Vijay Deverakonda movies: విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలు ఇవే.. అదిరిపోయిన పోస్టర్స్-vijay deverakonda upcoming movies 3 new movies and posters release on vijays 35th birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda Movies: విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలు ఇవే.. అదిరిపోయిన పోస్టర్స్

Vijay Deverakonda movies: విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలు ఇవే.. అదిరిపోయిన పోస్టర్స్

Hari Prasad S HT Telugu
May 09, 2024 04:14 PM IST

Vijay Deverakonda movies: విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అతని అభిమానులకు ఏకంగా మూడు సర్‌ప్రైజ్ లు వచ్చాయి. పీరియడ్ డ్రామా, అడ్వెంచర్ అంటూ భిన్నమైన జానర్లలో రాబోతున్న ఈ మూడు సినిమాలు ఏంటో చూడండి.

విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలు ఇవే.. అదిరిపోయిన పోస్టర్స్
విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలు ఇవే.. అదిరిపోయిన పోస్టర్స్

Vijay Deverakonda movies: విజయ్ దేవరకొండ గురువారం (మే 9) తన 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ తో ఈ బర్త్ డే అతనికి అంత మంచి అనుభూతిని అందించకపోయినా.. ఒక్క రోజే మూడు భిన్నమైన జానర్ల సినిమాలను అనౌన్స్ చేయడం మాత్రం అభిమానులకు కచ్చితంగా పండగ అని చెప్పాలి. మరి ఆ మూడు సినిమాలు ఏంటో చూడండి.

విజయ్ దేవరకొండ రాబోయే సినిమాలు

విజయ్ దేవరకొండ నటించిన చివరి మూవీ ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినా.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుండటం కాస్త ఊరట కలిగించే విషయం.

ఈ నేపథ్యంలో అతని తర్వాతి అడుగులు ఎలా ఉంటాయన్న ఆసక్తి సహజంగానే ఉంది. వీటికి తన బర్గ్ డే రోజే విజయ్ సమాధానం చెప్పాడు. ఏకంగా మూడు సినిమాలు, వాటి ఫస్ట్ లుక్స్ రిలీజ్ కావడం విశేషం.

గౌతమ్ తిన్ననూరితో వీడీ12

నానితో జెర్సీ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరితో వీడీ12 మూవీ తీయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ పీరియడ్ డ్రామాలో విజయ్ ఓ స్పైలా కనిపించనుండటం విశేషం. నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి అసలు నేనెవరో నాకు తెలియదు అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమాపై మేకర్స్ ఆసక్తి రేపారు. నిజానికి గతేడాదే ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ (వీడీ13) కంటే ముందే అనౌన్స్ అయిన మూవీ.

విజయ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ షూటింగ్ ఇంత ఆలస్యం ఎందుకైందో మేకర్స్ వివరించారు. ఓ అసాధారణమైన సినిమాను తీసుకొస్తున్నామని, అత్యుత్తమ సినిమా అందించాలన్న ఉద్దేశం వల్లే మూవీ ఆలస్యమవుతోందని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం పరిసరాల్లో షూటింగ్ జరుగుతోందని, ఈ ప్రాజెక్టు నుంచి త్వరలోనే కీలకమైన అప్డేట్ వస్తుందని వెల్లడించారు. ప్రొడ్యూసర్ నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చేసిన ఈ పోస్ట్ ను విజయ్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు.

ట్యాక్సీవాలా డైరెక్టర్‌తో వీడీ14

గతంలో తనకు ట్యాక్సీవాలా లాంటి హిట్ ఇచ్చిన రాహుల్ సంకీర్త్యన్ తో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్నాడు. వీడీ14 మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా అతని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఓ శాపగ్రస్తమైన భూమి కథ ఇది అంటూ ఈ పోస్టర్ ను విజయ్ షేర్ చేశాడు. "ఇతిహాసాలను ఎవరూ రాయరు.. అవి హీరోల రక్తంతో చెక్కబడతాయి" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఓ శిలపై గుర్రం, దానిపై గంభీరంగా కూర్చొన్న వీరుడి శిల్పం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ మూవీలో విజయ్ పాత్ర ఏంటన్నది తెలియలేదు. ఇది 19వ శతాబ్ద నేపథ్యంలో తెరకెక్కే కథగా తెలుస్తోంది. బ్రిటీష్ వారి కాలంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కే ఓ పీరియడ్, రూరల్ డ్రామా అని గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాహుల్ చెప్పాడు.

రవి కిరణ్ డైరెక్షన్‌లో వీడీ15

ఇక విజయ్ దేవరకొండ నటించబోతున్న మరో మూవీ వీడీ15. ఈ మూవీ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగా ఉంది. "నా చేతులకు అంటిన రక్తం వాళ్ల హత్యలది కాదు.. అది నా పునర్జన్మది" అనే క్యాప్షన్ తో విజయ్ దేవరకొండ ఈ పోస్టర్ పోస్ట్ చేశాడు. రాజావారు రాణిగారు, అశోకవనంలో అర్జున కల్యాణంలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ రవి కిరణ్ తొలిసారి యాక్షన్ జానర్ లో మూవీ తీయబోతున్నాడు.

IPL_Entry_Point