Telugu TV Serials latest TRP Ratings: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. టాప్ 10లోకి కొత్త సీరియల్
Telugu TV Serials latest TRP Ratings: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. టాప్ 10లోకి కొత్తగా మరో స్టార్ మా సీరియల్ రావడం విశేషం.
Telugu TV Serials latest TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. జులై 15 నుంచి జులై 21తో ముగిసిన వారానికిగాను ఈ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేశారు. సీరియల్స్ టీఆర్పీ లెక్కించే అధికారిక బార్క్ సైట్ ఈ తాజా రేటింగ్స్ ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ టాప్ 10 చూస్తే కొత్తగా మరో స్టార్ మా సీరియల్ వచ్చి చేరింది.
దీంతో తెలుగు సీరియల్స్ లో తన పట్టును మరింత పెంచుకుంది స్టార్ మా ఛానెల్. టాప్ 10లో ఏకంగా ఏడు ఆ ఛానెల్ కు చెందిన సీరియల్సే కావడం విశేషం. బ్రహ్మముడి, నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, మల్లీలాంటి సీరియల్స్ తోపాటు కొత్తగా ఎద లోయల్లో ఇంద్రధనస్సు సీరియల్ కూడా టాప్ 10లోకి వచ్చింది. ఈ సీరియల్ పదో స్థానంలో ఉంది.
మరోవైపు జీ తెలుగు ఛానెల్ కు చెందిన మూడు సీరియల్స్ మాత్రమే టాప్ 10లో ఉన్నాయి. త్రినయని, ప్రేమ ఎంత మధురం, పడమటి సంధ్యారాగంలాంటి సీరియల్స్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఈ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఆగస్ట్ 2న అప్‌డేట్ అయ్యాయి. ఎప్పటిలాగే స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ కు చెందిన సీరియల్స్ మాత్రమే టాప్ 10లో ఉన్నాయి.
తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ 10 ఇవే
సీరియల్ పేరు | ఛానెల్ | టీఆర్పీ రేటింగ్ |
బ్రహ్మముడి | స్టార్ మా | 15.04 |
నాగ పంచమి | స్టార్ మా | 12.17 |
కృష్ణా ముకుందా మురారి | స్టార్ మా | 11.70 |
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ | స్టార్ మా | 10.37 |
మల్లీ నిండు జాబిలి | స్టార్ మా | 8.70 |
త్రినయని | జీ తెలుగు | 8.58 |
ప్రేమ ఎంత మధురం | జీ తెలుగు | 7.69 |
నువ్వు నేను ప్రేమ | స్టార్ మా | 7.66 |
పడమటి సంధ్యారాగం | జీ తెలుగు | 7.49 |
ఎద లోయల్లో ఇంద్రధనస్సు | స్టార్ మా | 6.90 |