Vikram Cobra Movie Review: విక్రమ్ కోబ్రా మూవీ రివ్యూ - విక్రమ్ పది గెటప్స్ ఎలా ఉన్నాయంటే-vikram srinidhi shetty cobra movie telugu review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Cobra Movie Review: విక్రమ్ కోబ్రా మూవీ రివ్యూ - విక్రమ్ పది గెటప్స్ ఎలా ఉన్నాయంటే

Vikram Cobra Movie Review: విక్రమ్ కోబ్రా మూవీ రివ్యూ - విక్రమ్ పది గెటప్స్ ఎలా ఉన్నాయంటే

HT Telugu Desk HT Telugu
Aug 31, 2022 01:37 PM IST

Cobra Movie Review: విక్ర‌మ్ హీరోగా అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం కోబ్రా అదే పేరుతో నేడు తెలుగులో విడుద‌లైంది. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లో విడుద‌లైన విక్ర‌మ్ సినిమా ఇది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కిన కోబ్రా సినిమా ఎలా ఉందంటే...

<p>విక్ర‌మ్</p>
విక్ర‌మ్ (Twitter)

Cobra Movie Review: తమిళ చిత్రసీమలో వైవిధ్యతకు చిరునామాగా నిలుస్తుంటాడు హీరో విక్రమ్(Vikram). కెరీర్ ఆరంభం నుంచి కొత్త దారుల్లోనే అడుగులు వేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఇన్నోవేటివ్ కథాంశాలు, ప్రయోగాత్మక పాత్రలతో అగ్రహీరోల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి అనువాద చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు విక్రమ్.

అతడు నటించిన తాజా తమిళ చిత్రం కోబ్రా అదే పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి (srinidhi shetty) హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ (irfan pathan) న‌టుడిగా అరంగేట్రం చేశాడు.

కోబ్రా ద్వారా దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన విక్ర‌మ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడా? కోబ్రా అత‌డికి పూర్వ వైభ‌వాన్ని తెచ్చిపెట్టిందా లేదా అన్న‌ది చూద్దాం

Cobra Movie: కిల్లర్ కోబ్రా ఎవరు?..

స్కాట్లాండ్ యువరాజుతో పాటు ప్ర‌పంచంలోని ప‌లు దేశాల రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు.. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు టర్కీ ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్(ఇర్ఫాన్ పఠాన్). అతడి అన్వేషణలో ఒరిస్సా సీఏం కూడా ఇదే రీతిలో హత్యకు గురయ్యాడనే నిజం తెలుస్తుంది. ఆ ఒక్క క్లూతో ఇండియా వచ్చిన అస్లాన్ .. జూడీ అనే స్టూడెంట్ సహాయంతో కేసు చిక్కుముడి విప్పడం మొదలుపెడతాడు.

ఈ క్రైమ్స్ తో కోబ్రాకు లింక్ ఉందని కనిపెడతాడు. కోబ్రా ఎవరు? మ్యాథ్స్ జీనియస్ మది(విక్రమ్)తో అతడికి ఉన్న సంబంధం ఏమిటి? కోబ్రాతో రిషి (రోషన్ మాథ్యూ)ఈ హత్యలను ఎందుకు చేయిస్తున్నాడు? మది పేరుతో పాటు అతడి రూపంలోనే ఉన్న హ్యాకర్ ఎవరు? మదినే కోబ్రాగా మారాడా? లేదా? మదిని ప్రేమించి భావన (శ్రీనిధి శెట్టి) జీవితం ఏమైంది అన్నదే ఈ చిత్ర కథ.

పది గెటప్ లలో విక్రమ్..

ఒకే సినిమాలో హీరో వివిధ గెటప్ లలో కనిపించడమే కాన్సెప్ట్స్ తమిళంలో చాలా సినిమాలొచ్చాయి. ఈ తరహా కథాంశాలతోకమల్ హాసన్ పలు సినిమాలు చేశారు. విక్రమ్ కూడా అపరిచితుడు, అనేకుడు లాంటి సినిమాలతో మెప్పించారు. కోబ్రా కూడా అదే ఛాయలతో సాగుతుంది. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశానికి విక్రమ్ పది గెటప్ లు అనే పాయింట్ ను జోడించి దర్శకుడు అజయ్ నముత్తు ఈ సినిమాను తెరకెక్కించాడు. అన్నాదమ్ముల అనుబంధం, వారి మధ్య ఏర్పడిన విభేదాలతో పాటు ప్రేమకథను అంతర్లీనంగా చూపించారు.

ఇంట్రావెల్ ట్విస్ట్ బాగుంది...

ఫస్ట్ హాఫ్ మొత్తం వివిధ దేశాల నేతలను కోబ్రా హత్య చేయడం, మరోవైపు ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లామ్ అన్వేషణతో చుట్టూ సినిమా సాగుతుంది. ఛారిటీ కోసం కోబ్రా కిల్లర్ గా మారినట్లుగా చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. విక్రమ్ క్యారెక్టర్ కు సంబంధించి విరామ సమయంలో వచ్చే ట్విస్ట్ బాగుంది.

కోబ్రా, మది ఒక్కరేనా, ఇద్దరా చెబుతూ సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సెకండాఫ్ మొత్తం అన్నాదమ్ముల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ఒకరినొకరు ఎందుకు ద్వేషించుకుంటున్నారు చూపించారు. వారి నేపథ్యం చుట్టూ కథను అల్లుకున్నారు. క్లైమాక్స్ ను రొటీన్ గా ముగించారు.

Cobra movie: కొత్తదనం మిస్..

అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఎంచుకున్న కథలో కొత్తదనం కొరవడింది. ఈ పాయింట్ తో చాలా సినిమాలొచ్చాయి. విక్రమ్ ను డిఫరెంట్ గెటప్ లలో చూపించడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. కథ గురించి ఆలోచించలేదు. ఇంట్రావెల్ ట్విస్ట్ తో పాటు అక్కడక్కడ మలులుపు బాగున్నా అవి సినిమాను నిలబెట్టలేకపోయాయి. నిడివి ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. రెండున్నర గంటల లోపు సినిమాను ముగిస్తే బాగుండేది.

కోబ్రా పాత్రలో విక్రమ్ పరకాయ ప్రవేశం..

పాత్ర ఎదైనా అందులో పూర్తిగా పరకాయ ప్రవేశం చేస్తాడు విక్రమ్. ఇందులో కోబ్రా, మదిగా రెండు కోణాల్లో సాగే క్యారెక్టర్ లో మెప్పించాడు. పది గెటప్ లు బాగున్నాయి. గతంలో విక్రమ్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేయడంతో ప్రేక్షకులకు కొత్తదనం కనపించదు. రిషి అనే విలన్ గా రోషన్ మాథ్యూ మెప్పించాడు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, మృణాళిని రవికి యాక్టింగ్ చేయడానికి ఎక్కువగా అవకాశం దక్కలేదు. ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన క్రికెట్ ఇర్ఫాన్ ఫఠాన్ ఆకట్టుకున్నారు. సీనియర్ యాక్టర్ గా మెప్పించాడు.

ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్లస్

రెగ్యులర్ స్టోరీనే తన స్క్రీన్ ప్లే తో కొత్తగా చెప్పడంలో కొంతవరకు మాత్రమే సఫలమయ్యాడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

Cobra Movie Review: విక్రమ్ ఫ్యాన్స్‌కు మాత్రమే..

ఓవరాల్ గా విక్రమ్ అభిమానులను మాత్రమే కోబ్రా మెప్పిస్తుంది. అతడి యాక్టింగ్ కోసం సినిమాను చూడొచ్చు.

Whats_app_banner