Naveen Polishetty: ఇది నాకు కష్టమైన సమయం.. కొన్ని నెలలు పడుతుంది: తన పరిస్థితిని వెల్లడించిన హీరో నవీన్ పోలిశెట్టి-tough and painful time for me says naveen polishetty on his injuries ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naveen Polishetty: ఇది నాకు కష్టమైన సమయం.. కొన్ని నెలలు పడుతుంది: తన పరిస్థితిని వెల్లడించిన హీరో నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty: ఇది నాకు కష్టమైన సమయం.. కొన్ని నెలలు పడుతుంది: తన పరిస్థితిని వెల్లడించిన హీరో నవీన్ పోలిశెట్టి

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 17, 2024 02:25 PM IST

Naveen Polishetty: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన పరిస్థితిపై అప్‍డేట్ ఇచ్చారు. తనకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఇది తనకు కష్టమైన సమయం అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు.

Naveen Polishetty: ఇది నాకు కష్టమైన సమయం.. కొన్ని నెలలు పడుతుంది: తన పరిస్థితిని వెల్లడించిన హీరో నవీన్ పోలిశెట్టి
Naveen Polishetty: ఇది నాకు కష్టమైన సమయం.. కొన్ని నెలలు పడుతుంది: తన పరిస్థితిని వెల్లడించిన హీరో నవీన్ పోలిశెట్టి

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస హిట్‍లతో మంచి జోరు మీద ఉన్నారు. ఎలాంటి సినీ బ్యాక్‍గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఇలా హ్యాట్రిక్ హిట్‍లతో అదరగొట్టారు. ముఖ్యంగా తన యాక్టింగ్ టాలెంట్‍తో అందరినీ మెప్పించారు. అయితే, ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత నవీన్ కనిపించలేదు. ఏ మూవీ స్టార్ట్ చేయలేదు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ సహా మరో రెండు బ్యానర్లకు ఓకే చెప్పినా ఆ చిత్రాలు మొదలవలేదు. దీంతో నవీన్‍కు ఏమైంది అన్న సందేహాలు వచ్చాయి.

అమెరికాలో జరిగిన బైక్ ప్రమాదంలో నవీన్ పోలిశెట్టికి గాయాలయ్యాయని ఇటీవలే సమాచారం బయటికి వచ్చింది. అయితే, అప్పుడు అధికారికంగా నవీన్ ఏమీ చెప్పలేదు. దీంతో ఏమైందోననే టెన్షన్ నెలకొంది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు నవీన్ పోలిశెట్టి స్పందించారు. తనకు గాయాలయ్యాయని, పూర్తిగా కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని నేడు (జూలై 17) వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశారు.

చేతికి, కాలికి గాయాలు

తన చేతికి, కాలికి గాయలయ్యాయని, కోలుకునే ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోందని నవీన్ పోలిశెట్టి వెల్లడించారు. “నేను మీతో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. దురదృష్టవశాత్తు ఇటీవల నా కుడి చేతికి కొన్ని గాయాలయ్యాయి. కాలికి కూడా దెబ్బలు తగిలాయి. ఇది నాకు ఎంతో కఠినమైన, బాధాకరమైన సమయం. ముఖ్యంగా నేను వేగంగా మీ ముందుకు సినిమాలు తీసుకురాలేకపోతున్నందుకు క్షమించండి” అని నవీన్ పోలిశెట్టి రాసుకొచ్చారు. చేతికి కట్టుతో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

గత కొన్ని రోజులు తనకు చాలా కష్టంగా గడిచాయని నవీన్ పేర్కొన్నారు. వైద్య నిపుణుల సాయంతో పూర్తిగా కోలుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే, కోలుకునే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, అందుకే ఇప్పుడు షూటింగ్ చేయలేకున్నానని అన్నారు. పూర్తిగా కోలుకుంటే బెస్ట్ ఇచ్చేలా ఎనర్జిటిక్‍గా పర్ఫార్మ్ చేయగలనని తెలిపారు.

కొన్ని నెలలు పడుతుంది

తాను పూర్తిగా కోలుకునేందుకు కొన్ని నెలలు పడుతుందని నవీన్ పోలిశెట్టి వెల్లడించారు. ముందుకంటే మరింత బలంగా తిరిగి వస్తానని పేర్కొన్నారు. తన తదుపరి సినిమాలపై చాలా ఆసక్తిగా ఉన్నానని, పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాను పూర్తిగా కోలుకున్నాక షూటింగ్‍లో పాల్గొంటానని పేర్కొన్నారు. అందరి మద్దతుకు థాంక్యూ అని వెల్లడించారు.

నవీన్ పోలిశెట్టి ఇప్పటికే వరుస చిత్రాలకు ఓకే చెప్పారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, నిహారిక ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లకు సినిమాలు చేసేందుకు అంగీకరించారు. అయితే, హఠాత్తుగా గాయాలవటంతో మరింత ఆలస్యం కానుంది. ప్రస్తుతం షూటింగ్‍కు ముందు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

నవీన్ పోలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రం గతేడాది సెప్టెంబర్‌లో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. సుమారు రూ.50కోట్లకు పైగా కలెక్షన్లను ఈ చిత్రం సాధించింది. పి.మహేశ్ బాబు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరోసారి తన మార్క్ యాక్టింగ్‍తో నవీన్ పోలిశెట్టి మెప్పించారు. కమ్‍బ్యాక్‍లో అనుష్క శెట్టి కూడా మెప్పించారు.

Whats_app_banner