ఈ ఎండ దేవుళ్లలో వెదర్ ను మానిటర్ చేసేదెవరు? అని అడుగుతుంది ఆరు. సరేలే బాలిక ఈసారి ముల్లోకముల మీటింగ్ జరిగినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్లెదను. అప్పుడు నీవు చెప్పుము అంటాడు గుప్త.
సరే సరే కొంచెం ముందే చెప్పండి ఇక్కడ ఏదైనా పని ఉంటే మళ్లీ నేను రాలేను కదా? అంటుంది ఆరు. మనోహరి పై నుంచి గార్డెన్ లోకి చూస్తుంది. అక్కడ అరుంధతి ఉందని నిర్దారించుకున్న తర్వాత గార్డెన్ లోకి వచ్చి ఏంటే ఆరు ఇక్కడే ఉన్నావా..? ఇక్కడే ఉండి ఉంటావులే.. గేటు బయట ఉండటానికి నీకెవరు ఉంటారులే.. ఏంటే నా మొగుణ్ని కలవడానికి వెళ్లావంటా? నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్లావంటే ఏదో ప్లాన్ చేస్తున్నావు అని నాకు అర్థం అయింది. నా దగ్గర నీ ఆటలు సాగవు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మనోహరి.
అంజుకి సాయం చేయొద్దన్న పిల్లలు
ఆరు కోపంగా మనోహరిని తిడుతుంది. కనీసం ఆ దేవుడైనా దాని తిక్క కుదర్చడానికి ఏ కొమ్మో.. కాయో విరిగి దాని మీద పడి ఉంటే బాగుండు అంటుంది. దీంతో కొబ్బరిబొండం రాలి పడుతుంది. కొద్దిలో మనోహరి తప్పించుకుంటుంది. పిల్లలు ముగ్గురు భాగీ దగ్గరకు వెళ్లి అంజు నీ దగ్గరకు హెల్ప్ అడగడానికి వస్తుందని నువ్వు ఒప్పుకోవద్దని చెప్తారు.
మిస్సమ్మ అంజుకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుందా? ఆరుకి తన శక్తుల గురించి ఎలా తెలుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్ 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్