Sriramakrishna Died: టాలీవుడ్‌లో విషాదం - జెంటిల్‌మెన్, చంద్రముఖి సినిమాల డైలాగ్ రైటర్ శ్రీరామకృష్ణ కన్నుమూత
Sriramakrishna Died: ప్రముఖ సినీ డైలాగ్ రైటర్ శ్రీరామకృష్ణ సోమవారం చెన్నైలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. తెలుగులో జెంటిల్‌మెన్, బొంబాయి, జీన్స్‌తో పాటు 300లకుపైగా డబ్బింగ్ సినిమాలకు శ్రీరామకృష్ణ డైలాగ్స్ అందించారు.
Sriramakrishna Died: సీనియర్ సినీ డైలాగ్ రైటర్ శ్రీ రామకృష్ణ(74) చెన్నైలో కన్నుమూశారు. కన్నుమూత. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామకృష్ణ ఆరోగ్య క్షీణించటంతో రాత్రి 8 గంటలకు తేనాపేటలోని అపోలో హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచాడు. శ్రీరామకృష్ణ స్వస్తలం తెనాలి. సినిమాలపై మక్కువతో 50 ఏళ్ల కిందట చెన్నై వచ్చిన శ్రీరామకృష్ణ అక్కడే స్థిరపడ్డారు. శ్రీరామకృష్ణకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు.
300 సినిమాలకు డైలాగ్స్...
డైలాగ్ రైటర్‌గా డబ్బింగ్ సినిమాలతో తెలుగులో ఫేమస్ అయ్యాడు శ్రీరామకృష్ణ. సుదీర్ఘ సినీ కెరీర్‌లో 300 డబ్బింగ్ సినిమాలకు ఆయన డైలాగ్స్ అందించారు. దిగ్గర దర్శకుడు శంకర్ రూపొందించిన జెంటిల్‌మెన్, అపరిచితుడు, జీన్స్, ఒకే ఒక్కడు తెలుగు వెర్షన్స్‌కు శ్రీరామకృష్ణ డైలాగ్స్ రాశారు. మణిరత్నం తెలుగు డబ్ మూవీస్ అన్నింటికి శ్రీరామకృష్ణనే మాటలు అందించారు.
నాచురల్ డైలాగ్స్…
డబ్బింగ్ సినిమాల్లో శ్రీరామకృష్ణ రాసిన డైలాగ్స్ ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. డబ్బింగ్ అనే ఫీల్ కలకుండా సహజంగా డైలాగ్స్ రాయడం శ్రీరామకృష్ణ ప్రత్యేకతగా చెబుతుంటారు. శంకర్ సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్‌ను పవర్‌ఫుల్‌గా రాయడం...మణిరత్నం సినిమాల్లో ప్రేమ డైలాగ్స్‌ను హృదయాలకు హత్తుకునేలా రాయడం శ్రీరామకృష్ణకే చెల్లింది. రజనీకాంత్, కమల్ హాసన్ , విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోలందరి డబ్బింగ్ సినిమాలకు శ్రీరామకృష్ణ డైలాగ్ రైటర్‌గా పనిచేశారు.
లిరిసిస్ట్‌గా...
తెలుగులో విజయవంతమైన ప్రేమిస్తే సినిమాలో టైటిల్ సాంగ్‌ను శ్రీరామకృష్ణ రాశారు. ఈ పాట అప్పట్లో ఫేమస్ అయ్యింది. ప్రేమిస్తేతో మరికొన్ని డబ్బింగ్ మూవీస్ కోసం పాటలు రాశారు శ్రీరామకృష్ణ.
దర్శకుడిగా…
డైలాగ్ రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా శ్రీరామకృష్ణ ప్రతిభను చాటుకున్నాడు. బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ సినిమాలకు శ్రీరామకృష్ణ దర్శకత్వం వహించాడు. బాలమురళి ఎంఏ సినిమాలో కళ్యాణ చక్రవర్తి, అశ్విని హీరోహీరోయిన్లుగా నటించారు.
సమాజంలో స్త్రీ సినిమాలో సుమన్, విజయశాంతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే కోలీవుడ్ నటుడు శరత్ కుమార్‌ను శ్రీరామకృష్ణ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. దర్శకుడిగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా డైలాగ్ రైటర్‌గా మాత్రం టాలీవుడ్‌లో చాలా ఫేమస్ అయ్యారు శ్రీరామకృష్ణ.
రజనీకాంత్ దర్బార్…
రజనీకాంత్ హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో రూపొందిన దర్బార్ చిత్రానికి చివరిగా శ్రీరామకృష్ణ మాటలు అందించారు. రామకృష్ణ అంత్యక్రియలు చెన్నై సాలిగ్రామంలోని శ్మశాన వాటిక జరిగాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు.