NNS 30th August Episode: అమర్ ఒళ్లో భాగీ.. కోపంలో మనోహరి.. తన కూతురు ఎక్కడుందో తెలుసుకున్న రామ్మూర్తి!
NNS 30th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఆగస్ట్ 30) ఎపిసోడ్ లో అమర్ ఒళ్లో భాగీ పడుతుంది. అది చూసి కోపంతో రగిలిపోయిన మనోహరి.. ఆమెను చంపేందుకు కిచెన్ లో గ్యాస్ లీక్ చేస్తుంది.
NNS 30th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 30) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్, భాగీని దగ్గర చేసేందుకు పిక్నిక్ ప్లాన్ వేస్తాడు శివరామ్. పిల్లల్ని బయటకు తీసుకెళ్లేందుకు అమర్‌ని ఒప్పించే బాధ్యత నీదేనని భాగీకి గట్టిగా చెప్పి పంపిస్తాడు.
షాక్‌లో మనోహరి
శివరామ్ ప్లాన్ తెలుసుకున్న మనోహరి షాకవుతుంది. ఈ ముసలోళ్లు మళ్లీ వాళ్లిద్దరినీ కలిపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీళ్లని ఏదో ఒకటి చేయాలి ముందు అనుకుంటుంది. మనోహరి తనలో తను మాట్లాడుకోవడం చూసి నవ్వుకుంటాడు గుప్త. వాళ్లిద్దరినీ విడదీయడం నీవల్ల కాదనే సంగతి నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో బాలిక అనుకుంటాడు.
అమర్ ఒళ్లో భాగీ.. కిచెన్‌లో గ్యాస్ లీక్
పిక్నిక్ విషయం అమర్‌తో మాట్లాడాలని కాఫీ తీసుకుని వెళ్తుంది భాగీ. కానీ అమర్ ముందు మాట్లాడలేక కాఫీ అక్కడ పెట్టి తిరిగివెళ్లబోతు సోఫా తగిలి అమర్ ఒళ్లో పడిపోతుంది. ఇద్దరూ దగ్గరగా ఉండటం చూసిన మనోహరి కోపంతో రగిలిపోతుంది.
ఇది రోజురోజుకీ అమర్‌కి దగ్గరైపోతుంది. వీళ్లిద్దరి మధ్య బంధం బలపడకముందే దాన్ని అమర్‌కి దూరం చేయాలి. అప్పుడే నేను అమర్‌కి దగ్గరవ్వొచ్చు అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేస్తుంది మనోహరి.
మీద పడినందుకు అమర్ ఏం అంటాడోనని బయపడుతున్న భాగీ అమర్ స్వయంగా సారీ చెప్పడంతో షాక్ అవుతుంది. ఎందుకు అంటుంది. ఏం లేదంటాడు అమర్. కాఫీ తాగమని మెల్లిగా పిక్నిక్ విషయం ప్రస్తావించాలనుకుంటుంది.
అరుంధతి చివరి కోరిక
చిత్రగుప్తతో అంజు గురించి చెప్పి మురిసిపోతుంది అరుంధతి. అంజుది అచ్చంగా అమ్మపోలిక అని ఏడిపిస్తాడు గుప్త. నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంది. ఆ ఘోరా మళ్లీ ఏం చేయకముందే మనం మా లోకానికి వెళ్లిపోయేదమా? అని అడుగుతాడు. తనకి ఏం వినిపించట్లేదంటూ అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది అరుంధతి. వినపడినా వినపడనట్లు నటిస్తున్నావని నాకు తెలుసు అంటాడు గుప్త.
నేను రానని తెలిసీ ఎందుకు మళ్లీమళ్లీ అడుగుతారు అంటుంది అరుంధతి. అన్ని కోరికలూ నెరవేరినా నా చివరికోరిక నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుకోకుండా ఎలా మీతో రావాలి గుప్తగారు? అని అడుగుతుంది. మీ మానవుల కోరికలకు అంతనేది ఉండదా అంటాడు గుప్త. నువ్వు అనుకున్నట్లే నీ తల్లిదండ్రులను త్వరలోనే కలుసుకుంటావు అని చెబుతాడు. సంబరపడిపోతుంది అరుంధతి.
పిక్నిక్‌కు సరే అన్న అమర్
భాగీ ఏదో మాట్లాడాలనుకుంటుందని తెలుసుకున్న అమర్ ఏంటని అడుగుతాడు. పిక్నిక్ విషయం చెప్పడానికి భయపడిపోతుంది భాగీ. ఏంటో చెప్పు అని అమర్ గట్టిగా అనడంతో... పిల్లలు నిన్న జరిగినదానికి భయపడిపోయారని వాళ్లకి కొంచెం చేంజ్ ఉంటుంది బయటకు తీసుకెళ్లమని అడగమన్నారు మామయ్య అంటుంది మిస్సమ్మ. సరే అంటాడు అమర్.
ఆశ్చర్యపోయిన మిస్సమ్మ అదేంటీ.. ఏం అడగరా.. ఎందుకు అని అడగరా.. అంటుంది. లేదు అంటాడు అమర్. అడగ్గానే పిక్నిక్కి తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నందుకు సంబరపడిపోతుంది మిస్సమ్మ. భాగీని చంపేందుకు మనోహరి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అరుంధతి తల్లిదండ్రుల గురించి ఎలా తెలుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్ట్ 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!