Samuthirakani: క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్ డైరెక్ష‌న్‌లో స‌ముద్ర‌ఖ‌ని మూవీ - రాముడి సెంటిమెంట్‌తో టైటిల్‌-samuthirakani comedian dhanraj ramam raghavam movie first look released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samuthirakani: క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్ డైరెక్ష‌న్‌లో స‌ముద్ర‌ఖ‌ని మూవీ - రాముడి సెంటిమెంట్‌తో టైటిల్‌

Samuthirakani: క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్ డైరెక్ష‌న్‌లో స‌ముద్ర‌ఖ‌ని మూవీ - రాముడి సెంటిమెంట్‌తో టైటిల్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 23, 2024 01:34 PM IST

Samuthirakani: టాలీవుడ్ క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తోన్న మూవీకి రామం రాఘ‌వం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

రామం రాఘ‌వం
రామం రాఘ‌వం

Samuthirakani: టాలీవుడ్ క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తోన్నాడు. కామెడీ మూవీ కాకుండా తండ్రీకొడుకుల క‌థ‌తో ఓ ఎమోష‌న‌ల్ సెంటిమెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే లీడ్ రోల్‌లో ధ‌న్‌రాజ్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను అయోధ్య‌లో రాముడి విగ్ర‌హ ప్ర‌తిష్ట సంద‌ర్భంగా రివీల్ చేశారు.

ఈ మూవీకి రామం రాఘ‌వం అనే పేరును ఫిక్స్ చేశారు. ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్‌లో సుముద్ర‌ఖ‌ని, ధ‌న్‌రాజ్ సీరియ‌ల్ లుక్‌లో క‌నిపిస్తోన్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో డిజైన్ చేసిన పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

తండ్రీకొడుకులుగా...

ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ క‌నిపించ‌బోతున్నారు. ఇదివరకు తెలుగు తెర‌పై రాని డిఫ‌రెంట్ పాయింట్‌తో రామంరాఘ‌వం మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ధ‌న్‌రాజ్ తెలిపాడు. ఈ సినిమాకు విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలుల‌లో ఈ సినిమా షూటింగ్‌ను జ‌రిపారు. 'రామం రాఘవంస తెలుగుతో పాటు త‌మిళంలో ఒకేసారి విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు రామం రాఘ‌వం సినిమాను నిర్మిస్తున్నాడు.

రెండు సినిమాల‌కు ప్రొడ్యూస‌ర్‌...

ద‌ర్శ‌కుడిగా ధ‌న్‌రాజ్‌కు రామం రాఘ‌వం ఫ‌స్ట్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. జై సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధ‌న్‌రాజ్ జ‌గ‌డం, పిల్ల జ‌మీందార్‌, గ‌బ్బ‌ర్‌సింగ్‌, రాజుగారి గ‌ది, భాగ‌మ‌తితో పాటు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు. భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తుతో పాటు మ‌రో సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. జ‌బ‌ర్ధ‌స్థ్‌తో పాటు అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోల‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అంతే కాకుండా బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ వ‌న్‌లో ఓ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.

బ్రోతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్ ఎంట్రీ...

మ‌రోవైపు డైరెక్ట‌ర్‌గా, యాక్ట‌ర్‌గా స‌ముద్ర‌ఖ‌ని కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోలుగా న‌టించిన బ్రో మూవీతో గ‌త ఏడాది డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు స‌ముద్ర‌ఖ‌ని. తెలుగులో అల‌వైకుంఠ‌పుర‌ములో, భీమ్లానాయ‌క్‌, క్రాక్‌, స‌ర్కారు వారి పాట సినిమాల‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి రిలీజైన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో హ‌నుమాన్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్‌తో పాటు క‌మ‌ల్‌హాస‌న్ ఇండియ‌న్‌లో స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాడు.

Whats_app_banner