Chiyan Vikram Cobra Twitter Review: ట్విటర్‌లో ఫస్ట్ టాక్ వచ్చేసింది.. విక్రమ్‌కు హిట్ దొరికినట్టేనా?-chiyan vikram new movie cobra twitter review here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiyan Vikram New Movie Cobra Twitter Review Here

Chiyan Vikram Cobra Twitter Review: ట్విటర్‌లో ఫస్ట్ టాక్ వచ్చేసింది.. విక్రమ్‌కు హిట్ దొరికినట్టేనా?

Maragani Govardhan HT Telugu
Aug 31, 2022 10:08 AM IST

Chiyan Vikram Cobra Twitter Review: మూడేళ్ల తర్వాత విక్రమ్ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్ షోల్లో చూసిన వారు తమ స్పందనను సోషల్ మీడియా వేదికగా ద్వారా తెలియజేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కోబ్రా
కోబ్రా (Twitter)

Cobra Movie Twitter Review: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని హీరోయిన్లుగా నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన కథల ఎంపికలో ముందుండే విక్రమ్.. ఈ సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ విషయం చిత్ర ట్రైలర్, టీజర్ చూస్తేనే తెలిసిపోతుంది. తాజాగా ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన కొంతమంది ఆడియన్స్ ట్విటర్ వేదికగా సినిమా ఎలా ఉందో తమ స్పందనను తెలియజేశారు.

దాదాపు మూడేళ్ల తర్వాత విక్రమ్ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోబ్రా ఫస్టాఫ్ బాగుందని కొంతమంది ట్విటర్లో పేర్కొన్నారు. పర్ఫార్మెన్స్ పరంగా విక్రమ్‌కు మంచి పాత్ర దొరికిందని, ఇందులో విభిన్న గెటప్పులో అతడి నటన ఆకట్టుకుంటుందని స్పందనను తెలియజేశారు. ప్రథమార్థం ద్వారా సెకండాఫ్‌కు దర్శకుడు బాగా హైప్ క్రియేట్ చేశాడని చెబుతున్నారు. సెకాండాఫ్ కొంచెం నిదానంగా సాగినప్పటికీ క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకు మరో హైలెట్ అని పేర్కొంటున్నారు.

చాలా రోజుల తర్వాత విక్రమ్‌కు మంచి హిట్ దొరికిందని ఫ్యాన్స్ అంటున్నారు. అజయ్ జ్ఞానముత్తు చాలా పకడ్బంధీగా స్క్రిప్టు రాసుకున్నారని, ఆయన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశారని అంటున్నారు. కామెడీతో పాటు యాక్షన్‌కు కూడా ఇందులో స్కోప్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తిగా విక్రమ్ వన్ మ్యాన్ షోలా సాగిందని తెలుపుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా థియేటర్లలో చూడాల్సిన సినిమాగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన కోబ్రాకు పాజిటివ్ టాక్ రావడంంతో విక్రమ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కోలీవుడ్ నుంచి మరో బ్లాక్‌బాస్టర్ వచ్చిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత విక్రమ్‌కు మంచి హిట్ దొరికినట్లేనని అనిపిస్తోంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. థియేటర్ల ఎదురు సంబురాలు జరుపుకుంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్