Nikhil Bollywood Entry: బాలీవుడ్ ఎంట్రీపై హింట్ ఇచ్చిన నిఖిల్-nikhil clarifies on his bollywood entry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nikhil Clarifies On His Bollywood Entry

Nikhil Bollywood Entry: బాలీవుడ్ ఎంట్రీపై హింట్ ఇచ్చిన నిఖిల్

Nelki Naresh Kumar HT Telugu
Sep 02, 2022 11:20 AM IST

Nikhil Bollywood Entry:కార్తికేయ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌ర్వాత బాలీవుడ్ నుంచి త‌న‌కు ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని హీరో నిఖిల్ అన్నాడు. బాలీవుడ్ ఎంట్రీపై అత‌డు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నిఖిల్
నిఖిల్ (Twitter)

Nikhil Bollywood Entry: హీరో నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా కార్తికేయ 2 నిలిచింది. కృష్ణ‌త‌త్వానికి అడ్వెంచ‌ర్‌, యాక్ష‌న్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు చందూ మొండేటి రూపొందించిన ఈ చిత్రం వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా బాలీవుడ్‌లో విడుద‌లైన ఈ చిత్రం 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రిచింది.

బాలీవుడ్ అగ్ర హీరోలు ఆమిర్‌ఖాన్ లాల్‌సింగ్ చ‌డ్ఢా, అక్ష‌య్ కుమార్ ర‌క్షాభంద‌న్ కంటే కార్తికేయ 2 ఎక్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించింది. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు చేరువయ్యాడు నిఖిల్. అత‌డి న‌ట‌న బాగుందంటూ బాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

కార్తికేయ 2 సక్సెస్ అనంతరం బాలీవుడ్ నుంచి నిఖిల్‌కు ప‌లు ఆఫ‌ర్స్ వ‌రిస్తున్నాయ‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నిఖిల్ వెల్ల‌డించారు. హీరో పాత్ర‌ల‌తో ఓ రెండు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఇటీవ‌ల త‌న‌ను అప్రోచ్ అయ్యాయ‌ని నిఖిల్ తెలిపాడు. క‌థ‌, తన క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు అన్ని ప‌క్కాగా కుదిరిన త‌ర్వాతే ఆ బ్యాన‌ర్స్ పేర్లు చెబుతాన‌న‌ని అన్నాడు.

కంటెంట్ న‌చ్చితే బాలీవుడ్‌లో సినిమా చేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని తెలిపారు. కార్తికేయ 2 స‌క్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో త‌న త‌దుప‌రి సినిమా స్పై కూడా తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. కాగా కార్తికేయ -2 చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

IPL_Entry_Point