Thug Life Release Date: అదిరిపోయిన కమల్ హాసన్ థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు-thug life release date kamal haasan maniratnam movie teaser to release on 5th june 2025 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thug Life Release Date: అదిరిపోయిన కమల్ హాసన్ థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు

Thug Life Release Date: అదిరిపోయిన కమల్ హాసన్ థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు

Hari Prasad S HT Telugu

Thug Life Release Date: థగ్ లైఫ్ మూవీ టీజర్ అదిరిపోయింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ టీజర్ స్టన్నింగ్ విజువల్స్ తో ఆకట్టుకుంది.

అదిరిపోయిన కమల్ హాసన్ థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు

Thug Life Release Date: కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ థగ్ లైఫ్ (Thug Life). ఈ సినిమా రిలీజ్ డేట్ టీజర్ ను కూడా గురువారం (నవంబర్ 7) రిలీజ్ చేశారు. తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

థగ్ లైఫ్ రిలీజ్ డేట్

కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ మూవీ వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ రిలీజ్ డేట్ రివీల్ చేస్తూ తీసుకొచ్చిన చిన్న టీజర్ అదిరిపోయింది. స్టన్నింగ్ విజువల్స్ తోపాటు కమల్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. కమల్ హాసన్ పుట్టిన రోజు (నవంబర్ 7) సందర్భంగా ఈ చిన్న టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

44 సెకన్ల వీడియోను అతని స్టోరీ.. అతని రూల్స్ అనే క్యాప్షన్ తో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఈ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ద్వారా మూవీ స్టోరీ ఏంటన్నది పెద్దగా రివీల్ చేయలేదు. కమల్ హాసన్ యాక్షన్ సీక్వెన్సెస్, రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది.

ఈ థగ్ లైఫ్ మూవీలో కమల్ హాసన్ ను ఓ పోరాట యోధుడిగా, మన సమకాలీనుడిగా రెండు పాత్రల్లో చూపించారు. అంతేకాదు ఈ చిన్న గ్లింప్స్ వీడియోలో శింబు కూడా కనిపించాడు. ఈ సినిమాలో కమల్ తోపాటు త్రిష కృష్ణన్, జోజు జార్జ్, అలీ ఫజల్, అశోక్ సెల్వన్, పంకజ్ త్రిపాఠీ, నాజర్, ఐశ్వర్య లక్ష్మిలాంటి వాళ్లు కూడా నటించారు.

థగ్ లైఫ్ మూవీ గురించి..

థగ్ లైఫ్ మూవీ టైటిల్ ను గతేడాది కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేయగా.. ఇప్పుడు అతని బర్త్ డే రోజే రిలీజ్ డేట్ టీజర్ ను తీసుకొచ్చారు. టైటిల్ గ్లింప్స్ 3 నిమిషాల పాటు సాగగా.. అందులో థగ్ లైఫ్ థీమ్ సాంగ్ వినిపించింది. ఈ పాటను కేవలం ఓ గంటలోనే రాసినట్లు అప్పట్లో కమల్ హాసన్ చెప్పాడు.

1987లో వచ్చిన నాయకుడు మూవీ తర్వాత కమల్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈ ఏడాది జనవరిలో మొదలైన షూటింగ్ సెప్టెంబర్ లో ముగిసింది. అయితే వచ్చే ఏడాది జూన్ లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కమల్ హాసన్ ఈ థగ్ లైఫ్ మూవీతోపాటు ఇండియన్ 3, కల్కి 2898 ఏడీ సీక్వెల్ మూవీస్ లోనూ నటిస్తున్నాడు.