Vijay Deverakonda Family Star: విజయ్ దేవరకొండ నయా మూవీ రిలీజ్ డేట్ ఇదే.. గ్లింప్స్‌ ఎప్పుడంటే!-vijay deverakonda family star movie release date reportedly locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda Family Star: విజయ్ దేవరకొండ నయా మూవీ రిలీజ్ డేట్ ఇదే.. గ్లింప్స్‌ ఎప్పుడంటే!

Vijay Deverakonda Family Star: విజయ్ దేవరకొండ నయా మూవీ రిలీజ్ డేట్ ఇదే.. గ్లింప్స్‌ ఎప్పుడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 13, 2023 08:10 PM IST

Vijay Deverakonda Family Star: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ డేట్ దాదాపు ఖరారైంది. గ్లింప్స్ ద్వారా ఈ తేదీని మూవీ యూనిట్ ప్రకటించనుంది.

పరశురామ్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
పరశురామ్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్

Vijay Deverakonda Family Star: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ ఫిక్స్ అయింది. పరుశురామ్ పేట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ - పరశురామ్ కాంబోలో వచ్చిన గీతగోవిందం గతంలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో ‘ఫ్యామిలీ స్టార్’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది.

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కావడం దాదాపు ఖరారైంది. ఈనెల (అక్టోబర్) 18వ తేదీన ఈ మూవీ గ్లింప్స్ రానుంది. ఈ గ్లింప్స్ ద్వారానే మూవీ రిలీజ్ డేట్‍‍ అధికారికంగా వెల్లడికానుంది. విజయ్ దేవరకొండకు ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ 13వ చిత్రంగా ఉంది.

ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్‍కు తగ్గట్టే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ప్రేమతో పాటు కుటుంబ కథా చిత్రంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగ’, రవితేజ ‘ఈగల్’ రానున్నాయి. ఇక విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ కూడా ఈ రేసులో పోటీ పడనుంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 1న రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేకపోయింది. గతేడాది లైగర్ చిత్రంతో పూర్తిగా నిరాశ పరిచిన విజయ్.. ఈ సంవత్సరం ఖుషితోనూ అంచనాలకు తగ్గట్టు విజయం సాధించలేకపోయాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో మూవీ (VD12) కూడా చేస్తున్నాడు. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. రవి కిరణ్ కోలా డైరెక్షన్‍లో చేయనున్న మూవీ కూడా యాక్షన్ బ్యాక్‍డ్రాపేనని సమాచారం. ఇలా, ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి లవ్ స్టోరీల తర్వాత ఇక యాక్షన్ మోడ్‍లోకి విజయ్ దేవరకొండ దిగనున్నాడు.

IPL_Entry_Point