Thangalaan Box Office: రెండో రోజు పడిపోయిన తంగలాన్ కలెక్షన్స్- అక్కడ లక్షల్లోనే పరిమితం- ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?-thangalaan 2 days worldwide box office collection vikram thangalaan day 2 box office collection thangalaan profit ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thangalaan Box Office: రెండో రోజు పడిపోయిన తంగలాన్ కలెక్షన్స్- అక్కడ లక్షల్లోనే పరిమితం- ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Thangalaan Box Office: రెండో రోజు పడిపోయిన తంగలాన్ కలెక్షన్స్- అక్కడ లక్షల్లోనే పరిమితం- ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 17, 2024 04:06 PM IST

Thangalaan 2 Days Worldwide Collection: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తంగలాన్ ఆగస్ట్ 15న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఫలితంగా తంగలాన్ మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగున్నాయి. ఈ నేపథ్యంలో తంగలాన్‌కు 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం.

రెండో రోజు పడిపోయిన తంగలాన్ కలెక్షన్స్- అక్కడ లక్షల్లోనే పరిమితం- ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?
రెండో రోజు పడిపోయిన తంగలాన్ కలెక్షన్స్- అక్కడ లక్షల్లోనే పరిమితం- ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Thangalaan Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లెటెస్ట్ మూవీ తంగలాన్. విక్రమ్ తన కెరీర్‌లో మరో ప్రయోగాత్మకంగా చిత్రంగా తెరకెక్కిన తంగలాన్ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడులో గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది.

తంగలాన్ 2వ రోజు కలెక్షన్స్

పాపులర్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా జోరుగా సాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో తంగలాన్ మూవీకి రెండో రోజున ఇండియాలో రూ. 4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తమిళం నుంచి రూ. 3.95 కోట్లు, తెలుగు వెర్షన్‌కు రూ.75 లక్షలు, మలయాళంలో రూ. 5 లక్షల వసూళ్లుగా ఉన్నాయి.

తంగలాన్ 2 డేస్ కలెక్షన్స్

ఇక తంగలాన్ మూవీకి 2 రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ. 18.05 కోట్ల నికర వసూళ్లు వచ్చాయి. వీటి నుంచి తమిళంలో రూ. 15.65 కోట్లు, తెలుగు నుంచి 2.25 కోట్లు, మలయాళం నుంచి 15 లక్షల నెట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజున రూ. 1.38 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజున మాత్రం 61 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే రెండో రోజున తంగలాన్ కలెక్షన్స్ పడిపోయి లక్షలకే పరిమితం అయింది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తంగలాన్ చిత్రానికి 2 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 1.99 కోట్ల షేర్, 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. వీటిలో నైజాం నుంచి 96 లక్షలు, సీడెడ్‌ నుంచి 21 లక్షలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 82 లక్షల షెర్ కలెక్షన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తంగలాన్ చిత్రానికి 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా రూ. 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

తంగలాన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 1.99 కోట్ల షేర్ వచ్చింది కాబట్టి ఇంకా రూ. 4.51 కోట్లు వస్తే హిట్ టాక్ తెచ్చుకుంటుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా తంగలాన్ సినిమా రూ. 41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో సినిమాకు 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది.

తంగలాన్ హిట్ కొట్టాలంటే?

తంగలాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినీష్ అయి హిట్ కావాలంటే ఇంకా రూ. 50.45 కోట్ల కలెక్షన్స్ రావాలి. మరి తంగలాన్ మూవీ ముందున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ వసూలు చేస్తుందా అనేది చూడాలి.

Whats_app_banner