Brahmamudi August 7th Episode : ఇట్స్ కావ్య టైమ్.. రాజ్ ఆఫర్​ను లెక్కచేయని కావ్య.. స్వప్న దొంగ తెలివితేటలు-brahmamudi august 7th episode kavya denies raj designer post in today brahmamudi serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 7th Episode : ఇట్స్ కావ్య టైమ్.. రాజ్ ఆఫర్​ను లెక్కచేయని కావ్య.. స్వప్న దొంగ తెలివితేటలు

Brahmamudi August 7th Episode : ఇట్స్ కావ్య టైమ్.. రాజ్ ఆఫర్​ను లెక్కచేయని కావ్య.. స్వప్న దొంగ తెలివితేటలు

HT Telugu Desk HT Telugu
Aug 07, 2023 07:29 AM IST

Brahmamudi Today Episode : కావ్య తనను అవమానించిన విషయం గురించి బాధపడుతుంది. పుట్టింటికి ఎలా సాయం చేయాలని ఆలోచిస్తుంది. రాజ్ వచ్చి డిజైనర్ పోస్టు ఆఫర్ ఇస్తాడు. కానీ కావ్య తిరస్కరిస్తుంది. మరోవైపు కావ్యను ఇరికించింది స్వప్ననే అని కల్యాణ్ కు తెలిసిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఈరోజు బ్రహ్మముడి సీరియల్
ఈరోజు బ్రహ్మముడి సీరియల్

Today Brahmamudi Episode : అప్పు దగ్గరకు కల్యాణ్ వెళ్తాడు. తన కవితలకు అమ్మాయి రెస్పాండ్ అయిందని చెబుతాడు. దీంతో పేరు ఏంటని అప్పు అడగ్గా.. ఏదేదో చెప్పి.. కనుక్కొమనగా.. అర్జంట్ అంటే వచ్చానని దీని కోసమా అని అప్పు వెళ్లిపోతుంది. నువ్ తప్ప నాకు ఎవరు ఉన్నారు బ్రో.. ఆ పిల్లను పట్టుకోవాలంటే.. నువే హెల్ప్ చేయాలని అంటాడు కల్యాణ్. నా కవితలు మెచ్చుకుందని, నాకు పరీక్ష పెట్టిందని, ప్లీజ్ నా కోసం బ్రో అని రిక్వెస్ట్ చేస్తాడు.

కావ్య కళను గుర్తించిన రాజ్

మరోవైపు కావ్య గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. ఆరు నెలల్లో అప్పు తీర్చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. దుగ్గిరాల ఇంట్లో గొడవ అయిన విషయంపై బాధపడుతుంది. ఇలా అయిదేంటి, కంపెనీలో పని చేసే డబ్బులు తీసుకెళ్తే.. అమ్మవాళ్లు ఈ ఇంటి డబ్బులతో బతుకుతున్నారని జీవితాంతం అంటూనే ఉంటారని ఆలోచనల్లో పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు ఏమండి కాఫీ తెమ్మంటారా అని అడుగుతుంది. నీకో గుడ్ న్యూస్ చెప్పాలని రాజ్ అంటాడు. నేను కళను గుర్తించను అంటావు కదా.., ఇప్పుడు నీ కళకు గుర్తింపు తెచ్చానని చెబుతాడు. రాత్రిపూట.. ఆరు బయట కూర్చొని వేయాల్సిన పని లేదని అంటాడు. జీవితాంతం డిజైన్స్ గీయెుద్దని చెబుతారా అని కావ్య అనగా.. జీవితాంతం డిజైన్స్ గీస్తూ.. ఆఫీసులో కూర్చొమని చెబుతాడు రాజ్.

ఆఫర్ వద్దని చెప్పిన కావ్య

అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసి కావ్య ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కానీ కావ్య మాత్రం.. ఇంట్లో జరిగిన గొడవను గుర్తు చేసుకుంటుంది. ఏంటి రియాక్షన్ లేదు, ఇది విని నువ్ ఎగిరిగంతేస్తావని, ఇన్నాళ్లకు నీ కలను గుర్తించానని సంతోషపడిపోతావని అనుకున్నానను, కానీ స్పందన లేదని ప్రశ్నిస్తాడు రాజ్. ఆలస్యమైందని, ఆ అదృష్టాన్ని దక్కించుకునే అవకాశం లేదని బాధపడుతూ చెబుతుంది కావ్య. నా చేతులు ఖాళీగా ఉన్నాయని, డిజైన్స్ గీయలేనని, డబ్బులు తీసుకోలేనని అంటుంది కావ్య. సారీ మీ ఆఫర్ తిరస్కరిస్తున్నానని చెబుతుంది. అదే ఎందుకు అని రాజ్ ప్రశ్నిస్తాడు.

కావ్యపై రాజ్ సీరియస్

నేను మధ్యతరగతిలో పుట్టినందుకు, కలను నమ్ముకున్నందుకు, అమ్ముకున్నందుకు, ఎందుకో అని బాధపడుతుంది కావ్య. ఎందుకు నిరాశగా మాట్లాడుతున్నావ్, నేను దానంగా, సాయంగా ఇవ్వట్లేదని చెబుతాడు రాజ్. మీరు నా కోసం ఆలోచించినందుకు థాంక్స్ అని కావ్య అనగా.. అర్థమైంది, నా అంతట నేను అడిగేసరికి బెట్టు చేస్తు్న్నావని ఫైర్ అవుతాడు రాజ్. నా కింద పనిచేందుకు నీకు ఇగో అడ్డు వస్తుందని, నీ డిజైన్స్ ఇప్పుడు కంపెనీకి అవసరమని బిల్డప్పులు ఇస్తున్నావని మండిపడతాడు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారని, నా ముఖానికి ఇగో ఒక్కటా అని చెబుతుంది. మీకు డిజైన్స్ అవసరమైతే.. ఆ రోజు నేను గీసి ఇస్తానని, అందుకు నాకు డబ్బు అక్కర్లేదని వివరిస్తుంది. దయచేసి నన్ను బలవంత పెట్టొద్దని, నేను ఎప్పటికీ ఆ ఉద్యోగం చేయలేనని కావ్య చెప్పగా.. మెంటలా నీకు మీ ఇంట్లో వాళ్లు ప్రాబ్లమ్స్ లో ఉన్నారని వాళ్లకి హెల్ప్ చేయాలనుకున్నావ్ కదా అని ప్రశ్నిస్తాడు రాజ్. ఈ జాబ్ చేస్తే.. వాళ్ల ప్రాబ్లమ్ తీరిపోతాయి కదా అని రాజ్ చెబుతుండగా.. దయచేసి నన్ను ఏం అడగకండి అని కావ్య వెళ్లిపోతుంది. రాజ్ ఆపే ప్రయత్నం చేస్తాడు.

నిజం చెప్పిన ధాన్యలక్ష్మి

రాజ్ బయటకు రాగా.. వెనకాలే ఉంటుంది ధాన్యలక్ష్మి. విన్నారా పిన్ని.. మీ కోడలికి ఎప్పుడు అన్యాయం చేస్తున్నారని అంటారుగా.. జాబ్ ఆఫర్ చేస్తే.. వెళ్లిపోయిందని రాజ్ చెబుతాడు. అందులో కావ్య తప్పు ఏం లేదు రాజ్ అంటుంది ధాన్యలక్ష్మి. కావ్య ఉన్న పరిస్థితుల్లో అంతకన్న ఏం చేయగలదు రాజ్.. ఇందాక ఇంట్లో గొడవ జరిగిందని చెబుతుంది. గొడవ మెుత్తం వివరిస్తుంది. ఆమెకు డబ్బులు ఊరికే ఇవ్వలేదని, డిజైన్స్ వేస్తే ఇచ్చానని, అయినా నాకు చెప్పే ఇచ్చిందని రాజ్ అంటాడు.

ఇన్ని మాటలు పడ్డా.. ఏ ఆడపిల్ల అయినా.. ఏం చేయగలదు రాజ్.. సంస్కారం ఉన్న పిల్ల కాబట్టి ఇంట్లో జరిగిన గొడవ నీతో చెప్పలేదని అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి. దీంతో రాజ్ ఆలోచనల్లో పడతాడు. వంటింటిలో కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడేమో నాన్నకు ఇంటి అప్పు చూసుకుంటానని మాట ఇచ్చానని, ఇప్పుడేమో డిజైన్స్ వేసే పరిస్థితి లేదని అనుకుంటుంది. ఇప్పటికిప్పడు అంత డబ్బు సంపాదించే అవకాశం ఎలా దొరుకుతుంది, ఎవరు ఇస్తారని బాధపడుతుంది.

అపర్ణతో మాట్లాడిన రాజ్

మరోవైపు అపర్ణతో రాజ్ మాట్లాడుతాడు. నిన్ను తప్పు పట్టాలని కాదు మమ్మీ.. విషయం తెలుసుకోకుండా తొందర పడ్డావని అంటాడు. తొందర పడ్డాను అంటావా.. తప్పు చేశాను అంటావా అని అపర్ణ ప్రశ్నిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకో, కళావతి తప్పు చేసినప్పుడు నువ్ అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నానో అర్థం చేసుకో అని వివరిస్తాడు. మీరు పెద్దవాళ్లు అయిపోయారు రాజ్ అని అపర్ణ అనగా.. నేను డబ్బులు ఇస్తేనే.. తీసుకెళ్లి వాళ్ల నాన్నకు ఇచ్చిందని చెబుతాడు రాజ్. అది కూడా తను వేసిన డిజైన్స్ కు నేను రెమ్యూనరేషన్ ఇస్తేనే జరిగిందని వివరిస్తాడు. ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెళ్లిందని అపర్ణ అనగా.. నాకు చెప్పే వెళ్లిందని రాజ్ అంటాడు. తను డిజైన్స్ బాగా వేస్తుందని, ఆ మిడిల్ క్లాస్ కాంట్రాక్ట్ వచ్చిందని తాతయ్య నన్ను మెచ్చుకున్నారు కదా.. అది ఒకే కావడానికి కారణం కళావతే అని చెబుతాడు. టైమ్ చూసి.. నేనే చెప్పాలనుకున్నా, నీ చేతులతోనే ఈ లెటర్ కూడా ఇప్పిద్దామనుకున్నా అని తల్లితో రాజ్ చెబుతాడు. కానీ ఈలోపే ఇదంతా జరిగిందని అంటాడు.

అర్థం చేసుకున్న అపర్ణ

ఇందాక.. ఆ కావ్య నిన్ను మోసం చేసి, పుట్టింటికి డబ్బులు తీసుకెళ్తుందనే సరికి నాకు కోపం వచ్చిందని, అలా చేయాల్సిన అవసరం ఏంటని, ఎంత కావాలంటే.. అంత మనమే ఇచ్చేవాళ్లం కదా అని కోపం వచ్చిందని అపర్ణ అంటుంది. సరే మమ్మీ.. నువ్ ఒప్పుకుంటే.. మన కంపెనీలో జాయిన్ చేసుకుంటానని రాజ్ అనగా.. తనకు అంత టాలెంట్ ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదంటాను చెప్పు, ఆడపిల్ల తన కాళ్ల మీద నిల్చొంటాను అంటే.. నాకు కూడా సంతోషమేనని అపర్ణ వివరిస్తుంది. ఈ ఒక్క మాట చాలు మమ్మీ.. నేను తనను ఒప్పిస్తానని రాజ్ వెళ్లిపోతుండగా.. అపర్ణ పిలుస్తుంది. ఈసారి ఇలాంటివి ఏదైనా చేస్తే.. చెప్పి చేయమని చెప్పు, వేరే వాళ్ల ద్వారా తెలుసుకుని తప్పుగా అర్థం చేసుకోవాల్సి వస్తుందని అంటుంది.

రాజ్ కు కావ్య ప్రశ్నలు

గదిలో కావ్య ఫోన్ తీసుకుని ఉంటుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తికి కాల్ చేస్తుంది. వినాయకచవితి వస్తుంది కదా.. అంకుల్ ఈసారి కాంట్రాక్ ఏం ఇవ్వలేదని ప్రశ్నిస్తుంది. అదేంటమ్మా నువ్ షాపుకు రావట్లేదని, కాంట్రాక్ట్ వేరే వాళ్లకు ఇచ్చాను కదా వచ్చేసరికి చూద్దాం అని నాగేశ్వరరావు చెబుతాడు. అలా కొంతమందికి కాల్ చేస్తుంది కావ్య. అప్పుడే రాజ్ వస్తాడు. నీకో గుడ్ న్యూస్ అంటాడు. మా అమ్మ డిజైనర్ గా చేసేందుకు ఒప్పుకుందని చెబుతాడు. ఒకవేళ మీ అమ్మగారు వద్దని అనుంటే.. అని కావ్య ప్రశ్నిస్తుంది. దీంతో రాజ్ ఆలోచనల్లో పడతాడు. చూశారా.. ఈ మౌనమే నన్ను భయపెడుతుందని చెబుతుంది. ఒకవేళ.. మీ అమ్మగారు వద్దంటే.. మధ్యలో నన్ను తీసేస్తే.. ఎలా అని ప్రశ్నిస్తుంది. మా నాన్నగారికి నేను ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలని అడుగుతుంది. సరే ఒకవేళ అన్ని వదిలేసి పని చేద్దామనుకున్నా.. మీరు నాకు ఇచ్చే డబ్బును తీసుకెళ్లి మా నాన్నగారికి ఇస్తే.. మీ ఇంట్లో వాళ్లు ఇక్కడి డబ్బులు దోచుకెళ్తున్నానని అంటారని సీరియస్ అవుతుంది కావ్య. మీరు సాయం చేయకుంటే.. బతకలేక.. రోడ్డున పడేవాళ్లని అంటారని, ఆ మాటలు విని మా వాళ్లు తట్టుకోగలరా అని ప్రశ్నిస్తుంది కావ్య.

ఆఫర్ వద్దని క్లారిటీ ఇచ్చిన కావ్య

ఇప్పటి వరకూ ఎవరి మీద ఆధారపడకుండా.. కష్టాన్ని నమ్ముకుని బతికారని, వయసు మళ్లిన తల్లిదండ్రులకు నా వల్ల ప్రశాంతమైన జీవితమే రావాలి అని అంటుంది. నీ దగ్గర ఈ ప్రాబ్లమ్ కు సరైన సొల్యూషన్ ఉందా అని అడుగుతాడు రాజ్. లేదు అని కావ్య అనగా.. మరి ఇలా పట్టుబడితే ఎలా అని రాజ్ ప్రశ్నిస్తాడు. అన్నిసార్లు ప్లాన్స్ వేసుకుని వెళ్లాలంటే కుదరదని చెబుతుంది కావ్య. కష్టాన్ని నమ్ముకుని వెళ్లి సాధిస్తామని అంటుంది. ఇలాంటి డైలాగ్స్ వినేందుకు బాగుంటాయని, ప్రాక్టికల్ గా కుదరవని చెబుతాడు రాజ్. పూలదారి వేస్తానంటే.. వద్దని వెళ్తున్నావని అంటాడు. మీరు నా కోసం చెబుతున్నారని నేను అర్థం చేసుకోలేనా అని కావ్య అంటుంది. కానీ మీ ఇంట్లో వాళ్లు అనే మాటలు వినలేనని చెబుతుంది. ఎవరు ఏం అనకుండా చూసుకుంటానని రాజ్ అనగా.. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండని అంటుంది కావ్య. దీనికి ఒళ్లంతా పొగరేనని రాజ్ తిట్టుకుంటాడు.

వినాయక చవితి కాంట్రాక్ట్ ఓకే

వంట గదిలోకి వచ్చేస్తుంది. చేయాల్సిన పనులన్నీ చేసేస్తారు, తర్వాత వచ్చి పూల బాట రోజా పూల తోట అని మాట్లాడుతారని తనలతో తాను అనుకుంటుంది. నేను మనిషిని అనుకుంటున్నారా.. గుడిలో గంటను అనుకుంటున్నారా అని ఆలోచిస్తుంది. ఎవరేం చెప్పినా ఏం చేయాలి ఎవరిని అడిగినా పని లేదని అంటున్నారని బాధపడుతుంది. అప్పుడే ఫోన్ వస్తుంది. శ్రీను కాల్ చేస్తాడు. ఈసారి మీ నాన్నకు పెద్ద కాంట్రాక్ ఇచ్చానని, కానీ మీ నాన్న నువ్ రావని వద్దని చెప్పారని అంటాడు. నువ్ రావడం లేదని వేరే వాళ్లకి ఇద్దామనుకుంటున్నానని చెబుతాడు. ఇంకా ఇవ్వలేదని వివరిస్తాడు. అయితే ఆ కాంట్రాక్ట్ మా నాన్నగారికి ఇవ్వమని, నేనే వస్తానని చెబుతుంది కావ్య. రేపే వెళ్లి మీ నాన్నగారికి డబ్బులిచ్చి.. అగ్రిమెంట్ చేయించుకుంటానని అంటాడు శ్రీను. కావ్య సంతోషపడిపోతుంది.

స్వప్న సంబరాలు

నన్ను ఇరికిస్తా అన్నందుకు, ఆ కావ్యే ఇరుక్కుందని, కాదు కాదు నేనే ఇరికించానని స్వప్న సంబరపడిపోతుంది. కావ్య ఇప్పుడల్లా.. నా జోలికి రాదని అనుకుంటుంది. కాకపోతే.. కావ్య చెప్పిన మాట మాత్రం నిజమని, నాకు మూడు నెలలు నిండిన తర్వాత కూడా కడుపు పెరిగినట్టుగా కనిపించాలని ఆలోచిస్తుంది. ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా కడుపు పెరిగినట్టుగా చూపించాలని అనుకుంటుంది స్వప్న. రాహుల్ తో కమిట్ అయి.. ఎలాగైనా కడుపు తెప్పించుకోవాలని ఆలోచిస్తుంది.

తాగొచ్చిన కల్యాణ్

అప్పుడే రాజ్ తాగి వస్తాడు. ఈరోజు నాకు ఆనందంగా ఉందని చెబుతాడు. అందరి ముందు కావ్యను ఇరికించావ్ కదా అంటాడు. నేను ఇరికించడమేంటని స్వప్న అడుగుతుంది. బేబీ నా దగ్గర కూడా దాస్తున్నావా అంటాడు. నువ్ మా పెద్దమ్మ ముందు కావ్యతో ఫొన్ మాట్లాడుతూ.. కావ్యను ఇరికించడం చూశానని అంటాడు. అమ్మో.. నా కడుపు విషయం విని ఉంటే.. రచ్చ అయ్యేదని అనుకుంటుంది. నేను ఏం చేసినా.. నీ కోసమే రాహుల్, ఆ కావ్య నిన్ను అవమానిస్తుంది కదా అంటుంది స్వప్న. మంచి పని చేశావ్ ఐ లవ్ యూ బేబీ అంటాడు కల్యాణ్. మంచి మూడ్ లో ఉన్నట్టు ఉన్నాడని స్వప్న అనుకుంటుంది. మంచి అవకాసం వచ్చిందని ఆలోచిస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner