Nikhil Kartikeya 3 update: కార్తికేయ 3 గురించి హీరో నిఖిల్ ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?-tollywood hero nikhil reveal kartikeya movie part 3 update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Hero Nikhil Reveal Kartikeya Movie Part 3 Update

Nikhil Kartikeya 3 update: కార్తికేయ 3 గురించి హీరో నిఖిల్ ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?

Maragani Govardhan HT Telugu
Sep 22, 2022 01:35 PM IST

Nikhil Kartikeya 3 update: కార్తికేయ 3(Kartikeya 3) సినిమా గురించి హీరో నిఖిల్(Nikhil) క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన కార్తికేయ సిరీస్.. సూపర్ సక్సెస్ కావడంతో మూడో భాగం కూడా ఉంటుందని స్పష్టత ఇచ్చాడు.

నిఖిల్
నిఖిల్ (Twitter)

Kartikeya Movie Part 3 update: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ.. కార్తికేయ 2 సినిమాతో పాన్ఇండియా కథానాయకుడిగా మారిపోయాడు. గత నెలలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్‌ను అందుకుంది. అంతేకాకుండా నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. తెలుగులోనే కాకుండా ఉత్తారాది ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు నిఖిల్. కార్తికేయ 3 గురించి వివరించాడు.

“కార్తికేయ సినిమా రెండు భాగాలూ ప్రేక్షకులను బాగా అలరించాయి. అందరి దీవెనలతో కార్తికేయ 3 సినిమా తీయబోతున్నాం. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తామా అని ఆత్రుతగా ఉన్నా. ఎందుకంటే ఈ చిత్రాన్ని 3డీ రూపొందించబోతున్నాం.” అంటూ కార్తికేయ-3 గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నిఖిల్.

గత నెలలో విడుదలైన కార్తికేయ 2 అద్భుత విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణ తత్వం, ద్వారకా నగరం నేపథ్యంలో సాగే ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లతో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.

కార్తికేయ 2 చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం పాన్ఇండియా రేంజ్‌లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్