Karthi: సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నాం.. కానీ: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కార్తి-we consider meiyalagan telugu version satyam sundaram for direct ott release earlier karthi reveals ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthi: సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నాం.. కానీ: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కార్తి

Karthi: సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నాం.. కానీ: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కార్తి

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 02, 2024 11:43 AM IST

Karthi: సత్యం సుందరం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్ కోసం విజయవాడకు వచ్చారు తమిళ హీరో కార్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Karthi: సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నాం.. కానీ: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కార్తి
Karthi: సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నాం.. కానీ: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కార్తి

తమిళ స్టార్లు కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన మేయళగన్ మూవీ ప్రశంసలు దక్కించుకుంటోంది. తెలుగులో సత్యం సుందరం పేరుతో ఈ చిత్రం రిలీజ్ అయింది. తమిళంలో సెప్టెంబర్ 27న రిలీజైన ఈ మూవీ.. ఒక్క రోజు తర్వాత తెలుగులోనూ విడుదలైంది. రెండు భాషల్లోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్లు బాగా పెరిగాయి.

సత్యం సుందరం సక్సెస్ మీట్ కోసం విజయవాడకు కార్తి వచ్చారు. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత సక్సెస్ మీట్‍లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.

ముందుకు ఓటీటీకి అనుకున్నాం..

మేయళగన్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేసే విషయంలో ముందుగా చాలా ఆలోచించామని కార్తి చెప్పారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ముందుగా కాన్ఫిడెంట్‍గా లేమని చెప్పారు. అందుకే తెలుగు వెర్షన్ ‘సత్యం సుందరం’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచన చేసినట్టు కార్తి తెలిపారు.

కానీ, సత్యం సుందరం చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేద్దామని ఏషియన్ సునీల్ తమకు నమ్మకాన్ని ఇచ్చారని కార్తి వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ రిలీజ్ చేసింది. అంచనాలకు మించి ఈ చిత్రం వసూళ్లు రాబడుతోంది. అంతటా పాజిటివ్ రివ్యూలు రావటంతో తొలి రోజు కంటే ఆ తర్వాత వసూళ్లు పెరిగాయి.

సత్యం సుందరం మూవీకి ‘96’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 96 చిత్రంలో లవ్ స్టోరీతో ఫీల్ గుడ్ మూవీని తీసిన ప్రేమ్.. మరోసారి మ్యాజిక్ చేశారు. అయితే, ఈ సారి బావబామ్మర్ది మధ్య బంధాన్ని హృదయాలకు హత్తుకునేలా చూపించారు. కామెడీ, ఎమోషన్‍తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. కార్తి, అరవింద స్వామి తమ యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.

18 నిమిషాలు కట్

సత్యం సుందరం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. కాస్త సాగదీతగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 18 నిమిషాల రన్‍టైమ్‍ను కట్ చేసింది. సుదీర్ఘంగా ఉన్న సంభాషణలను కాస్త ట్రిమ్ చేసింది. ఈ చిత్రానికి ఇది మరింత ప్లస్ అవుతోంది.

సత్యం సుందరం చిత్రానికి అంతటా ప్రశంసలు దక్కుతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈమూవీ చూస్తున్నంత సేపు తన ముఖంపై చిరునవ్వు ఉందని, అదే నవ్వుతో నిద్రించానని తెలిపారు. కార్తీ, అరవింద స్వామి యాక్టింగ్ అద్భుతంగా ఉందని అన్నారు. ఈ చిత్రం తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసిందని కూడా నాగ్ చెప్పారు. ఊపిరి మూవీ సమయాన్ని కూడా గుర్తు చేసిందనన్నారు. నాగార్జున, కార్తి కలిసి ఊపిరి చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా మంచి సక్సెస్ అవటంతో పాటు మంచి మూవీగా ప్రశంసలు పొందింది.

సత్యం సుందరం చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య ప్రొడ్యూజ్ చేశారు. తమిళం, తెలుగులో ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించారు.