2022 highest grossing telugu movies: 2022లో హయ్యెస్ట్ గ్రాసింగ్ టాప్ టెన్ తెలుగు మూవీస్ ఇవే
2022 highest grossing telugu movies: 2022 ఏడాదిలో టాలీవుడ్ చక్కటి విజయాలతో దూసుకుపోతున్నది. ఎనిమిది నెలల కాలంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలుఏవంటే...
2022 highest grossing telugu movies: కరోనా మహమ్మారి తర్వాత బాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలు పరాజయాలతో సతమతమవుతుండగా టాలీవుడ్ మాత్రం అద్భుత విజయాలతో దూసుకుపోతున్నది. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, సీతారామం, బింబిసార, కార్తికేయ 2 సినిమాలు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించి టాలీవుడ్ సత్తాను చాటిచెప్పాయి. 2022లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాలు ఏవంటే...
ఆర్ఆర్ఆర్ - 1200 కోట్లు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ 2022లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల్లో టాప్ పొజిషన్‌లో ఉంది. ఇండియాలో దాదాపు 950 కోట్లు, వరల్డ్ వైడ్‌గా 1200 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన నాలుగో సినిమాగా నిలిచింది. బాహుబలి తర్వాత తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ఇదే.
సర్కారు వారి పాట - 230 కోట్లు
మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట 230 కోట్ల వసూళ్లతో ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించింది. బ్యాంకు రుణాల ఎగవేత అంశానికి కామెడీ, యాక్షన్ అంశాలను జోడించి పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.
భీమ్లానాయక్ - 165 కోట్లు
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లానాయక్ వరల్డ్‌వైడ్‌గా 165 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియమ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
రాధేశ్యామ్ - 154 కోట్లు
రాధేశ్యామ్ ఫ్లాప్‌టాక్‌ను మూటగట్టుకున్న ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ కారణంగా భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. 154 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో నాలుగో ప్లేస్‌లో నిలిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది.
ఎఫ్ 3- 126 కోట్లు
వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్3 చిత్రం ఈ ఏడాది నిర్మాతలకు అత్యధిక లాభాల్ని మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 126 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నది.
నిఖిల్ కార్తికేయ 2 - 115 ప్లస్ కోట్లు
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయాన్ని సాధించింది. కృష్ణతత్వానికి అడ్వెంచర్ థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు చందూ మొండేటి రూపొందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హిందీలోనే 30 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
సీతారామం - 80 కోట్లు
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా అందమైన ప్రేమకథగా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నది. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఆగస్ట్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా 80 కోట్లకుపై వసూళ్లను దక్కించుకున్నది.
ఆచార్య - 76 కోట్లు
చిరంజీవి రామ్‌చరణ్ తొలిసారి కలిసి నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 140 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 76 కోట్ల వసూళ్లను రాబట్టి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.
అడివిశేష్ మేజర్ సినిమా వరల్డ్‌వైడ్‌గా 66 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా, నాగార్జున బంగార్రాజు సినిమా 65 కోట్ల వసూళ్లతో టాప్ టెన్‌లో ఒకటిగా నిలిచింది.
టాపిక్