Bigg Boss Telugu 6 Episode 65: ఇనాయా ఫేక్ అంటూ ఫైమా ఫైర్.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని రేవంత్‌కు వాసంతి వార్నింగ్!
Bigg Boss Telugu 6 Episode 65: బిగ్‌బాస్ పదో వారం నామినేషన్లో మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. శ్రీసత్య.. బాలాదిత్య-ఇనాయ, ఆదిరెడ్డి.. ఇనాయ-రేవంత్, వాసంతి.. ఇనాయా-ఆదిరెడ్డి, రేవంత్.. వాసంతి-ఆదిరెడ్డి, కీర్తి.. శ్రీహాన్-ఇనాయ, బాలాదిత్య.. శ్రీహాన్-ఇనాయ, మెరీనా.. ఆదిరెడ్డి-ఇనాయ, రాజ్.. ఇనాయ-శ్రీహాన్, రోహిత్.. రేవంత్-ఆదిరెడ్డి, ఫైమా.. వాసంతి-మెరీనా, శ్రీహాన్.. కీర్తి-ఇనాయ, ఇనాయ-ఫైమా-శ్రీహాన్‌లను నామినేట్ చేశారు.
Bigg Boss Telugu 6 Episode 65: బిగ్‌బాస్ సీజన్ 6 ఆలస్యంగా పుంజుకుంది. మొదటి 6, 7 వారాలు చప్పగా సాగిన ఈ షో.. గత రెండు, మూడు వారాల నుంచి ఆసక్తికరంగా మారింది. రసవత్తరమైన నామినేషన్లు, టాస్కుల్లో గొడవలు, వీకెండ్ క్లాసులు, వినోదాలతో ప్రస్తుతం ఈ షోపై ఆడియెన్స్ ఆదరణ కురిపిస్తున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో గీతూ రాయల్ ఎలిమినేషన్‌తో ఇంటి సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గేమ్ ఆడుతున్న గీతూ ఎలా ఎలిమినేట్ అయిందో అర్థం కాక ఆశ్చర్యపోయారు. ఆదిరెడ్డి అయితే ఏకంగా ఆమెను సీక్రెట్ రూంలో పెట్టారని ఫిక్స్ అయి పోయాడు. కానీ అతడికి తెలియంది ఏంటంటే.. ఆమె బయటకు వచ్చేసింది. బహుశా బాలాదిత్య గొడవ జనాల్లోకి నెగిటివ్‌గా వెళ్లిపోయి ఉంటుందని శ్రీహాన్.. శ్రీసత్యతో అంటాడు.
అనంతరం బిగ్‌బాస్ ఊపు తెచ్చే పాటతో హౌస్ మెట్స్‌ను నిద్రలేపుతాడు. ఉదయాన్నే మెరీనా, కీర్తి తమ నామినేషన్ ఇనాయాకే ఉంటుందని ఒకరికొకురు చెప్పుకుంటారు. అనంతరం నామినేషన్ల పర్వం మొదలవుతుంది. గ్లాసులో ఉన్న నీళ్లు ఇంటి సభ్యుడి ముఖానికి కొట్టి నామినేట్ చేయాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. ముందుగా శ్రీసత్య.. బాలాదిత్య, ఇనాయానును నామినేట్ చేస్తుంది. వీరిద్దరితో ఆమెకు సీరియస్ వాదన నడుస్తుంది. తనను, శ్రీహాన్ గురించి అలా మాట్లాడటం సరికాదంటూ ఇనాయాపై ఫైర్ అవుతుంది శ్రీసత్య. మీరు సూర్య టాపిక్ తీసుకొచ్చారు కాబట్టే నేను అలా చేశానని ఇనాయా ఆమెకు కౌంటర్ ఇస్తుంది.
ఆ తర్వాత ఆదిరెడ్డి.. ఇనాయా, రేవంత్‌ను నామినేట్ చేస్తాడు. దొంగతనం చేయొద్దని చెప్పినా.. చేసినందుకు ఇనాయాను చేసినట్లు చెప్పగా.. అగ్రెసివ్‌నెస్ తెచ్చుకోవాలని రేవంత్‌ను హెచ్చరిస్తాడు ఆదిరెడ్డి. గేమ్‌పై కసిగా ఆడాలి కానీ.. మనుషులపై కసిగా ఆడకూడదంటూ రేవంత్‌కు స్పష్టం చేస్తాడు. ఇందుకు రేవంత్ కూడా ఎదుటి వారి ప్రవర్తన బట్టి తన ప్రవర్తన ఆధారపడి ఉంటుందని కౌంటర్ ఇస్తాడు.
రేవంత్-వాసంతి మధ్య మాటల యుద్ధం..
అనంతరం రేవంత్.. వాసంతి, ఆదిరెడ్డిని నామినేట్ చేస్తాడు. ఫిజికల్ అయ్యానని తనను అంటున్నారు.. నువ్వు కావాలని చేత్తో కొట్టావ్ అని రెండు వారాల క్రితం జరిగిన ఘటనను గుర్తుకు తీసుకొచ్చి ఆమెను నామినేట్ చేశాడు. రెండు వారాల నుంచి అగ్రెసివ్ అని తనను నామినేట్ చేశావని, నువ్వు కూడా అలాగే ఉండావని వాసంతితో అంటాడు. నేను ఒక్కసారి ఎత్తి కొడితేనే మీరు అంతలా అంటున్నారే.. మరి ప్రతిసారి గేమ్‌లో మీరు అందరినీ తోసేయట్లేదా, కావాలనే చేయట్లేదా అని వాసంతి ప్రశ్నించింది. అయితే వాళ్లను నాకు అడ్డు రావద్దని చెప్పండని స్పష్టం చేశాడు. మీకు ఎవరూ అడ్డురాకపోతే ఎవరూ ఆడరు.. మీరొక్కరే ఆడుకోండి అని వాసంతి బదులిచ్చింది. నేనొక్కడినే ఆడాలా? వేరే వాళ్లతో కలిసి ఆడాలా అనేది బిగ్‌బాస్ చెప్తాడు.. మీరు కాదు అంటూ స్పష్టం చేస్తాడు. చాల్లే ఇక నువ్వు వెళ్లు అంటూ రేవంత్‌పై ఫైర్ అవుతుంది వాసంతి. వెళ్లు అంటే నేను వెళ్లిపోను.. వేరేవాళ్లలా నేను చూస్తూ ఊరుకోను. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అన్నీ దగ్గరపెట్టుకుని మాట్లాడండి. అనే రేవంత్ ఘాటుగా రిప్లయి ఇచ్చాడు. ఇందుకు వాసంతి కూడా సేమ్ నువ్వు కూడా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు నాతో అని బదులిచ్చింది. ఒళ్లు అని నేను అనలేదు.. నోరు జారింది మీరే అంటూ రేవంత్ ఫైర్ అయ్యాడు. ప్రాపర్‌గా మాట్లాడటం నేర్చుకో రేవంత్ అనగా.. నువ్వు కూడా అంటూ వాసంతి ఫైర్ అయింది.
ఫైమా-ఇనాయా వాదన..
ఈ ఎపిసోడ్‌కు హైలెట్ ఇనాయా-ఫైమా వాదన.. నువ్వు నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదని ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వు వెనక మాట్లాడతావ్.. ఫేక్.. ఈ హౌస్‌లో ఎవరికీ నచ్చవు. సినిమాలో యాక్టింగ్ చేయి.. ఇక్కడ కాదు.. మనిషిని బ్లేమ్ చేయాలనుకున్నావ్, సోది ముఖం అంటూ ఇనాయాపై సీరియస్ అయింది. ఆమె అనే మాటలకు అలాగే రివర్స్ కౌంటర్ వేస్తూ ఇనాయా కూడా రెచ్చిపోయింది. మధ్యలో నీళ్ల కోసం ఇనాయా.. వెళ్లగా.. నాతో పెట్టుకుంటే నీళ్లు తాగిస్తా అంటూ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఫైమా. ఇందుకు ఇనాయా కూడా నీ వల్ల నీళ్లు తాగలేదు.. నాకు ఇప్పటి వరకు 8 నామినేషన్లు వచ్చాయి.. ప్రతి ఒక్కరితో మాట్లాడి తాగాను అంటూ ఆమెపై ఫైర్ అయింది. నువ్వు గేమ్ ఆడితే నీకు అన్నీ నామినేషన్లు పడేవే కాదు.. అని ఫైమా అనగా.. గేమ్ ఆడాను కాబట్టి నామినేషన్లు వచ్చాయని ఇనాయా స్పష్టం చేసింది. దీంతో వీరి మధ్య గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని పించింది.
ఓ పక్క నామినేషన్లు జరుగుతుంటే శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ జోకులేసుకుంటూ వెకిలి చేష్టలు చేస్తూ పడీ పడీ నవ్వుతుండటంతో బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. ఆ జోకేంటో బయటకు చెప్తే మిగతవాళ్లు కూడా నవ్వుతారు అని హెచ్చరిస్తాడు. నామినేషన్ ప్రక్రియకున్న మర్యాదను కాపాడాలని, కనీసం కెప్టెన్ అయిన తర్వాత కూడా కాపాడితే బాగుంటుందని శ్రీసత్యపై సీరియస్ అవుతారు. దీంతో శ్రీసత్య సారీ చెబుతుంది.
మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా గీతూ చేసిన పనికి ఆదిరెడ్డి మైక్ విసిరేయడంతో అతడి టీమ్ విజయానికి దూరమైన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై బ్లూ టీమ్ సభ్యులు అతడిని నామినేట్ చేశారు. దీంతో ఆది.. అసలు తప్పంతా బిగ్‌బాస్‌దే. ఆయనను నామినేట్ చేయాలి. మన టీమ్‌కు బిగ్‌బాస్ అన్యాయం చేశాడు. మన టీమ్ ఓడిపోవడానికి బిగ్‌బాసే కారణం అని స్పష్టం చేస్తాడు. మొత్తంగా ఈ సారి ఉన్న 12 మందిలో 9 మంది నామినేట్ అవుతారు. కెప్టెన్ శ్రీసత్య, రాజ్, రోహిత్ మినహా మిగిలినవారంతా నామినేషన్‌లో ఉంటారు.
సంబంధిత కథనం