Karthikeya 2 Bollywood Collection: నాలుగు కోట్ల బిజినెస్ - 31 కోట్ల క‌లెక్ష‌న్స్ - హిందీలో కార్తికేయ 2 రికార్డ్‌-karthikeya 2 has become most profitable movie in bollywood 2022 year ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthikeya 2 Bollywood Collection: నాలుగు కోట్ల బిజినెస్ - 31 కోట్ల క‌లెక్ష‌న్స్ - హిందీలో కార్తికేయ 2 రికార్డ్‌

Karthikeya 2 Bollywood Collection: నాలుగు కోట్ల బిజినెస్ - 31 కోట్ల క‌లెక్ష‌న్స్ - హిందీలో కార్తికేయ 2 రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 16, 2022 06:03 AM IST

Karthikeya 2 Bollywood Collection: నిఖిల్ (Nikhil) హీరోగా న‌టించిన కార్తికేయ 2 చిత్రం బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఐదింత‌ల లాభాల్ని మిగిల్చింది. నెల రోజుల్లో ఈ సినిమాకు వ‌చ్చిన కలెక్షన్స్ ఎంతంటే....

<p>నిఖిల్</p>
<p>నిఖిల్</p> (twitter)

Karthikeya 2 Bollywood Collection: ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ ఫ్రాపిట‌బుల్ సినిమాల్లో ఒక‌టిగా కార్తికేయ 2 నిలిచింది. ఎలాంటి హైప్ లేకుండా ఆగ‌స్ట్ 13న రిలీజ్ అయినా ఈ చిన్న సినిమా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో దాదాపు అర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ దక్కించుకొని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌తో స‌మానంగా బాలీవుడ్‌లో ఈ సినిమా ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న‌ది. హిందీలో హీరో నిఖిల్ కు పెద్దగా మార్కెట్ లేదు.

గతంలో అతడు బాలీవుడ్‌లో సినిమాలు చేయ‌లేదు. అత‌డితో పాటు అనుమ‌ప ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ద‌ర్శ‌కుడు చందూ మొండేటి కూడా హిందీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ కంటెంట్‌ బాగుండ‌టంతో బాలీవుడ్ ప్రేక్ష‌కులు కార్తికేయ 2 ను పెద్ద హిట్ చేశారు. నెల రోజుల్లో ఈ సినిమా బాలీవుడ్ లో 31 కోట్ల కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెన్ నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఊహించ‌ని విధంగా ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కుకు ఐదింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది.

బుధ‌వారం నాటికి హిందీలో 31 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు సమాచారం . కలియుగ సృష్టి ర‌హ‌స్యాల‌ను పొందుప‌రిచిన కృష్ణుడి కంక‌ణాన్ని దుష్ట శ‌క్తుల నుంచి కాపాడే ఓ యువ‌కుడి క‌థ‌తో అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ఈసినిమాను తెర‌కెక్కించారు. ఇందులో నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama parameswaran) హీరోయిన్‌గా న‌టించింది. కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ క‌నిపించారు.