Chaari 111 First Review: వెన్నెలకిషోర్ నవ్వుల బ్లాస్ట్ - చారి 111 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Chari 111 First Review: వెన్నెలకిషోర్ చారి 111 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ష్యూర్ షాట్ ఎంటర్‌టైనర్ మూవీ ఇదని మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కే కింగ్ అన్నాడు.
Chari 111 First Review: కమెడియన్ వెన్నెలకిషోర్ హీరోగా నటిస్తోన్న చారి 111 మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్పై యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించాడు. చారి 111 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన సైమన్ కే కింగ్ చారి 111 మూవీకి రివ్యూ ఇచ్చాడు. చారి 111... లాక్‌డ్...లోడెడ్...రెడీ టూ ఫైర్ అంటూ సైమన్ కే కింగ్ ట్వీట్ చేశాడు. ష్యూర్ ష్యాట్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోందని పేర్కొన్నాడు. వెన్నెలకిషోర్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసేలా బీజీఎమ్, మ్యూజిక్ ఉంటుందని ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ప్రీమియర్స్‌కు రెస్పాన్స్ అదుర్స్...
ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా చారి 111 మంచి ఫన్ రైడ్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నవ్విస్తూనే థ్రిల్‌ను పంచుతుందని చెబుతున్నారు. స్పై రోల్‌లో వెన్నెలకిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోతుందని అంటున్నారు.
గూఢచారిగా వెన్నెల కిషోర్...
చారి 111 మూవీలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో వెన్నెలకిషోర్‌తో పాటు సంయుక్త విశ్వనాథన్ కూడా స్పై రోల్‌లో కనిపించబోతున్నది. చిన్న విషయానికి కూడా తికమకపడే గూఢచారిగా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్‌టైనర్‌టైనింగ్‌గా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది. డ్యూటీలో ఎప్పడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ అందరి చేత చివాట్లు తినే ఓ గూఢచారి పెద్ద క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.
చారి 111 సినిమాలో మురళీశర్మ తో పాటు బ్రహ్మాజీ, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదితీ సోనీ నిర్మిస్తోంది. మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ మూవీ ఛాయలతో చారి 111 సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో దర్శకుడు కీర్తికుమార్ సుమంత్‌తో మళ్లీ మొదలైంది అనే సినిమా చేశాడు. చారి 111 డైరెక్టర్‌గా అతడి సెకండ్ మూవీ.
టాప్ కమెడియన్...
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కమెడియన్స్‌లో ఒకరిగా వెన్నెలకిషోర్ కొనసాగుతోన్నాడు. స్టార్ హీరోల సినిమాలన్నింటిలో వెన్నెల కిషోర్ తప్పకుండా ఉండాల్సిందే. గత ఏడాది ఇరవైకిపైగా సినిమాలు చేశాడు వెన్నెలకిషోర్, వాల్తేర్ వీరయ్య, బ్రో, భోళాశంకర్, కస్టడీ, సామజవరగమనాతో పాటు చాలా సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మహేష్‌బాబు గుంటూరు కారంతో పాటు హనుమాన్‌లో నటించాడు.
చారి 111తో హీరోగా రీఎంట్రీ...
లాంగ్ గ్యాప్ తర్వాత వెన్నెలకిషోర్ చారి 111 మూవీలో హీరోగా నటిస్తున్నాడు. గతంలో అతడు ఆమె ఓ స్కూటర్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో వెన్నెలకిషోర్ హీరోగా కనిపించాడు. వెన్నెల వన్ అండ్ హాఫ్‌తో పాటు జప్ఫా సినిమాలకు దర్శకత్వం వహించాడు. కమల్‌హాసన్ ఇండియన్ 2 మూవీతో వెన్నెలకిషోర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాగా మార్చి 1 రోజు చారి 111తో పాటు వరుణ్‌తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, భూతద్దం భాస్కర్ నారాయణతో పాటు మరో మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.