Vithika Sheru: నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు - వరుణ్ సందేశ్‌పై వితికా శేరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vithika Sheru: వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో కాదని వితికా శేరు అన్నది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేడేళ్లుగా వరుణ్ సందేశ్ సినిమాలు చేస్తూనే ఉన్నాడని చెప్పింది. నింద ప్రీ రిలీజ్ ఈవెంట్లో భర్త వరుణ్ సందేశ్‌పై వితికా శేరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Vithika Sheru: వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న నింద మూవీ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ వేడుకలో వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు పాల్గొన్నది. వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో కాదని ఈ ప్రీ రిలీజ్ వేడుకలో వితికా శేరు ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
పదిహేడేళ్లుగా సినిమాలు చేస్తున్నాడు...
ఈ వేడుకలో వితికా శేరు మాట్లాడుతూ ...‘తన సినిమాల వేడుకలు ఎప్పుడూ జరిగిన వరుణ్ సందేశ్ ఇన్వైట్ చేస్తుంటాడు. కానీ రానని ప్రతిసారి సమాధానం చెప్పేదానిని. కానీ నింద కోసం రావాలనిపించింది. ఈ మూవీ కోసం వరుణ్ చాలా ప్రమోషన్స్ చేస్తున్నాడు. మీరు చాలా ఫెయిల్యూర్ చూశారు.
మీకు సరిగా అవకాశాలు రావడం లేదని చాలా మంది వరుణ్‌ను అడగటం చూశా. వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో కాదు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక సినిమాలు వద్దు అని ఎవరైతే అన్ని సర్ధుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతారో వాళ్లు ఫెయిలైనట్లు లెక్క. కానీ వరుణ్ సందేశ్ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వరుణ్ సందేశ్ ఏ సినిమా చేసినా సక్సెస్ కావాలని వంద శాతం కష్టపడతారు. ఏదొక రోజు గట్టిగా పెద్ద హిట్ కొడతాడు" అని అన్నది.
హ్యాపీడేస్...కొత్త బంగారు లోకం తర్వాత...
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ "హీరోగా ఇప్పటివరకు 22, 23 సినిమాలు చేశా. కానీ వాటన్నిటి కంటే నింద నాకు బాగా నచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా తక్కువ రోజుల్లో, లిమిటెడ్ బడ్జెట్లోనే క్వాలిటీతో ఈ సినిమా చేశా. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, ఏమైంది ఈవేళ తర్వాత నా హిట్టు సినిమాల లిస్ట్‌లో నింద చేరుతుంది.
నా కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని వరుణ్ సందేశ్ అన్నాడు. ఎలాంటి వల్గారిటీ లేని క్లీన్ మూవీ ఇది. నిఖిల్ ఎదుగుదలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నిఖిల్, నేను కలిసి 2007లో హ్యాపీడేస్ చేశాం. అప్పుడు నా వయసు 17. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా ఒకే స్టేజ్ మీదకు వచ్చాం. దాదాపు నా సగం లైఫ్ సినిమా ఇండస్ట్రీలోనే గడిచింది. గత ఏడేళ్లుగా నా భార్య వితిక నాకు అండగా ఉంటూ వచ్చింది. ఆమెకు నేను ఎంత చేసినా, ఏం చేసినా తక్కువే అవుతుంది" అని చెప్పాడు. .
ధీర సిద్ధార్థ...
నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. “వరుణ్ సందేశ్ నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు. నా కెరీర్లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్లో ఓ మైల్ స్టోన్‌లా మారాలి. రెండు, మూడేళ్లు వరకు అందరూ మాట్లాడుకునేలా ఈ మూవీ ఉంటుంది అని నిఖిల్” అన్నాడు. . ఈ వేడుకలో తన కొడుకు పేరు నిఖిల్ రివీల్ చేశాడు. కొడుకుకు ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు.
నింద మూవీకి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో శ్రేయారాణి, అనీ, క్యూమధు కీలక పాత్రలు చేస్తోన్నారు.
టాపిక్