NNS 22nd August Episode: మిస్సమ్మను మెచ్చుకున్న అమర్.. అరుంధతి అసూయ.. మనోహరికి షాకిచ్చిన బ్లాక్‌మెయిలర్!
NNS 22nd August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు (ఆగస్ట్ 22) ఎపిసోడ్లో మిస్సమ్మను అమర్ మెచ్చుకుంటాడు. అది చూసి అరుంధతి అసూయ చెందుతుంది. మరోవైపు మనోహరికి షాకిచ్చిన బ్లాక్‌మెయిలర్ ఎవరో కూడా ఇదే ఎపిసోడ్లో తేలనుంది.
NNS 22nd August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 22) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పరుగుపందెంలో గెలిచినందుకు అంజుని అందరూ మెచ్చుకుంటారు. అన్ని ఆటల్లో పాల్గొనాలనుకున్నా కానీ మిగతా వాళ్లకి కూడా కొన్ని బహుమతులు రావాలి కదా అని ఊరుకుంటున్నా అంటుంది అంజు. అంతలేదు నీకు అని ఏడిపిస్తుంది అమ్ము.
మిస్సమ్మకి పొగిడిన అమర్
తన చెస్ కాంపిటీషన్ అయ్యేవరకు ఉండమని అమర్‌ని అడుగుతాడు ఆకాష్. తనకు పనుందని అక్కడ నుంచి బయల్దేరతాడు అమర్. ఏవండీ.. ఏవండీ.. అంటూ మిస్సమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైందని అడుగుతాడు అమర్. మీకు తెలియదా.. తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారా? అని అడుగుతుంది మిస్సమ్మ. పిల్లల ముఖంలో మిమ్మల్ని చూడగానే వచ్చిన ఆనందం.. మీరు వెళ్తుంటే విచారం చూసి కూడా ఎందుకు వెళ్తున్నారు అంటుంది.
నువ్వున్నావనే ధైర్యంతోనే వెళ్తున్నా.. వాళ్ల అమ్మస్థానంలో ఉండి వాళ్లను చూసుకుంటావని వెళ్తున్నా అంటాడు అమర్. ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోతుంది మిస్సమ్మ. అమర్ మాటలు విని షాకవుతుంది అరుంధతి. ఏంటీ.. ఈయనలో సడెన్‌గా ఇంత మార్పొచ్చిందేంటి అనుకుంటుంది. నామీద నమ్మకం పెట్టినందుకు థ్యాంక్స్ అంటుంది మిస్సమ్మ. జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు అమర్. అమ్మ.. ధైర్యం.. అంటూ అమర్ మాటల్ని గుర్తుచేసి మిస్సమ్మను ఆటపట్టిస్తాడు రాథోడ్. అదంతా చూసి అసూయ పడుతుంది అరుంధతి.
బ్లాక్‌మెయిలర్ దగ్గరికి మనోహరి
బ్లాక్‌మెయిలర్ చెప్పిన చోటుకి వెళ్లి ఫోన్ చేస్తుంది మనోహరి. కనిపిస్తున్నావని అనగానే చుట్టూ చూస్తుంది. ఎదురుగా ఉన్న చెత్తకుండిలో సూట్‌కేస్ పెట్టి వెళ్లమంటాడు బ్లాక్‌మెయిలర్. కానీ తన కళ్లముందు ఆ వీడియో డిలిట్ చేస్తేనే డబ్బులిస్తాను అంటుంది మనోహరి. నువ్వు నన్ను డిమాండ్ చేసే స్థితిలో లేవని గుర్తుంచుకో అంటాడు బ్లాక్‌మెయిలర్.
ఎంత వాదించినా బ్లాక్‌మెయిలర్ తన ముందుకు రాకపోవడంతో డబ్బులున్న సూట్‌కేస్ చెత్తకుండీలో పెడుతుంది మనోహరి. అక్కడే కార్లో కూర్చుని మనోహరిని గమనిస్తున్న బ్లాక్‌మెయిలర్ మనోహరిని వెనక్కి చూడకుండా అక్కడ నుంచి వెళ్లిపొమ్మని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే బుర్ఖా వేసుకున్న ఒకామె ఆ సూట్‌కేస్ తీసుకుని ఆటోలో వెళ్లిపోవాలని చూస్తుంది. కానీ వెళ్లిపోయినట్లు నాటకమాడిన మనోహరి ఆటోకి కారు అడ్డుపెట్టి ఆపుతుంది.
స్పీచ్‌తో ఏడిపించిన అమ్ము
చెస్ పోటీలో గెలవాలని ఆకాష్‌ని ప్రోత్సహిస్తుంది మిస్సమ్మ. ఆ మాటల్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఆడి గెలుస్తాడు ఆకాష్. పిల్లలు, మిస్సమ్మ సంతోషంగా చప్పట్లు కొడతారు. ఆనంద్ కూడా బ్యాడ్మింటన్‌లో బాగా ఆడుతాడు. అరుంధతి ఆనంద్ ఆట చూసి సంబరపడుతుంది. అది గమనించిన మిస్సమ్మ ఏంటీ.. అక్క ఆనంద్ ఆట చూసి సంబరపడిపోతుంది అనుకుంటుంది.
ఎవరో తనని పిలిచినట్లు అక్కడ నుంచి పరిగెడుతుంది అరుంధతి. ఎవరూ లేకున్నా అలా వెళ్లిపోయారేంటి అనుకుంటుంది మిస్సమ్మ. తమని ఆటల్లో గెలిపించినందుకు పిల్లలు మిస్సమ్మకు థ్యాంక్స్ చెబుతారు. అసెంబ్లీలో అమ్ము స్పీచ్‌తో అదరగొడుతుందంటుంది మిస్సమ్మ. అమ్మ గురించి మాట్లాడి అందరితో కంటతడి పెట్టిస్తుంది అమ్ము.
అమృత మాటలు విని అరుంధతి ఏడుస్తుంది. ఒకప్పుడు అమ్మను తలుచుకుంటే ముఖంలో చిరునవ్వు వచ్చేదని, ఇప్పుడు మాత్రం అమ్మ గుర్తొస్తే కన్నీళ్లు వస్తున్నాయంటుంది అమ్ము. అరుంధతితో పాటు మిస్సమ్మ గురించి కూడా మాట్లాడుతుంది. అమ్మను మరిపించే ప్రేమ పంచుతున్న మిస్సమ్మకు కృతజ్ఞతలు చెబుతుంది. అందరూ అమ్ము స్పీచ్‌ని మెచ్చుకుంటారు. స్కూల్లో ఏం జరగబోతుంది? బ్లాక్‌మెయిలర్‌గా నటించింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్ట్ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!