Bigg Boss Telugu Captain This Week: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా శ్రీస‌త్య - ఇనాయాను టార్గెట్ చేసిన ఓన్ టీమ్‌మేట్స్‌-sri satya becomes new captain of the bigg boss house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sri Satya Becomes New Captain Of The Bigg Boss House

Bigg Boss Telugu Captain This Week: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా శ్రీస‌త్య - ఇనాయాను టార్గెట్ చేసిన ఓన్ టీమ్‌మేట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 05, 2022 01:28 PM IST

Bigg Boss Telugu Captain This Week: బిగ్‌బాస్ 6 తెలుగు కొత్త కెప్టెన్‌గా శ్రీస‌త్య ఎంపికైంది. శుక్ర‌వారం జ‌రిగిన కెప్టెన్సీ టాస్క్‌లో గీతూ, ఫైమా స‌పోర్ట్‌తో శ్రీస‌త్య‌ విజ‌యాన్ని సాధించింది. త‌న సొంత టీమ్ మేట్స్ కార‌ణంగానే ఇనాయా ఓట‌మి పాలైంది.

శ్రీస‌త్య
శ్రీస‌త్య

Bigg Boss Telugu Captain This Week: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా శ్రీస‌త్య ఎంపికైంది. శుక్ర‌వారం జ‌రిగిన కెప్టెన్సీ టాస్క్ అనేక మ‌లుపులు తిరుగుతూ సాగింది. కెప్టెన్సీ టాస్క్‌లో చివ‌రి వ‌ర‌కు శ్రీస‌త్య‌కు ఇనాయా గ‌ట్టి పోటీ ఇచ్చింది. కానీ త‌న సొంత టీమ్ మేట్స్ స‌పోర్ట్ లేక‌పోవ‌డంతో ఇనాయా ఓట‌మి పాలైంది.

అంత‌కుముందు మిష‌న్ పాజిబుల్ టాస్క్‌లో ఔట్ అయినా గీతూ నైట్ టైమ్‌లో త‌న టీష‌ర్ట్‌ స్ట్రాప్స్ దొంగ‌త‌నం చేయ‌డంపై ఆదిరెడ్డి సీరియ‌స్ అయ్యాడు. గీతూ రాంగ్ గేమ్ ఆడింద‌ని ఆదిరెడ్డి వాదించాడు. కానీ గీతూ మాత్రం తాను బుద్దిబ‌లంతోనే గేమ్ ఆడాన‌ని అన్న‌ది. ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా జ‌రిగింది.

గీతూ చేసిన అర్గ్యూమెంట్‌కు ఆదిరెడ్డి స‌హ‌నాన్ని కోల్పోయాడు. మైక్‌ను నేల‌పై కొట్టి గేమ్ మ‌ధ్య‌లో నుండి వెళ్లిపోయాడు. గేమ్ ఆడ‌మ‌ని బాలాదిత్య అత‌డిని ఎంత రిక్వెస్ట్ చేసిన విన‌లేదు. ఆ త‌ర్వాత ఫిమేల్ హౌజ్‌మేట్స్ అత‌డిని కూల్ చేశారు. త‌న‌కు తానే ఔట్ అని ప్ర‌క‌టించుకున్నాడు.

గేమ్ మ‌ధ్య‌లో మ‌రోసారి రేవంత్ అగ్రెసివ్‌గా మారిపోయాడు. ఇనాయాను బ‌లంగా తోసేశాడు. రెడ్ టీమ్ ఇంటెన్ష‌న‌ల్‌గానే త‌న‌ను కొడుతున్నార‌ని ఇనాయా ఆరోప‌ణ‌లు చేసింది. అలా ఆడ‌ట‌మే వాళ్ల మ‌గ‌త‌నం అంటూ అన్న‌ది. మ‌గ‌త‌నం గురించి మాట్లాడ‌టంతో నోరు అదుపులో పెట్టుకోమ‌ని గీతూ ఆమెకు వార్నింగ్ ఇచ్చింది.

ఆదిరెడ్డికి బిగ్‌బాస్ వార్నింగ్‌...

మిష‌న్ పాజిబుల్ టాస్క్‌లో ముగిసిన‌ట్లు బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. ఇందులో రెండు జ‌ట్ల స్కోర్లు స‌మానం కావ‌డంతో కెప్టెన్స్ కంటెండ‌ర్ల‌ను ఎంపిక‌చేసే బాధ్య‌త‌ను ఆయ‌న టీమ్ లీడ‌ర్స్‌కు అప్ప‌గించాడు. మైక్ నేల‌కేసి కొట్ట‌డం వ‌ల్ల కెప్టెన్సీకి పోటీప‌డే అర్హ‌తను ఆదిరెడ్డి కోల్పోయాడు.

బిగ్‌బాస్ నిర్ణ‌యంతో ఆదిరెడ్డి అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం రెడ్ టీమ్ నుంచి గీతూ, శ్రీస‌త్య‌, ఫైమా, బ్లూ టీమ్ నుంచి ఇనాయా, వాసంతి, మ‌రీనా పోటీప‌డ్డారు. వారి కోసం ఇచ్చిన బెలూన్ టాస్క్‌లో చివ‌ర‌కు శ్రీస‌త్య విజ‌యాన్ని సాధించింది.

శ్రీస‌త్య విన్‌...

ఈ టాస్క్‌లో త‌మ టీమ్ మెంబ‌ర్స్ వాసంతి, మ‌రీనా..ఇనాయాకు స‌పోర్ట్ చేయ‌లేక‌పోవ‌డంతో ఆమె ఓడిపోయింది. దాంతో శ్రీస‌త్య‌ను కెప్టెన్ కావ‌డంతో రెడ్ టీమ్ అంద‌రూ సంబ‌రాలు చేసుకున్నారు. తాను గెల‌వ‌డానికి కార‌ణ‌మైన గీతూకు శ్రీస‌త్య ముద్దు ఇచ్చింది. శ్రీస‌త్య‌ను కెప్టెన్‌గా శ్రీహాన్ ప్ర‌క‌టించాడు. ఇది రెడ్ టీమ్ విక్ట‌రీ అని శ్రీస‌త్య అనౌన్స్ చేసింది. మ‌న హౌజ్‌లో పెరుగులేదు శ్రీస‌త్య‌కు తిరుగులేదు అంటూ ఫైమా స్లోగాన్స్‌తో సంబ‌రాలు చేసిం

IPL_Entry_Point