Karthi on Devara: నా బ్రదర్ ఎన్టీఆర్ సినిమా పెద్ద హిట్ కొట్టాలి: సత్యం సుందరం ఈవెంట్‍లో తమిళ స్టార్ హీరో కార్తి
- Karthi on Devara: తనకు సోదరుడి లాంటి ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పెద్ద హిట్ కావాలని తమిళ స్టార్ హీరో కార్తి అన్నారు. కార్తి లీడ్ రోల్ చేసిన సత్యం సుందరం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‍లో జరిగింది.
- Karthi on Devara: తనకు సోదరుడి లాంటి ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పెద్ద హిట్ కావాలని తమిళ స్టార్ హీరో కార్తి అన్నారు. కార్తి లీడ్ రోల్ చేసిన సత్యం సుందరం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‍లో జరిగింది.
(1 / 5)
తమిళ స్టార్లు కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన ఎమోషనల్ డ్రామా మూవీ సత్యం సుందరం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ కోసం ప్రీ-రిలీజ్ నేడు (సెప్టెంబర్ 23) హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో కార్తి మాట్లాడారు.
(2 / 5)
సెప్టెంబర్ 27వ తేదీన తన బ్రదర్ ఎన్టీఆర్ సినిమా దేవర రానుందని, ఆ చిత్రం పెద్ద హిట్ కొట్టాలని తాను ఆశిస్తున్నానని కార్తి అన్నారు. దేవరతో పోలిస్తే తమ సత్యం సుందరం చిన్నదేనని, కానీ చాలా మనసు పెట్టి చేశామమని, అందరికీ నచ్చుతుందని అన్నారు.
(3 / 5)
“27న నా బ్రదర్ సినిమా రాబోతోంది. తారక్‍కు, ఆయన అభిమానులకు విష్ చేస్తున్నా. పెద్ద హిట్ కొట్టాలి. ఆరేళ్ల తర్వాత సోలో సినిమా రాబోతోందంటే ఎంత అంచనాలు ఉంటాయో నాకు తెలుసు” అని కార్తి అన్నారు.
(4 / 5)
దేవర చిత్రం యుద్ధం లాంటి పెద్ద మూవీ అని కార్తి చెప్పారు. “అది (దేవర) వార్‌ఫేర్ లాంటి పెద్ద సినిమా. మనదేమో (సత్యం సుందరం) సిరిమల్లె చెట్టులాగా చిన్న సినిమా అని చెప్పవచ్చు. కానీ చాలా మనసుతో ఈ మూవీ చేశాం. 28వ తేదీ ఈ సినిమా కూడా చూస్తారని నమ్ముతున్నా. మీకు నచ్చుతుంది” అని కార్తి చెప్పారు.
ఇతర గ్యాలరీలు