Telugu TV Serials latest TRP Ratings: స్టార్ మా ఛానెల్ హవా.. తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
Telugu TV Serials latest TRP Ratings: స్టార్ మా ఛానెల్ హవా కొనసాగుతోంది. తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ లో ఆ ఛానెల్ కు చెందిన సీరియల్సే టాప్ 10లో ఎక్కువగా చోటు సంపాదించాయి.
Telugu TV Serials latest TRP Ratings: తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్స్ లో స్టార్ మా ఎందుకు టాప్ లో ఉంటోందన్నది తాజాగా మరోసారి తేలింది. ముఖ్యంగా సీరియల్స్ విషయంలో ఆ ఛానెల్ కు తిరుగే లేకుండా పోతోంది. తాజాగా బయటకు వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్ చూస్తే.. టాప్ 10లో ఏకంగా ఆరు సీరియల్స్ స్టార్ మాలో వచ్చేవే కావడం విశేషం.
తాజాగా జులై 7 నుంచి జులై 14తో ముగిసిన వారానికిగాను తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. మంగళవారం (జులై 25) ఈ లిస్ట్ అప్‌డేట్ అయింది. ఇందులో స్టార్ మాకు చెందిన బ్రహ్మముడి సీరియల్ తన ఆధిపత్యం కొనసాగించింది. ఆ సీరియలే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఎన్నో నెలలుగా బ్రహ్మముడికి తిరుగులేకుండా పోతోంది.
ఇక తాజా టీఆర్పీ రేటింగ్స్ టాప్ 10 లిస్టులో స్టార్ మా కాకుండా నాలుగు జీ తెలుగు సీరియల్స్ కూడా ఉన్నాయి. ఈ రేటింగ్స్ అధికారిక బార్క్ వెబ్ సైట్ నుంచి సేకరించినవి. చాలా కాలంగా తెలుగు సీరియల్స్ లో స్టార్ మా, జీ తెలుగుకు సంబంధించిన సీరియల్సే టాప్ 10లో ఉంటూ వస్తున్నాయి. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగింది.
తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
సీరియల్ పేరు | ఛానెల్ | టీఆర్పీ (అర్బన్ + రూరల్) |
బ్రహ్మముడి | స్టార్ మా | 14.11 |
నాగ పంచమి | స్టార్ మా | 11.21 |
కృష్ణా ముకుందా మురారి | స్టార్ మా | 10.61 |
త్రినయని | జీ తెలుగు | 8.77 |
ప్రేమ ఎంత మధురం | జీ తెలుగు | 8.43 |
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ | స్టార్ మా | 8.28 |
మల్లీ నిండు జాబిలి | స్టార్ మా | 7.89 |
పడమటి సంధ్యారాగం | జీ తెలుగు | 7.76 |
నువ్వు నేను ప్రేమ | స్టార్ మా | 7.64 |
అమ్మాయిగారు | జీ తెలుగు | 6.83 |
టాపిక్