Vijay Devarakonda Parasuram Movie: అఫీషియ‌ల్ - సంక్రాంతి రేసులోకి విజ‌య్ దేవ‌ర‌కొండ, ప‌ర‌శురామ్ మూవీ-vijay devarakonda parasuram movie to hit the screens in sankranthi 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Devarakonda Parasuram Movie: అఫీషియ‌ల్ - సంక్రాంతి రేసులోకి విజ‌య్ దేవ‌ర‌కొండ, ప‌ర‌శురామ్ మూవీ

Vijay Devarakonda Parasuram Movie: అఫీషియ‌ల్ - సంక్రాంతి రేసులోకి విజ‌య్ దేవ‌ర‌కొండ, ప‌ర‌శురామ్ మూవీ

HT Telugu Desk HT Telugu

Vijay Devarakonda Parasuram Movie: గీత‌గోవిందం త‌ర్వాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత దిల్‌రాజు మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Devarakonda Parasuram Movie: సంక్రాంతి రేసులోకి మ‌రో కొత్త సినిమా చేరింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తాజా సినిమాను సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించాడు. గీత‌గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురామ్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్‌తోక‌లిసి దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప‌ర‌శురామ్ మార్క్ సెన్సిబిలిటీస్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్‌, ఎంట‌ర్‌టైన‌ర్‌మెంట్ క‌ల‌బోత‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు షూటింగ్‌పై కీల‌క‌మైన అప్‌డేట్స్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రివీల్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా షూటింగ్ యాభై శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించారు.

త్వ‌ర‌లోనే టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో 13వ సినిమాగా...దిల్‌రాజు నిర్మాణంలో 54వ మూవీగా ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది.

సంక్రాంతి బ‌రిలో ఐదు సినిమాలు...

ఇప్ప‌టికే సంక్రాంతి రేసులో మ‌హేష్‌బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ‌, ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీతో పాటు ర‌వితేజ ఈగిల్ సినిమాలు ఉన్నాయి. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ, ప‌ర‌శురామ్ మూవీ కూడా చేర‌డంతో సంక్రాంతి పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది.