Vishwak Sen: నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న బర్నింగ్ పాయింట్‌ను టచ్ చేశాం.. విశ్వక్ సేన్ కామెంట్స్-vishwak sen comments on mechanic rocky movie story and burning issue that continue from 4 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న బర్నింగ్ పాయింట్‌ను టచ్ చేశాం.. విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen: నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న బర్నింగ్ పాయింట్‌ను టచ్ చేశాం.. విశ్వక్ సేన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2024 12:17 PM IST

Vishwak Sen About Mechanic Rocky Story: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ. ఇటీవల విడుదలైన మెకానిక్ రాకీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే, నవంబర్ 22న మెకానిక్ రాకీ విడుదల కానున్న సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు విశ్వక్ సేన్.

నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న బర్నింగ్ పాయింట్‌ను టచ్ చేశాం.. విశ్వక్ సేన్ కామెంట్స్
నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న బర్నింగ్ పాయింట్‌ను టచ్ చేశాం.. విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen On Mechanic Rocky Story: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మెకానిక్ రాకీ'. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు.

మెకానిక్ రాకీ ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మెకానిక్ రాకీ మూవీ నవంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మెకానిక్ రాకీ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?

-గత నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్‌ని ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్ ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఈ సినిమా రెండు ఒకే సమయంలో చేశాను.

-ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్‌తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కచ్చితంగా మెకానిక్ రాకీలో ఆ ఎలిమెంట్‌కి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్‌ని తీసుకోవచ్చు.

-మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌కి సెకండ్ హాఫ్‌కి జోనర్ మారుతుంది. సెకండ్ హఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మేటర్ ఉంది. మేము ట్రైలర్‌లో కథని పెద్దగా రివిల్ చేయలేదు. సినిమాలో చాలా కథ ఉంది. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో వర్క్ చేయడం గురించి?

-రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఫస్ట్ డైరెక్టర్, రైటింగ్‌ని మెచ్చుకుంటారు. ఇది ట్రూ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఏమిటనేది ఆడియన్స్‌కి తెలిసిపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.

జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి?

-నేను ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. బీజీఎం చింపేశాడు. మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు.

ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?

-ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది.

మీనాక్షి, శ్రద్దా గురించి చెప్పండి?

-సినిమాలో నేను, మీనాక్షి, శ్రద్దా, నరేష్ గారు, రఘు, సునీల్ అన్నీ పాత్రలు ఈక్వెల్ ఇంపార్టెన్స్‌తో ఉంటాయి. ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. స్క్రీన్ ప్లే రేటింగ్‌కి చాలా మంచి పేరు వస్తుంది. సునీల్ గారు నరేష్ గారితో ఒక మెమరబుల్ మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. అది ఈ సినిమాతో కుదిరింది. సునీల్, రఘు యాంటీ హీరో రోల్స్ చేస్తున్నారు.

Whats_app_banner