NNS 30th September Episode: పౌర్ణమి వేళ మనోహరిలో అలజడి.. అరుంధతిని యమలోకానికి తీసుకెళానన్న గుప్తా
Nindu Noorella Savasam September 30th Episode: పౌర్ణమి రోజున అరుంధతి ఆత్మ ఏం చేస్తుందోనని మనోహరి హైరానా పడుతుంది. కంగారుగా తిరుగుతుంటుంది. నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‍లో ఏం జరగనుందో ఇక్కడ చూడండి.
జీ తెలుగు సీరియల్ ‘నిండు నూరేళ్ల సావాసం’లో నేటి ఎపిసోడ్ (సెప్టెంబర్ 30)లో ఏం జరగనుందంటే.. అమర్‌ను కోప్పడుతూ అక్కలా నేను చనిపోతే అని భాగీ (మిస్సమ్మ) అనగానే.. భాగీ నోరు మూస్తాడు అమర్. పక్కనే ఉండి చూస్తున్న ఆరూ (అరుంధతి) ఎమోషనల్ అవుతుంది. “మాట వరసకు కూడా ఇంకోసారి ఆ మాట అనకు మిస్సమ్మ. నీకేం కాదు.. కాకూడదు. కానివ్వను. ఈ ఇంటికి, నాకు నువ్వు ఎంత ఇంపార్టెంటో నీకు కూడా తెలియదు మిస్సమ్మ. ఇంకోసారి అలా మాట్లాడకు. ప్లీజ్. ఇవాళ జరిగిన దానికి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలుసు” అని అమర్ అనగానే భాగీ మౌనంగా వెళ్లిపోతుంది. కిటికీలోంచి అంతా చూస్తున్న ఆరూ ఎమోషనల్ అవుతుంది. తర్వాత బయటకు వెళ్లి కూర్చుని ఏడుస్తుంది ఇంతలో గుప్త వస్తాడు.
కన్నీళ్లో.. ఆనందబాష్పాలో తెలీదు
“బాలిక దుఃఖించుచుంటివా? నీ దుఃఖమునకు కారణం ఎవరో చెప్పుము. వారికి ఇప్పుడే శిక్షను విధించెద. ఆ మనోహరే కదా నీ బాధకు కారణం. తక్షణమే ఆ బాలికను శిక్షంచెదను” అని ఆరూతో అంటాడు గుప్తా. మనోహరి కాదు గుప్తగారు. మా ఆయన అంటుంది ఆరు. ఏమిటి నీ దుఃఖమునకు కారణం నీ పతిదేవుడా?అంటాడు గుప్తా. “ఇవి కన్నీళ్లో ఆనంద భాష్పాలో తెలియడం లేదు గుప్తాగారు” అంటుంది ఆరు. “ఏమి మాట్లాడుతున్నావు బాలిక. అసలు ఏమి జరిగినది. ఓహో నీ పతి దేవుడు ఆ బాలికకు దగ్గర అవుతున్నాడని బాధపడుతున్నావా?” అంటాడు గుప్తా. “అదే తెలియడం లేదు గుప్త గారు. ఆయన మిస్సమ్మకు దగ్గర అయిన ప్రతిసారి నాకు జలసి అనిపించేది. కానీ ఈసారి ఎందుకో చాలా కొత్తగా అనిపించింది. ఆయన మిస్సమ్మ మీద చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు ముచ్చటేసింది గుప్త గారు. మిస్సమ్మ ఎంత అదృష్టవతురాలో అనిపించింది” అంటూ ఆరూ ఎమోషనల్ అవుతుంది.
అమర్ నిద్రపోతుంటేభాగీ వెళ్లి పక్కన కూర్చుంటుది. మిస్సమ్మ ఆయన పక్కన ఉంటే మనసు ఒప్పుకోకున్నా.. ఆయన ప్రేమ మిస్సమ్మకు దక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు అని చెప్పి వెళ్లిపోతుంది ఆరు. రేపు పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయిన వెంటనే నిన్ను మా లోకానికి తీసుకుపోతాను అనుకుంటాడు గుప్తా.
ఆరూ ఆత్మ కోసం మనోహరి
ఆ తర్వాత ఘోర.. మనోహరికి ఫోన్ చేసి తనలో ఆరూ ఆత్మ ప్రవేశించిందా? అని అడుగుతాడు. “ఇంకా పౌర్ణమి గడియలు మొదలైనట్టు లేదు. మొదలైతే నేను పెట్టిన భయానికి కచ్చితంగా నా ఒంట్లోకి ప్రవేశింస్తుంది” అంటుంది మనోహరి. “అయ్యో మనోహరి పౌర్ణమి ఘడియలు మొదలు అవ్వకపోవడం ఏంటి? మొదలై చాలా సేపు అయింది” అంటాడు ఘోరా. “ఏంటి నిజమా? అంటే ఇప్పుడది ఎవరి ఒంట్లోకైనా ప్రవేశించింది అంటావా?” అంటుంది మనోహరి. “ఆ విషయం తెలుసుకోవాల్సింది నువ్వు. ముందు వెళ్లి అది కనిపెట్టు. ఒకవేళ వేరే వాళ్ల శరీరంలోకి ప్రవేశించి ఉంటే నీ ఒంట్లోకి వచ్చేలా చేసుకో” అంటాడు ఘోరా. “సరే నేను తెలుసుకుంటాను. నువ్వైతే పూజకు రెడీ చేసుకో” అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మనోహరి.
మనోహరి కంగారు
అంజలి డోర్ తెరుచుకుని వచ్చి మనోహరి వైపు గుర్రుగా చూస్తుంది. మనోహరి భయపడుతూ లేచి అంజు అని పిలుస్తుంది. దీంతో అంజు.. మనూ అని పిలుస్తుంది. మనోహరి షాక్ అవుతుంది. ఎవరు నువ్వు అంటూ అడగ్గానే వెటకారంగా మహాత్మాగాంధీ అంటుంది అంజలి. మనోహరి కోప్పడగానే ఇంతలో అమ్ము వచ్చి డోర్ దగ్గర నిలబడుతుంది. అమ్మును చూసిన మనోహరి డౌట్ లేదు ఆరు అమ్ములోనే ఉంది అనుకుంటుంది. అమ్ము మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది. “ఏమైంది ఎందుకు అడుగులు వెనక్కి వేస్తున్నావు” అంటూ భయపడుతూ అడుగుతుంది మనోహరి. నువ్వు… నువ్వు.. అంటున్న మనోహరితో “నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే వెంటనే చెప్పండి. నాకు స్కూల్ కు టైం అవుతుంది” అంటుంది అమ్ము. అది కాదు నువ్వు ఇందాకా కోపంగా చూశావా? కదా అంటున్న మనోహరితో అదా ఆంటీ అసలే స్కూల్ కు టైం అవుతుంది అనుకుంటే ఈ అంజు నీతో ఏదో మాట్లాడాలి అని ఇక్కడకు వచ్చింది అంటూ అంజును తీసుకుని వెళ్లిపోతుంది అమ్ము.
మనోహరిపై భాగీ ఫైర్
అసలు ఆరూ ఆత్మ ఎవరిలో దూరింది అని ఆలోచిస్తూ.. కిచెన్‌లోకి వెళ్లి టమాటాలు కట్ చేస్తున్న భాగీని చూసుంది మనోహరి. ఆరూ అని పిలుస్తుంది మనోహరి. దీంతో “నీకేమైనా చిప్పు మిస్ అయ్యిందా? నా పేరు భాగీ.. భాగమతి నన్ను ఆరు అక్క పేరుతో పిలుస్తావేంటి” అని కోప్పడుతుంది భాగీ. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆరూ కోసం వెతుకుతుంటాడు గుప్తా. ఆరూ ఎక్కడ కనిపించదు.
గుప్తాకు యముడి ఆజ్ఞ
ఇంతలో యముడు వచ్చి ఇంకా ఆ బాలిక (ఆరూ)ను ఇంకా తీసుకురాలేదేంటి అని గుప్తాను అడుగుతాడు. పౌర్ణమి ఘడియలు ముగిసేలోపు ఆ బాలికను తీసుకుని వస్తాను అని చెప్తాడు గుప్తా. ఆ మాటలు ఆరూ వింటుంది. పౌర్ణమి రోజు వచ్చే శక్తులతో ఆరూ ఏం చేయబోతోంది? ఆరూకు నిజం ఎలా తెలుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ రోజు సెప్టెంబర్ 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాలి.