Naa Saami Ranga TV Premier: టీవీలోకి వచ్చేస్తున్న నాగార్జున సూపర్ హిట్ మూవీ.. ఛానెల్, టైమ్ వివరాలివే-tv news nagarjuna allari naresh starrer naa saami ranga television premiere date time confirmed by star maa channel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tv News Nagarjuna Allari Naresh Starrer Naa Saami Ranga Television Premiere Date Time Confirmed By Star Maa Channel

Naa Saami Ranga TV Premier: టీవీలోకి వచ్చేస్తున్న నాగార్జున సూపర్ హిట్ మూవీ.. ఛానెల్, టైమ్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 17, 2024 09:49 PM IST

Naa Saami Ranga TV Premiere Date, Time: నా సామిరంగ సినిమా టీవీలో ప్రసారమయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం టీవీ ప్రీమియర్ డేట్, టైమ్ ఫిక్స్ అయ్యాయి.

Naa Saami Ranga TV Premier: టీవీలోకి వచ్చేస్తున్న నాగార్జున సూపర్ హిట్ మూవీ.. ఛానెల్, టైమ్ వివరాలివే
Naa Saami Ranga TV Premier: టీవీలోకి వచ్చేస్తున్న నాగార్జున సూపర్ హిట్ మూవీ.. ఛానెల్, టైమ్ వివరాలివే

Naa Saami Ranga TV Premiere: కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్‍గా నిలిచింది. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని అంచనాలను అందుకుంది. ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. నా సామిరంగ సినిమా ఇప్పుడు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అయింది.

టీవీ ప్రీమియర్ వివరాలు

నా సామిరంగ సినిమా మార్చి 24 తేదీ సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా సంక్రాంతికి థియేటర్లలో ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన ఈ మూవీ టీవీ ఛానెల్‍కు వచ్చేస్తోంది.

ఓటీటీ స్ట్రీమింగ్

నా సామిరంగ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది.

నా సామిరంగ మూవీ 1980ల బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రలు పోషించారు. నాగార్జున సరసన అశికా రంగనాథ్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంలో అషిక బాగా పాపులర్ అయ్యారు. అందంతో పాటు అభినయంతో ఆమె మెప్పించారు. ఇక ఈ మూవీలో అల్లరి నరేశ్‍కు జోడీగా మిర్నా మీనన్, రాజ్ తరుణ్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా చేశారు. నాజర్, షబీర్ కల్లరికల్, రవివర్మ, రావు రమేశ్ కీలకపాత్రల్లో కనిపించారు.

దర్శకుడిగా విజయ్ బిన్నీకి తొలి చిత్రమే అయినా నా సామిరంగ మూవీని అన్ని కమర్షియల్ హంగులతో పక్కా పండుగ సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రం లాభాలు సాధించి హిట్‍గా నిలిచింది. ఈ మూవీకి సుమారు రూ.40కోట్ల వరకు కలెక్షన్లు దక్కాయి. మలయాళ చిత్రం పొరింజు మరియం జోస్ మూవీకి రీమేక్‍గా ఈ మూవీ తెరకెక్కింది. అయితే, తెలుగు తగ్గట్టుగా చాలా మార్పులను చేశారు మేకర్స్.

నా సామిరంగ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీకి దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ చేశారు.

కెప్టెన్ మిల్లర్ తెలుగు టీవీ ప్రీమియర్

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా తెలుగులో టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ మూవీ మార్చి 24వ తేదీనే సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది.

జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలో తమిళంలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. జనవరి 26న తెలుగులోనూ రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కెప్టెన్ మిల్లర్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కెప్టెన్ మిల్లర్ మూవీ తెరకెక్కింది.

IPL_Entry_Point