OTT August Top Movies: ఈనెలలో ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన 8 సినిమాలు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు-top ott movies releases in august kalki 2 raayan munjya to indian 2 on netflix amazon prime video etv win disney hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott August Top Movies: ఈనెలలో ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన 8 సినిమాలు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు

OTT August Top Movies: ఈనెలలో ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన 8 సినిమాలు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 26, 2024 06:59 PM IST

OTT August Top Movies: ఈనెలలో ఓటీటీల్లోకి చాలా సినిమాలు క్యూకట్టాయి. ఇందులో కొన్ని సూపర్ హిట్‍లు, మరికొన్ని ప్లాఫ్‍లు ఉన్నాయి. ఇంకొన్ని నేరుగా ఓటీటీలోకే వచ్చాయి. వాటిలో ఈ ఆగస్టులో ఓటీటీలోకి వచ్చిన ముఖ్యమైన 8 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

OTT August Top Movies: ఈనెలలో ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన 8 సినిమాలు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు
OTT August Top Movies: ఈనెలలో ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన 8 సినిమాలు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు

ఈ నెల (ఆగస్టు)లోనూ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో సినిమాలు వెల్లువలా వచ్చాయి. వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన కల్కి 2898 ఏడీ, రాయన్, ముంజ్య సినిమాలు ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు వచ్చాయి. డిజాస్టర్ మూవీ భారతీయుడు 2 కూడా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. మరిన్ని సినిమాలు కూడా ఈనెలలో స్ట్రీమింగ్‍కు వచ్చాయి. వాటిలో ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్-8 చిత్రాలు ఏవంటే..

కల్కి 2898 ఏడీ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఈనెలలో రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. ఆగస్టు 22వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. అదే రోజున నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీలో అడుగుపెట్టింది. జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ ఎపిక్ మైథో సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఏడీ చిత్రం రూ.1100కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది.

వీరాంజనేయులు విహారయాత్ర

వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేరుగా ఆగస్టు 14వ తేదీన ఈవీటీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సీనియర్ యాక్టర్ నరేశ్ ఈ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

భారతీయుడు 2

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా ఆగస్టు 9న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజైన భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ అయింది. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.

రాయన్

బ్లాక్‍బస్టర్ మూవీ రాయన్ ఆగస్టు 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయింది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సుమారు రూ.170కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్‍బస్టర్ కొట్టింది.

టర్బో

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ కామెడీ సినిమా టర్బో.. ఆగస్టు 8న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన టర్బో మే 23న మలయాళంలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయింది.

డార్లింగ్

టాలెండెట్ యాక్టర్ ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘డార్లింగ్’ తెలుగు సినిమా ఆగస్టు 13వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జూలై 19న థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ రొమాంటిక్ చిత్రం డిజాస్టర్ అయింది.

చందూ చాంపియన్

చందూ చాంపియన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆగస్టు 9వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది.ఈ హిందీ మూవీ తెలుగు, తమిళంలోనూ అందుబాటులో ఉంది. భారత తొలి పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మురళీ కాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్నాన్ని తెరకెక్కించారు దర్శకుడు కబీర్ ఖాన్. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్ర పోషించారు. జూన్ 14న థియేటర్లలో రిలీజైన చందూ చాంపియన్ మోస్తరు కలెక్షన్లు దక్కించుకుంది.

ముంజ్య

బాలీవుడ్ సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా ‘ముంజ్య’ ఆగస్టు 25న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. శార్వరీ వాఘ్, అజయ్ వర్మ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం జూన్ 7న థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయింది. ఆదిత్య ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.130కోట్ల కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ హిట్ సాధించింది.

Whats_app_banner